ETV Bharat / sports

టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్‌ - రోహిత్‌కు ఇష్టం లేదా ? - T20 World Cup 2024 Squad

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 12:34 PM IST

Updated : May 14, 2024, 12:45 PM IST

Rohit Sharma T20 World Cup 2024 : రానున్న టీ20 వరల్డ్ కప్​ కోసం బీసీసీఐ టీమ్ఇండియా తుది జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ జట్టులోకి హార్దిక్​ పాండ్యాను తీసుకోవడం పట్ల కెప్టెన్ రోహిత్‌తో పాటు, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇంతకీ ఏమైందంటే ?

Rohit Sharma T20 World Cup 2024
Rohit Sharma T20 World Cup 2024 (Source : Associated Press)

Rohit Sharma T20 World Cup 2024 : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్‌ శర్మ సారధ్యంలో టీ20 ప్రపంచకప్​ కోసం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్‌ పాండ్యాను రోహిత్‌కు డిప్యూటీగా నియమించారు. అయితే, పాండ్యను తుది జట్టులోకి తీసుకున్న విషయం కెప్టెన్ రోహిత్‌తో పాటు, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌కు ఇష్టం లేదంటూ ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఐపీఎల్​లో హార్దిక్ పెర్ఫామెన్సే ఇందుకు కారణమని అందులో రాసుంది. అంతేకాకుండా ఒత్తిడిలోనే పాండ్యను సెలెక్ట్‌ చేసినట్లు ఆ వార్తలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ఈ టీ20 ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ పలికే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆ కథనంలో రాసుంది. అయితే ఈ విషయంపై అటు బీసీసీఐ కానీ ఇటు ప్లేయర్లు కానీ ఇంతవరకు స్పందించలేదు.

మరోవైవు టీ20 ప్రపంచకప్‌నకు తుది జట్టు ప్రకటించిన సమయంలో చీఫ్​ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌, హార్దిక్‌ ఎంపికపై స్పందించాడు. ఐపీఎల్‌లో పేలవ ఫామ్ కనబరిచినప్పటికీ అతడ్ని జట్టులోకి ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన ఆ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే అతడ్ని జట్టులోకి తీసుకున్నట్లు వివరించారు.

టీమ్‌ ఇండియా పూర్తి జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, బుమ్రా, సిరాజ్.

ట్రావెలింగ్ రిజర్వ్‌ : శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్‌, అవేశ్‌ఖాన్‌

జట్టులో మార్పులు ఇంకా ఉంటాయా? - జూన్ 25 వరకు తమ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం ICC నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. ప్లేయర్ ఎవరైనా గాయపడినప్పుడు ఈ మార్పు జరుగుతుంది. ఈ నియమం టోర్నమెంట్‌లోని ప్రతి జట్టుకు వర్తిస్తుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ కోసం డ్రాప్ ఇన్ పిచ్‌లు - అసలు ఈ కొత్త టెక్నాలజీ ఏంటంటే? - ICC T20 World Cup 2024

ఆన్​లైన్​లో టీ20 ప్రపంచకప్‌ జెర్సీ - మీరూ సొంతం చేసుకోవాలా? - ధర ఎంతంటే? - T20 World Cup 2024 Jersey

Last Updated :May 14, 2024, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.