ETV Bharat / sports

'నా ఇన్నింగ్స్ అతడు చూశాడనుకుంటా'- రోహిత్ మాటలు సీరియస్​గా తీసుకున్న DK! - Dinesh Karthik Rohit Sharma

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 10:51 AM IST

Updated : Apr 16, 2024, 1:11 PM IST

Dinesh Karthik Rohit Sharma
Dinesh Karthik Rohit Sharma

Dinesh Karthik Rohit Sharma: ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ప్రస్తుత ఐపీఎల్ టోర్నీలో సూపర్ ఫామ్​తో దూసుకుపోతున్నాడు. రీసెంట్​గా సన్​రైజర్స్​పై అదరగొట్టిన డీకే మ్యాచ్ అనంతరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Dinesh Karthik Rohit Sharma: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సోమవారం సన్​రైజర్స్​తో మ్యాచ్​లో వీర విహారం చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చిన కార్తీక్ సన్​రైజర్స్ బౌలర్లపై చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7సిక్సర్లతో 83 పరుగులతో చిన్నస్వామి స్టేడియాన్ని ఊపేశాడు. కానీ, భారీ లక్ష్యం కావడం వల్ల ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓడింది. అయిప్పటిప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్​కు మాత్రం ఫిదా అయిపోయారు.

అయితే మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గత మ్యాచ్‌లో ప్రపంచకప్‌ కోసం ఓ కెప్టెన్‌(రోహిత్ శర్మను ఉద్దేశించి) నాపై ఒత్తిడి తెచ్చాడు. అతడు సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​ను కూడా చూశాడని అనుకుంటున్నాను. క్రికెట్ ఆడడానికి అతడు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో స్టంప్స్ మైక్​లో రికార్డైన మాటలు అందరూ విని ఉండాలి. రోహిత్ నన్ను వరల్డ్ కప్ కోసం చెలరేగి ఆడుతున్నాను అన్నాడు. రోహిత్​కు నాపై ఉన్న అపారమైన విశ్వాసం, మద్దతు నేను ఎదగడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను. వరల్డ్​కప్ టీమ్​లో చోటు సాధిస్తా (నవ్వుతూ) ' అని ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. దీంతో 'కార్తిక్ వరల్డ్​కప్​లో ఎంపికవడం పక్కా', 'డీకే రోహిత్ మాటలు సీరియస్​గా తీసుకున్నాడు' అని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇక రీసెంట్​గా ఆర్సీబీ- ముంబయి మ్యాచ్​లో దినేశ్ బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ అతడిని ఫన్నీగా టీజ్ చేశాడు. 'శభాష్ డీకే వరల్డ్​కప్​ ఆడాల్సి ఉంది' అని ఎంకరేజ్​ చేస్తూ నవ్వాడు. ఈ మ్యాచ్​లోనూ దినేశ్ డెత్ ఓవర్లలో చెలరేగిపోయాడు. 23 బంతుల్లోనే మెరుఫు హాఫ్ సెంచరీ చేశాడు. అందులో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల ఉన్నాయి. డీకే ఇన్నింగ్స్​తో ఆర్సీబీ 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కానీ, ఛేదనలో ముంబయి మరింత ధాటిగా ఆడింది. ఇషాన్ కిషన్ (69 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (52 పరుగులు), రోహిత్ శర్మ (38 పరుగులు) 15.3 ఓవర్లలోనే ఈ స్కోర్ ఛేదించి మ్యాచ్​ నెగ్గింది.

హెడ్, క్లాసెన్ వీరబాదుడు - హై స్కోరింగ్ మ్యాచ్​లో సన్​రైజర్స్​దే విజయం - SRH vs RCB IPL 2024

RCBపై హెడ్ విధ్వంసం- 39 బంతుల్లోనే మెరుపు సెంచరీ - Travis Head IPL Century

Last Updated :Apr 16, 2024, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.