ETV Bharat / sports

477కు టీమ్ఇండియా ఆలౌట్‌ - ఆండర్సన్ 700 వికెట్ల రికార్డు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 10:06 AM IST

Updated : Mar 9, 2024, 11:07 AM IST

India Vs England 5th Test
India Vs England 5th Test

India Vs England 5th Test : భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది. ప్రస్తుతం భారత జట్టు 259 పరుగులు ఆధిక్యంలో ఉంది.

India Vs England 5th Test : ధర్మశాల వేదికగా భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో శుభ్​మన్​ గిల్​ (110), రోహిత్‌ శర్మ(103), దేవ్​దత్ పడిక్కల్​ (65), సర్ఫరాజ్‌ ఖాన్(56), యశస్వీ జైస్వాల్‌ (57) పరుగులు స్కోర్ చేశారు. ప్రస్తుతం భారత జట్టు 259 పరుగులు ఆధిక్యంలో ఉంది.

మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్‌ 5 వికెట్లు పడగొట్టగా, అండర్సన్‌ 2, హార్ట్‌లీ 2, స్టోక్స్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (79) టాప్ స్కోరర్​గా విసిటాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో 29 పరుగులు చేసి సెకెండ్ హైయ్యెస్ట్​గా నిలిచాడు. టీమ్ఇండియా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ ఐదు , రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించారు.

India Vs England 5th Test : ఓవర్‌నైట్ స్కోరు 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన రోహిత్​ సేన నిన్నటి స్కోర్​కు మరో నాలుగు పరుగులను మాత్రమే జోడించగలిగింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్​ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా కూడా పెవిలియన్ బాట పట్టాడు.

ఆండర్సన్ 700 వికెట్ల రికార్డు :
James Anderson 700 Wickets : ఇక ఇదే వేదికగా ఇంగ్లాండ్ జట్టు బౌలర్‌ జేమ్స్​ అండర్సన్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ప్లేయర్​గా రికార్డుకెక్కాడు. 187 టెస్టుల్లో అతడు ఈ రికార్డును సాధించాడు. ఇలాంటి అరుదైన ఘనతను అందుకున్న ఏకైక ఫాస్ట్‌ బౌలర్​గా రికార్డుకెక్కాడు. ఇక టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గానూ అండర్సన్‌ స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఆ జాబితాలో 800 వికెట్లతో తొలి స్థానంలో మురళీధరన్‌, రెండో స్థానంలో షేన్‌ వార్న్‌(708) ఉన్నారు.

ఆ మూడు రికార్డులపై ఫోకస్​ - 41 ఏళ్ల వయసులోనూ జేమ్స్ సూపర్ ఫామ్​

రెండో టెస్టుతో ఆండర్సన్‌ ఎంట్రీ - అప్పటికి ఆ ఇద్దరు పుట్టనేలేదు

Last Updated :Mar 9, 2024, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.