ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో ఐదో మ్యాచ్​ - రోహిత్, యశస్వి, కుల్దీప్​ రికార్డులే రికార్డులు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 4:28 PM IST

Updated : Mar 7, 2024, 6:53 PM IST

ఇంగ్లాండ్​తో ఐదో మ్యాచ్​ - రికార్డ్స్​ బ్రేక్ చేసిన రోహిత్, యశస్వి, కుల్దీప్​
ఇంగ్లాండ్​తో ఐదో మ్యాచ్​ - రికార్డ్స్​ బ్రేక్ చేసిన రోహిత్, యశస్వి, కుల్దీప్​

IND VS ENG 2024 Test Series Rohith Sharma : టీమ్ ఇండియా ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. యశస్వి జైశ్వాల్​, కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్ కుల్దీప్ యాదవ్ ఘనతలు సాధించారు. ఆ వివరాలు..

IND VS ENG 2024 Test Series Rohith Sharma : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమ్​ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ సూపర్​ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంటర్నేషనల్​ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్ మార్క్‌ వుడ్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా ఈ మార్క్​ను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ ఇతర ప్లేయర్​ కూడా మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకోలేదు

ఇకపోతే టీమ్‌ఇండియా కెప్టెన్‌ టెస్టుల్లో సిక్సర్ల పరంగా ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ. తొలి ఇన్నింగ్స్‌లో మార్క్‌వుడ్ బౌలింగ్‌లో 151.2 కి.మీ. వేగంతో వచ్చిన షార్ట్‌బాల్‌ను ఫుల్‌షాట్‌తో ఈజీగా ఫైన్‌లెగ్‌ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో డబ్ల్యూటీసీ హిస్టరీలో 50 సిక్స్‌లు బాదిన తొలి భారత ప్లేయర్​గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు.

Kuldeep Yadav 50 Test Wickets : ఇదే మ్యాచ్​లో టీమ్ ఇండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా సరికొత్త రికార్డు సాధించాడు. టాప్ ఆర్డర్​లో బెన్‌ డకెట్‌(27), జాక్‌ క్రాలే(79), ఒలీ పోప్‌(11) వికెట్లను దక్కించుకున్న అతడు మిడిలార్డర్​ బ్యాటర్లు జానీ బెయిర్‌ స్టో(29), బెన్‌ స్టోక్స్‌(0)లను కూడా ఔట్ చేశాడు. అయితే స్టోక్స్‌ వికెట్ తీసిన సందర్భంగా కుల్దీప్‌ సూపర్ రికార్డ్​ను దక్కించుకున్నాడు. టీమ్​ ఇండియా తరఫున తక్కువ బంతుల్లోనే(1871) 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(2205), స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌లను(2520) ఈ చైనామన్‌ బౌలర్‌ అధిగమించాడు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మార్కును చేరుకున్న 17వ భారత బౌలర్‌గా నిలిచాడు.

Yashaswi Jaiswal 1000 Test Runs : టీమ్​ ఇండియా యంగ్​ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్​ కూడా అదిరే రికార్డును అందుకున్నాడు. రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డునే బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్​తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్​ కోహ్లీ పేరిట ఉండేది. అది ఇప్పుడు యశస్వి పేరుకు మారిపోయింది. విరాట్‌ 2016-17లో స్వదేశంలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 8 ఇన్నింగ్స్‌ కలిపి 109.2 యావరేజ్​తో 655 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లాండ్​ సిరీస్‌లో యశస్వి కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో ​93.71 యావరేజ్​తో 655 రన్స్​ను దాటేశాడు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్​లో యశస్వి జైస్వాల్ (57; 58 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్​సెంచరీ బాదడంతో ఇంగ్లాండ్​ జట్టుపై అత్యధిక రన్స్‌ (712) చేసిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అతడు మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో 700కు పైగా రన్స్‌ చేసిన రెండో భారత ప్లేయర్​గానూ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు సునీల్ గావస్కర్‌ వెస్టిండీస్‌పై రెండుసార్లు (774 పరుగులు - 1971, 732 పరుగులు -1979) ఈ ఘనత అందుకున్నాడు.

తొలి భారత ఆటగాడిగా : టెస్టుల్లో తక్కువ (9) మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ప్లేయర్​గానూ యశస్వి రికార్డ్​ క్రియేట్ చేశాడు. అంతకుముందు సునీల్ గావస్కర్‌, ఛెతేశ్వర్‌ పుజారా 11 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను టచ్ చేశారు. అరంగేట్రం చేసిన తర్వాత తక్కువ రోజుల్లో (239) 1000 రన్స్‌ చేసిన భారత ప్లేయర్‌గానూ యశస్వి నిలిచాడు.అంతకుముందు ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్ (299 రోజులు) పేరిట ఉంది. ఇక వినోద్‌ కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధిస్తే, జైశ్వాన్ 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్​ అందుకున్నాడు. టెస్టుల్లో ఒకే జట్టుపై అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌ కూడా జైశ్వాలే కావడం విశేషం. ఇంగ్లాండ్‌పై 26 సిక్స్‌లు బాది సచిన్‌ (25 సిక్స్‌లు అస్ట్రేలియాపై)ను దాటేశాడు.

ఐపీఎల్ ముందు ధావన్ ధనాధన్​ - 99 నాటౌట్​ - ప్రత్యర్థులు హడల్​!

సచిన్​ టు పుజారా- రంజీలో అత్యుత్తమ ప్లేయర్స్ వీరే!

Last Updated :Mar 7, 2024, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.