ETV Bharat / sports

ఐదో టెస్ట్ తొలి రోజు ఆట పూర్తి - మనోళ్లు దంచేశారు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 5:05 PM IST

Updated : Mar 7, 2024, 6:38 PM IST

ఐదో టెస్ట్ తొలి రోజు ఆట పూర్తి - విజృంభించిన టీమ్​ఇండియా
ఐదో టెస్ట్ తొలి రోజు ఆట పూర్తి - విజృంభించిన టీమ్​ఇండియా

IND VS ENG 2024 Fifth Test : ధర్మశాల వేదికగా జరుగుతున్న టీమ్​ఇండియా - ఇంగ్లాండ్ ఐదో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో టీమ్​ ఇండియా విజృంభించి ఆడింది.

IND VS ENG 2024 Fifth Test : ధర్మశాల వేదికగా జరుగుతున్న టీమ్​ఇండియా - ఇంగ్లాండ్ ఐదో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 83 పరుగుల వెనుకంజలో ఉంది. అయితే ఈ తొలి రోజు ఆటలో టీమ్​ఇండియా విజృంభించి ఆడింది. ఇటు బౌలింగ్‌లో, అటు బ్యాటింగ్‌లో అదరగొట్టి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్​ కోల్పోయి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(52*; 83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్​(26; 39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొనసాగుతున్నారు. యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 57) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అసలు వీరు పోటాపోటీగా బౌండరీలు బాదుతుంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో భారత బౌలర్లు విజృంభించి ఆడారు. తమ అద్భుతమైన బౌలింగ్​లో నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థి బ్యాటర్లను చిత్తుచేశారు. కల్దీప్ యాదవ్ అయితే తొలి రోజే ఇంగ్లాండ్​ను కుప్పకూల్చాడు. ఏకంగా ఐదు వికెట్లు తీసి ఆ జట్టు 218 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలకంగా వ్యవహరించాడు. 15 ఓవర్ల పాటు చేసిన బౌలింగ్​లో 72 పరుగులు ఇచ్చి 5 వికెట్లు దక్కించుకున్నాడు.

అసలు ఇంగ్లాండ్​కు మొదట మంచి ఆరంభమే దక్కింది. కానీ,రెండో సెషన్ నుంచి భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. మంచి ఫామ్​లో ఉన్నట్టు కనిపించిన జాక్ క్రాలీని (79 పరుగులు) కుల్దీప్ యదవ్ బౌల్డ్ చేశాడు. బెన్ డకెట్, ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్​లను వరుసగా పెవిలియన్​కు పంపించేశాడు. ఇక కెరీర్​లోనే మైలురాయి అయిన 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ కూడా 4 వికెట్లు పడగొట్టాడు. అలా ఈ ఇద్దరి స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ చతికిలపడింది. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కించుకున్నాడు.

ఇంగ్లాండ్ ప్లేయర్స్​లో ఓపెనర్ జాక్ క్రాలీ 79 పరుగులతో టాప్ స్కోరర్​గా నిలిచాడు. బెన్ డకెట్ (27 పరుగులు), జోరూట్(26 పరుగులు), జానీ బెయిర్ స్టో(29 పరుగులు) చేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్​తో పాటు మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ కూడా డకౌట్ అయ్యారు.

ఇంగ్లాండ్​తో ఐదో మ్యాచ్​ - రికార్డ్స్​ బ్రేక్ చేసిన రోహిత్, యశస్వి, కుల్దీప్​

ఐపీఎల్ ముందు ధావన్ ధనాధన్​ - 99 నాటౌట్​ - ప్రత్యర్థులు హడల్​!

Last Updated :Mar 7, 2024, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.