ETV Bharat / sports

ప్లేఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా రాజస్థాన్ రాయల్స్ - మిగిలిన రెండు ఎవరివో? - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 8:43 AM IST

IPL 2024 Rajasthan Royals Play offs : టేబుల్ టాపర్​ కోల్‌కతా నైట్ రైడర్స్‌ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 2024 ఐపీఎల్ ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది. లఖ్​నవూ సూపర్ జెయంట్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం తర్వాత ఇది కన్ఫార్మ్ అయింది.

The Associated Press
IPL 2024 Rajasthan Royals (IPL 2024 Rajasthan Royals)

IPL 2024 Rajasthan Royals Play offs : ఐపీఎల్ 2024లో టేబుల్ టాపర్​ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫాలో అవుతూ రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది. లఖ్​నవూ సూపర్ జెయంట్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం తర్వాత రాజస్థాన్‌కు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ కూడా తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ ఆదివారం(మే 12) జరిగిన మ్యాచ్‌తోనే ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమికి గురి కావడంతో మంగళవారం(మే 14) వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది.

రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం 12 మ్యాచులు ఆడి 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మే15న పంజాబ్ కింగ్స్‌తో ఆడబోయే మ్యాచ్‌లోనూ ఆర్​ఆర్​ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రెండో స్థానంలోనే పదిలంగా ఉంటుంది. ఒకవేళ ఓడిపోయినా ఆ జట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదు.

దిల్లీ క్యాపిటల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మాత్రమే తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే దిల్లీ క్యాపిటల్స్​ లీగ్ మ్యాచులన్నీ పూర్తైపోయాయి. నెట్‌ రన్ రేట్ మైనస్‌గా ఉంది. కాబట్టి దిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ లఖ్​నవూ సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నట్లే. ముంబయి ఇండియన్స్​తో ఆడాల్సి ఉన్న చివరి గేమ్​లో గెలిచినా ఆ జట్టుపై ఏ ప్రభావమూ చూపించదు. ఎందుకంటే ఈ జట్టుకు కూడా నెట్​రన్​రేట్​ తక్కువగా ఉంది. అంటే లఖ్​నవూ దాదాపు లీగ్ దశ నుంచి ఎలిమినేషన్‌కు రెడీ అయినట్లే. దీంతో ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో నిలిచేందుకు మిగిలిన రెండు స్థానాలు ఏ జట్లు దక్కించుకుంటాయోనని ప్రశ్నార్థకంగా మారింది.

ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాలంటే - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు, +0.387 నెట్ రన్ రేట్‌తో కొనసాగుతోంది. అయితే మిగిలిన ఉన్న CSKతో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు 18 పరుగుల తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. లేదంటే లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించాల్సి ఉంటుంది. వీటిల్లో ఏదో ఒకటి చేసి చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్ రేట్​ను క్రాస్ చేస్తే బెంగళూరు ప్లేఆఫ్స్​కు వెళ్లిపోవచ్చు. చెన్నై ఓడిపోవడంతో పాటు సన్‌రైజర్స్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే కూడా ఆర్సీబీకి అవకాశాలు మరింత మెరుగవుతాయి.

CSK అర్హత సాధించాలంటే - ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఈ జట్టు నెట్ రన్ రేట్ +0.528గా ఉంది. చెన్నై తన చివరి మ్యాచ్​లో ఆర్సీబీపై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లిపోతుంది. ఒకవేళ ఆర్సీబీ చేతిలో ఓడిపోయినా నెట్ రన్ రేట్ ఆధారంగా అవకాశాలు ఉంటాయి. లఖ్​నవూ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబయిపై గెలిస్తే చెన్నై, ఆర్సీబీ, దిల్లీ క్యాపిటల్స్‌తో పాటు లఖ్​నవూ ఖాతాలోనూ 14 పాయింట్లు చేరుతాయి. కానీ ఇక్కడ మెరుగైన రన్ రేట్ కారణంగా సీఎస్కేకే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎస్​ఆర్​హెచ్ అర్హత సాధించాలంటే - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లు సాధించింది. +0.406 నెట్ రన్ రేట్‌. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫామ్. ఒక మ్యాచులో గెలిచినా కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ రెండింటిలో ఓడితే అవకాశాలు కష్టం. అప్పుడు 14 పాయింట్లతో నెట్ రన్​రేట్​ విషయంలో ఆర్సీబీ, దిల్లీ, లఖ్​నవూతో పోటీపడాలి.

లఖ్​నవూపై దిల్లీ విజయం - ఈ రెండు జట్ల ప్లే ఆఫ్స్​ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? - IPL 2024

గుజరాత్ కథ ముగిసింది - ఎవరివో ఆ మూడు బెర్తులు? - IPL 2024 PlayOffs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.