ETV Bharat / sports

RCBపై హెడ్ విధ్వంసం- 39 బంతుల్లోనే మెరుపు సెంచరీ - Travis Head IPL Century

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 8:36 PM IST

Updated : Apr 15, 2024, 10:05 PM IST

Travis Head IPL Century: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సెంచరీ నమోదు చేశాడు.

Travis Head IPL Century
Travis Head IPL Century

Travis Head IPL Century: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సెంచరీ నమోదు చేశాడు. సోమవారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై హెడ్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచే హిట్టింగ్ ఆడిన హెడ్ 39 బంతుల్లోనే శతకం (102 పరుగులు, 41 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అందులో 9 ఫోర్లు, 8 సిక్స్​లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్​లో నాలుగో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. కాగా, ఐపీఎల్​లో సన్​రైజర్స్​ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.

IPL ఫాస్టెస్ట్ సెంచరీలు

  • క్రిస్ గేల్ (ఆర్సీబీ)- 30 బంతుల్లో vs పుణె వారియర్స్ ఇండియా (2013)
  • యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్)- 37 బంతుల్లో vs ముంబయి (2010)
  • డేవిడ్ మిల్లర్ (పంజాబ్)- 38 బంతుల్లో vs బెంగళూరు (2013)
  • ట్రావిస్ హెడ్ (సన్​రైజర్స్)- 39 బంతుల్లో vs బెంగళూరు (2024)
  • ఆడమ్ గిల్​క్రిస్ట్ (డెక్కన్ ఛార్జర్స్)- 42 బంతుల్లో vs ముంబయి (2008)

ఇక ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ రికార్డు సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సెంచరీ వీరుడు 12.3 ఓవర్ వద్ద హెడ్​ పెవిలియన్ చేరాడు. ఇక వన్​డౌన్​లో వచ్చిన క్లాసెన్​ కూడా ఆర్సీబీ బౌలర్లపై రెచ్చిపోయాడు. 67 పరుగులు, 31 బంతుల్లో 2x4, 7x6 మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో ఎయిడెన్ మర్​క్రమ్ (32 పరుగులు, 17 బంతుల్లో), అబ్దుల్ సమద్ (37 పరుగులు 10 బంతుల్లో) బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో సన్​రైజర్స్ తమ రికార్డును తామే బద్దలుకొట్టినట్లైంది. ఇక ఆర్బీబీ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2, టోప్లే 1 వికెట్ దక్కించుకున్నారు.

ఐపీఎల్​లో ఇన్నింగ్స్​లో అత్యధిక సిక్స్​లు: సన్​రైజర్స్ ఈ ఇన్నింగ్స్​లో మొత్తం 22 సిక్స్​లు నమోదు చేసింది. ఓ ఐపీఎల్​ ఇన్నింగ్స్​లో ఇదే అత్యధికం. గత రికార్డు ఆర్బీబీపై ఉంది. 2013లో పుణె వారియర్స్ ఇండియాపై ఆర్సీబీ 21 సిక్స్​లు బాదింది.

చరిత్ర సృష్టించిన సన్​రైజర్స్- హెడ్, క్లాసెన్ విధ్వంసంతో సొంత రికార్డ్ బ్రేక్ - sunrisers IPL highest score

15 ఏళ్లకే బీసీసీఐ అవార్డు, ఫస్ట్​ క్లాస్ రికార్డులు - ఎవరీ నితీశ్​ కుమార్ ? - Nitish Kumar SRH

Last Updated :Apr 15, 2024, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.