ETV Bharat / sports

ఖరీదైన వాచ్​లు- BMW కార్​ - ఇషాన్‌ కిషన్‌ నెట్​ వర్త్ ఎంతంటే ? - Ishan Kishan Net Worth

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 5:18 PM IST

Ishan Kishan Net Worth : టీమ్ఇండియాలో అత్యుత్తమ యంగ్​ క్రికెటర్లలో ఒకడిగా పేరొందాడు యంగ్ స్టార్ ఇషాన్ కిషన్​. బీసీసీఐ కాంట్రాక్ట్​లో పేరు లేనప్పటికీ ఇతడికి ఫ్యాన్​ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఖరీదైనా వాచీలు, బైక్స్ ఇలా అన్నింటినీ తన ఫ్యాన్స్​కూ చూపించి ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే ఈ స్టార్ క్రికెటర్ నెట్ వర్త్ ఎంతంటే ?

Ishan Kishan Net Worth
Ishan Kishan Net Worth

Ishan Kishan Net Worth : ఐపీఎల్​ స్టార్ట్ అవ్వకముందు కొంత కాలం వరకు టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ ఇషాన్‌ కిషన్‌ గురించి క్రికెట్ లవర్స్​తో పాటు మాజీలు తెగ మాట్లాడుకున్నారు. రంజీల్లో ప్లేయర్లు ఆడాలన్న రూల్​ను అతడు ఉల్లఘించాడంటూ ఆరోపరణలు ఎదుర్కొంటున్న తరుణంలో బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ పేరు మాయమైపోయింది. దీంతో అతడి కెరీర్​పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ వాటన్నింటికీ కొంత మేర ఫుల్​స్టాప్ పెట్టినట్లు తాజాగా ఐపీఎల్‌లో బరిలోకి దిగాడు. ఇంతకీ ఇషాన్ కిష‌న్‌కు అసలు ఉన్న ఆదాయ వనరులు ఏంటి ? అంత విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడంటే ?

2022-23 సీజన్ కోసం గ్రేడ్ C కాంట్రాక్ట్ పొందిన ఆరుగురు భారతీయ క్రికెటర్లలో ఇషాన్‌ ఒకడు. అదే కాంట్రాక్ట్‌ను పొందిన ఇతర ఆటగాళ్లు సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్ మరియు KS భరత్ ఉన్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఆటగాళ్లకు రూ. 1 కోటి వార్షిక వేతనం లభిస్తుంది. దీంతో పాటు 2022 ఐపీఎల్​ వేలంలో అతడు అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడ్నిరూ.15.25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది.

వీటితో పాటు ఇషాన్ కిషన్ CEAT, Manyavar, Oppo, Noise ఇలా అనేక దేశీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్‌ల ప్రమోషన్స్​ ద్వారా రెమ్యూనరేషన్స్ అందుకున్నాడట. అతని బ్రాండ్ ఎండార్స్‌మెంట్ డీల్‌లతో పాటు, అతను సోషల్ మీడియాలో వివిధ బ్రాండ్‌లను ప్రచారం చేయడం ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడని సమాచారం.

మరోవైపు ఇషాన్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. అతను తాను సంపాదించిన డబ్బుతో తన స్వస్థలమైన పట్నాలో ఓ విశాలమైన ఇంటిని, ముంబయిలో మరో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశాడు.

ఇషాన్ కిషన్‌కు ఖరీదైన, అరుదైన వాచీలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అతని దగ్గర ఫ్రాంక్ ముల్లర్, రోలెక్స్ ఇంకా అరుదైన పాటెక్ ఫిలిప్ వంటి ప్రీమియం అంతర్జాతీయ బ్రాండ్‌ల వాచీ కలక్షన్ ఉంది. దీంతో పాటు కలెక్షన్‌తో పాటు తన గ్యారేజీలో BMW 5 సిరీస్, మెర్సిడెస్ బెంజ్, ఫోర్డ్ ముస్టాంగ్ కార్లు ఉన్నాయి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఇషాన్ కిషన్ తన కుటుంబం, స్నేహితులతో విహారయాత్రలకు వెళుతూనే ఉంటాడు. అక్కడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తాడు.

వామ్మో! ధోనీ గ్యారేజీలో అన్ని బైకులా? పెద్ద షోరూమే పెట్టొచ్చుగా!! - MS Dhoni Bike Collection

మనసులు గెలుకున్న కింగ్ కోహ్లీ - రింకూకు స్పెషల్ గిఫ్ట్​ - Virat Kohli Bat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.