ETV Bharat / sports

టీమ్​ఇండియా వికెట్​ కీపర్‌గా ఫస్ట్ ఛాయిస్​ అతడే! - T20 World cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 8:21 PM IST

.
.

T20 World Cup 2024 Sanju Samson : భారత క్రికెట్‌ అభిమానులు టీ20 వరల్డ్‌ కప్‌ జట్టు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది ఆటగాళ్లు టీమ్‌లో అవకాశం కోసం పోటీ పడుతున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓ రిపోర్టులో ఆసక్తికర విశ్లేషణలు కనిపించాయి. పూర్తి వివరాలు స్టోరోల

T20 World Cup 2024 Sanju Samson : త్వరలో బీసీసీఐ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమ్‌ ఇండియాను అనౌన్స్‌ చేయనుంది. ఎవరికి జట్టులో చోటు దక్కుతుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్కో పొజిషన్‌ కోసం చాలా మంది ప్లేయర్‌లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్ పొజిషన్‌కు గట్టి పోటీ నెలకొంది. ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ వంటి స్టార్ ప్లేయర్‌లు ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

  • వికెట్‌ కీపర్‌ ఎవరు?
    ప్రస్తుత సీజన్‌లో శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 9 మ్యాచ్‌లలో 77.00 యావరేజ్‌, 161.08 స్ట్రైక్ రేట్‌తో 385 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని అత్యుత్తమ స్కోరు 82*.

కేఎల్‌ రాహుల్ 9 మ్యాచ్‌లలో 42.00 యావరేజ్‌, 144 స్ట్రైక్‌ రేట్‌తో 378 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇతరులతో పోలిస్తే రాహుల్ స్ట్రైక్‌ రేట్‌ కొంచెం తక్కువగా ఉంది.

అదే పంత్ 10 మ్యాచ్‌లలో 46.37 యావరేజ్‌, 160.60 స్ట్రైక్ రేట్‌తో, 371 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగుల లిస్టులో ఆరో స్థానంలో ఉన్నాడు. పంత్‌ అత్యుత్తమ స్కోరు 88*.

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ పొందని కిషన్, 9 మ్యాచ్‌లలో 23.55 యావరేజ్‌, 165.62 స్ట్రైక్‌ రేటుతో కేవలం 212 పరుగులు చేశాడు. ఒక్క హాఫ్‌ సెంచరీ బాదాడు. కానీ అతని స్ట్రైక్ రేట్(165.62) ఇతర ప్లేయర్‌లతో పోలిస్తే ఎక్కువగా ఉంది. అయితే వీరందరిలో రాజస్థాన్ రాయల్స్(RR) కెప్టెన్ సంజూ శాంసన్​కే సెలక్టర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిసింది. మొదటి ప్రాధాన్యత అతడికే ఇచ్చేందుకు పరిశీలిస్తున్నారని తెలిసింది.

  • టీమ్‌ సెలక్షన్‌ ఎలా ఉంటుంది?
    టీ20 వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపికలో ఐపీఎల్ ఫామ్ పెద్ద పాత్ర పోషించదని అంచనా. అయితే LSG పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గురించి మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. అయితే అతను గాయంతో బాధపడుతున్నాడు, అతని వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశాలకు అడ్డంకి కానుంది.

    కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌కు సిద్ధమయ్యారు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, నంబర్ వన్ ర్యాంక్ T20I బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఆడే సూచనలు ఉన్నాయి.

    ఆల్ రౌండర్ పొజిషన్‌కి హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్‌ పోటీలో ఉన్నారు. ESPNCricinfo ప్రకారం MI మ్యాచ్‌ల సమయంలో పాండ్యా బౌలింగ్ ఫిట్‌నెస్ ఆందోళన కలిగిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో దాదాపు రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. అయినా పెద్దగా ఆకట్టుకోలేదు.

    ఒకవేళ శివమ్ దూబే, రింకును తీసుకుంటే. బ్యాకప్ కీపర్ లేదా బ్యాకప్ బౌలర్‌ను వదిలేయాల్సి ఉంటుంది. దాదాపు రింకు, బ్యాకప్ పేసర్ మధ్య ఉండవచ్చు. స్పిన్-బౌలింగ్ ఆల్-రౌండర్‌గా అక్షర్ పటేల్ కంటే రవీంద్ర జడేజాకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అక్షర్‌ బ్యాకప్‌గా జట్టులో ఉండవచ్చు. 15 మందితో కూడిన జట్టులో కుల్దీప్ ఏకైక ఫింగర్ స్పిన్నర్‌గా ఉండే అవకాశం ఉంది.

    మహ్మద్ షమీ గాయం భారత ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్‌లను తగ్గించింది. జస్ప్రీత్ బుమ్రా పేస్‌ దళానికి నాయకత్వం వహించనున్నాడు. డెత్ ఓవర్లలో నిరుత్సాహ పరుస్తున్నా, లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన అవేష్ ఖాన్ తన హిట్-ది-డెక్ సామర్ధ్యాలు, ఎత్తు కారణంగా పోటీలో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున పెద్దగా ఆకట్టుకోని సిరాజ్ 9 మ్యాచ్‌లలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

    కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నుంచి హర్షిత్ రాణా, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ మొహ్సిన్ ఖాన్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. అయితే వారి ఫిట్‌నెస్ గరిష్ట స్థాయికి చేరుకోకపోవడం వారి ఎంపిక అవకాశాలను దెబ్బతీస్తుంది.

  • ESPNCricinfo ప్రకారం T20 భారత జట్టు
    టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఉంటారు. మిడిల్ అండ్‌ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకూ సింగ్ అవకాశాలు అందుకుంటారు. ఏకైక స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపికవుతాడు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్, అవేష్ ఖాన్/సిరాజ్ ఉండవచ్చు.

    ఇతర పోటీదారులు: కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ.

    'పాకిస్థాన్ దాన్ని పాటిస్తే ఇక తిరుగుండదు!' - T20 World cup 2024 Pakisthan Team
    పాక్ బోర్డు బిగ్ డెసిషన్​ - ఛాంపియన్స్ ట్రోపీ కోసం ఆ ఈ 3 నగరాలు - ICC Champions Trophy 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.