ETV Bharat / sports

క్రికెట్​లో 'జంపింగ్ జపాంగ్'- వికెట్ సెలబ్రేషన్ వీడియో వైరల్- మీరు చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 7:57 AM IST

Updated : Jan 27, 2024, 9:03 AM IST

Funny Celebrations Cricket: క్రికెట్​ మైదానంలో ప్లేయర్లు తమ గేమ్​తోనే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ సెలబ్రేషన్స్​తోనూ ప్రేక్షకుల్ని ఎంటర్​టైన్ చేస్తారు. ఈ జోన్​లో వెస్టిండీస్ ప్లేయర్లు అందరి కంటే కాస్త ముందుంటారు. తాజా మ్యాచ్​లోనూ ఓ విండీస్ ప్లేయర్ వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. మీరు వీడియో చూశారా?

Funny Celebrations Cricket
Funny Celebrations Cricket

Funny Celebrations Cricket: క్రికెట్​లో ఆయా ప్లేయర్లకు తమ తమ ట్రేడ్​మార్క్ సెలబ్రెషన్స్ ఉంటాయి. అలా ట్రేడ్​మార్క్ సెలబ్రేషన్స్​తో క్రికెటర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. వాళ్లు అలా గ్రౌండ్​లో సెలబ్రేట్ చేసుకుంటే ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొందరు ఢిఫరెంట్​గా తమ విక్టరీని సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియాలో, వార్తల్లో వైరల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా వెస్టిండీస్ క్రికెటర్లైతే ఇలాంటి వాటిల్లో కాస్త ముందుంటారు. ఆటతోనే కాకుండా ఢిఫరెంట్ సెలబ్రేషన్స్​తో ఆడియెన్స్​ను బాగా ఎంటర్​టైన్ చేస్తారు. అలాగే ప్రస్తుతం ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో ఇలాంటి వినూత్న సంబరం జరిగింది.

వెస్టిండీస్ యంగ్ స్పిన్నర్ కెవిన్ సింక్లేర్ జాతీయ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్​లో 48న ఓవర్ బౌలింగ్ చేస్తున్న సిక్లేర్, రెండో బంతికి ఆసీస్ బ్యాటర్​ ఉస్మాన్ కవాజా (75 పరులుగు)ను బోల్తా కొట్టించాడు. సిక్లెర్ బంతిని తప్పుగా అంచనా వేసిన ఖవాజా షాట్ ఆడే ప్రయత్నంలో ఫస్ట్​ స్లిప్​లో ఉన్న ఫీల్డర్​కు దొరికిపోయాడు. దీంతో ఖావాజా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇక అంతర్జాతీయ టెస్టు కెరీర్​లో తొలి వికెట్ దక్కించున్న సింక్లేర్ వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. వికెట్ పడగొట్టిన వెంటనే అమాంతం గాల్లోకి ఎగిరి హై జంప్ చేశాడు. రెండుసార్లు గాల్లోనే గింగిరాలు కొట్టిన సింక్లేర్​ను చూసి ఆటగాళ్లతో సహ ఆడియెన్స్ కూడా ఆశ్చర్యపోయారు.

మ్యాచ్ విషయానికొస్తే: తొలి ఇన్నింగ్స్​లో వెస్టిండీస్ 311 పరుగులకు ఆలౌటైంది. కేవమ్ హోడ్జ్ (71), జొషువా డి సిల్వా (7), కెవిన్ సింక్లేర్ (50), హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, జోష్ హేజిల్​వుడ్ 2, లియన్ 2, ప్యాట్ కమిన్స్ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఆసీస్ 22 పరుగుల వెనుకంలో ఉండగానే 289-9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (75), అలెక్స్ కేరీ (65), కమిన్స్​ (64) రాణించారు. ఇక రెండు రోజుల ఆట ముగిసేసరికి విండీస్ 35 పరుగుల లీడ్​లో కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్​లో విండీస్ ప్రస్తుతం 13-1తో బ్యాటింగ్ చేస్తోంది.

విరాట్ 'సూపర్ మ్యాన్ ఫీట్'- 5 పరుగులు సేఫ్- మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

క్రికెట్​లో ఆల్​టైమ్ బెస్ట్ క్యాచ్- వీడియో చూశారా?

Last Updated : Jan 27, 2024, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.