ETV Bharat / sports

రోహిత్​కు ఇదే లాస్ట్ సీజన్​! - వైరల్ అవుతున్న వీడియో - Rohit Sharma Mumbai Indians

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 12:50 PM IST

Rohit Sharma Mumbai Indians : స్టార్ బ్యాటర్, ముంబయి ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ త్వరలో ఐపీఎల్‌కు రిటైర్మెంట్​ చెప్పనున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలు ఆ వీడియోలో ఏముందంటే ?

Rohit Sharma Mumbai Indians
Rohit Sharma Mumbai Indians (Source : Associated Press)

Rohit Sharma Mumbai Indians : ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ త్వరలో ఐపీఎల్‌కు రిటైర్మెంట్​ చెప్పనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే అతడు కేకేఆర్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడుతున్న ఓ వీడియోలో రోహిత్ మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్‌ ఇక అతడికి​ ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని అంటున్నారు. ఆ ఈ క్లిప్‌ను మొదట కోల్​కతా జట్టు తమ ట్విట్టర్ అకౌంట్​లో షేర్ చేయగా, అది కాస్త కాంట్రవర్సీగా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ?

ఇదే చివరి సీజన్!
కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ప్రాక్టీస్​ సెషన్ జరగ్గా అక్కడ రోహిత్‌, కేకేఆర్ సహా కోచ్ అభిషేక్‌ నాయర్‌ కలుసుకున్నారు. ఇద్దరూ మంచి మిత్రులు కావడం వల్ల వాళ్లు కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో కెమెరామెన్ షూట్ చేసిన వీడియోను కేకేఆర్ ఫ్రాంచైజీ అప్​లోడ్ చేసింది.

"ఒక్కొక్కటిగా అన్నీ మారిపోతున్నాయి. అదంతా వాళ్ల మీద ఆధారపడి ఉంది. నేను వాటన్నింటినీ పట్టించుకోను. ఏదేమైనప్పటికీ అది నా ఇల్లు భాయ్‌. ఆ దేవాలయాన్ని నేను నిర్మించాను" అని రోహిత్ అన్నాడు. ఆ తర్వాత ఫ్యాన్స్‌ నినాదాలు చేయడం వల్ల వాళ్లకు అభివాదం చేసిన రోహిత్ మరోసారి నాయర్‌తో మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ, ఆ మాటలు వీడియోలో క్లారిటీగా వినిపించలేదు. అయితే "భాయ్‌ నాదేముంది, ఇదే చివరిది" అని రోహిత్ అన్నాడంటూ నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

  • .

ఇక ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అయిన విషయాన్ని గుర్తించిన కోల్​కతా ఫ్రాంచైజీ వెంటనే ఆ వీడియోను తమ సోషల్ మీడియా అకౌంట్​నుంచి డిలీట్ చేశారు. దీంతో ఈ మ్యాటర్ మరింత కాంట్రవర్సీగా మారింది. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీలో అంతర్గత పోరు జరుగుతోందన్న రూమర్స్ నడుస్తున్న తరుణంలో ఈ వీడియో గురించి అభిమానుల్లో మరింత సీరియస్ చర్చలు జరుగుతున్నాయి.

ఒంటిచేత్తో సిక్సర్స్​ కొట్టిన స్టార్ క్రికెటర్ - వింటేజ్ ధోనీ ఈజ్ బ్యాక్​ - IPL 2024

టీమ్ఇండియాకు కొత్త కోచ్ - 'ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు' - Rahul Dravid Head Coach Tenure

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.