ETV Bharat / sports

వామ్మో! ధోనీ గ్యారేజీలో అన్ని బైకులా? పెద్ద షోరూమే పెట్టొచ్చుగా!! - MS Dhoni Bike Collection

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 5:31 AM IST

MS Dhoni Car Collection
MS Dhoni Bike Collection

MS Dhoni Bike Collection : లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్​ ధోనీ అంటే ఇష్టపడని క్రికెట్​ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ధోనీకి బైక్స్, కార్లు అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రపంచంలోని టాప్​ బైక్స్​ అండ్​ కార్స్​ కలెక్ట్​ చేసి తన గ్యారేజ్​లో పెట్టుకున్నాడు. మరెందుకు ఆలస్యం వాటిపై మనమూ ఓ లుక్కేద్దాం.

MS Dhoni Bike Collection : మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెప్టెన్సీలో ఇండియన్ క్రికెట్ టీమ్​కు ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్​ను సాధించి పెట్టాడు. అలాంటి ఎంఎస్​ ధోనీకి కార్లు, బైక్‌లంటే ఎంతో ఇష్టం. అందుకే అప్పట్లో ఇండియా గెలిచినప్పుడు ఇతర ప్లేయర్లతో కలిసి బైక్​తో గ్రౌండ్​లో చక్కర్లు కొట్టేవాడు.

సెకెండ్ హ్యాండ్​ బైక్​తో ప్రస్థానం!
ధోనీ మొదటిసారిగా యమహా RX100 అనే సెకెండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారు. అలా ఒక సెకెండ్ హ్యాండ్ బైక్​తో మొదలు పెట్టి, నేడు కనీవినీ ఎరుగని బైక్​ కలెక్షన్​తో తమ గ్యారేజీని నింపేశాడు. ఇప్పుడు ఇది అతిపెద్ద బ్రాండ్‌లను కలిగి ఉన్న పూర్తి స్థాయి లెజెండరీ కలెక్షన్‌గా మారిపోయింది. డుకాటి, ఆడి, హమ్మర్, హార్లే డేవిడ్సన్, హయబుసా సహా, మరెన్నో సూపర్​ బైక్​లు ధోనీ కలెక్షన్​లో ఉన్నాయి. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ధోనీకి 100 కంటే ఎక్కువ బైక్‌లు, చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. మరి ఈ లెజెండరీ క్రికెటర్​ ఐకానిక్ గ్యారేజ్‌లో ఏయే బైక్స్, కార్లు ఉన్నాయంటే?

Norton Jubilee 250 : ధోనీ కలెక్షన్​లో నార్టన్ జూబ్లీ 250 ఉంది. ఇది చాలా పాతకాలపు బైక్‌లలో ఒకటి. తలా స్వయంగా ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. తన స్నేహితుడు బైక్‌ను మోడిఫై చేసి మరింత మెరుగులు దిద్దినందుకు అతడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనిలో 250cc ఇంజిన్‌ ఉంటుంది.

Kawasaki Ninja H2 : ఎంఎస్ ధోనీ అద్బుత కలెక్షన్‌లో కవాసకి నింజా హెచ్2 ఒకటి. ఈ 2017 కవాసకి మోడల్‌ను ధర అక్షరాలా రూ.33.30 లక్షలు. దీనిలో 998cc, 4-సిలిండర్, సూపర్​ఛార్జ్డ్​ ఇంజన్​ ఉంటుంది.

Jeep Grand Cherokee : ధోనీ వద్ద జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్‌ ఉంది. ఈ అందమైన 2022 ఎడిషన్‌ కారు ప్రారంభ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. దీని ధర రూ.73 లక్షల 60 వేలు ఉంటుంది.

Mahindra Scorpio : ధోనీ వద్ద మహీంద్రా స్కార్పియో కూడా ఉంది. ఇది ఇండియన్ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన SUVలలో ఒకటిగా నిలిచింది. అయితే ధోనీ దగ్గర ఉన్నది కస్టమ్-బిల్ట్ స్కార్పియో. అంటే ధోనీ తన అభిరుచులకు అనుగుణంగా ఈ కారును తయారు చేశారు. ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Confederate X132 Hellcat : ధోనీ దగ్గరున్న అరుదైన బైక్‌లలో కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ పీస్​లు కేవలం 150 మాత్రమే ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో ఈ బైక్​ను కొనుగోలు చేసిన ఏకైక వ్యక్తిగా ధోని నిలిచాడు. ఈ బైక్‌ హాలీవుడ్ సెలెబ్రిటీలైన బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్, డేవిడ్ బెక్‌హామ్, ర్యాన్ రేనాల్డ్స్​ లాంటి ప్రముఖుల దగ్గర మాత్రమే ఉంది.

Rolls Royce Siver Wraith II 1980s Edition : ఈ లెజెండరీ వికెట్ కీపర్ కమ్​ బ్యాటర్‌ వద్ద రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్ II 1980 ఎడిషన్ కూడా ఉంది. ధోని ఇటీవలే ఈ అందమైన బ్లూ కలర్ కారును కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5 కోట్లకు పైమాటే.

Old Sholay Bike : హార్దిక్ పాండ్యా రాంచీలోని ఎంఎస్ ధోని ఇంటికి వెళ్లినప్పుడు, అతనికి ధోనీ ఈ బైక్​ను చూపించారు. అప్పట్లో షోలే మూవీలో ఈ బైక్​ను ఉపయోగించారు. దీని చూసిన పాండ్యా 'షోలే-2 త్వరలో' అనే క్యాప్షన్​తో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్​లో దీనిని షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటో బాగా వైరల్‌ అయ్యింది.

Land Rover 3 Station Wagon : ధోనీ పాతకాలపు ల్యాండ్ రోవర్ 3 స్టేషన్ వ్యాగన్ సిరీస్‌ను కూడా కొనుగోలు చేశాడు. వాస్తవానికి ఈ కారును 1971లో తయారు చేశారు. ధోనీ ఆన్‌లైన్ క్లాసిక్ కార్ వేలంలో దీన్ని కొన్నారు.

Nissan SUV Jonga : మహేంద్ర సింగ్ ధోనీ గ్యారేజీలో ఉన్న మోస్ట్ పాపులర్ కార్లలో ఒకటి నిస్సాన్ SUV జోంగా. అప్పట్లో దీనిని ఇండియన్ ఆర్మీ ఉపయోగించేది. ముఖ్యంగా దీనిని వస్తువులు తీసుకెళ్లడానికి ఉపయోగించేవారు. మీకు తెలియని ఇంకో విషయం ఏంటి అంటే, ఇదే SUVని క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా కొనుగోలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ స్వయంగా తన కుమార్తె జీవాతో కలిసి కారును శుభ్రం చేస్తూ సోషల్ మీడియాలో ఈ వీడియోను పంచుకున్నాడు.

ఫస్ట్​టైం బైక్​ కొంటున్నారా? ఈ టాప్​-10 టిప్స్​ మీ కోసమే!​ - Two Wheeler Buying Tips

నితిన్ గడ్కరీ మాస్టర్ ప్లాన్​- అదే జరిగితే ఒకేసారి రూ.5.5లక్షలు తగ్గనున్న కార్ల ధరలు! - Hybrid Car Tax Reduction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.