ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన సన్​రైజర్స్- హెడ్, క్లాసెన్ విధ్వంసంతో సొంత రికార్డ్ బ్రేక్ - sunrisers IPL highest score

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 9:25 PM IST

Updated : Apr 15, 2024, 10:06 PM IST

Sunrisers IPL Highest Score: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ సంచలనం సృష్టించింది. సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.

sunrisers IPL highest score
sunrisers IPL highest score

Sunrisers IPL Highest Score: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ సంచలనం సృష్టించింది. సోమవారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (102 పరుగులు, 41 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక హెన్రీచ్ క్లాసెన్ (67 పరుగులు, 31 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. చివర్లో ఎయిడెన్ మార్​క్రమ్ (32 పరుగులు, 17 బంతుల్లో), అబ్దుల్ సమద్ (37 పరుగులు, 10 బంతుల్లో) ఆర్సీబీపై దాడి చేశారు. ఈ క్రమంలో సన్​రైజర్స్ తమ రికార్డు (277-3) తామే బద్దలుకొట్టింది. ఇదే సీజన్​లో సన్​రైజర్స్ ముంబయిపై ఈ స్కోర్ సాధించింది.

మెరుపు శతకం: టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ (34 పరుగులు, 22 బంతుల్లో) ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడారు. వీరి దెబ్బకు 8 ఓవర్లకే స్కోర్ 100 దాటింది. అయితే 8.1 వద్ద టోప్లే అభిషేక్​ను పెవిలియన్ చేర్చి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. దీంతో తొలివికెట్​కు 108 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఇక హెడ్​కు క్లాసెన్ జతకలవడం వల్ల చిన్నస్వామిలో సునామీ వచ్చినట్లైంది. వీరిద్దరూ పోటాపోటీగా బంతిని స్టాండ్స్​లోకి పంపించారు.

ఈ క్రమంలోనే హెడ్ ఐపీఎల్​లో నాలుగో వేగవంతమైన (39 బంతుల్లో) సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ తర్వాత హెడ్​ను ఫెర్గ్యూసన్​ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మర్​క్రమ్​తో క్లాసెన్ ఇన్నింగ్స్​ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ మూడో వికెట్​కు 66 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తైన తర్వాత క్లాసెన్​ పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్ రెచ్చిపోయాడు. దీంతో తమ జట్టు రికార్డ్​ను తామే బ్రేక్ చేసి సంచలనం సృష్టించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో లాకీ ఫెర్గ్యూసన్ 2, టొప్లే 1 వికెట్ దక్కించుకున్నారు.

ఐపీఎల్​లో అత్యధిక స్కోర్లు

  • సన్​రైజర్స్- 287/3 vs ఆర్సీబీ (2024)
  • సన్​రైజర్స్- 277/3 vs ముంబయి (2024)
  • కోల్​కతా నైట్​రైడర్స్- 272/7 vs దిల్లీ (2024)
  • బెంగళూరు- 263/5 vs పుణె వారియర్స్ ఇండియా (2013)
  • లఖ్​నవూ- 257/7 vs పంజాబ్ కింగ్స్ (2023)

ఇదే సీజన్​లో మూడోసారి: ప్రస్తుత సీజన్​లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇటీవల ముంబయితో మ్యాచ్​లో సన్​రైజర్స్ దాదాపు 11ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసి 277 పరుగులు నమోదు చేయగా, ఆ తర్వాత కోల్​కతా 272 పరుగులు చేసి రికార్డ్​కు దగ్గరగా వచ్చింది. కాగా, ఈ మ్యాచ్​లో మరోసారి సన్​రైజర్స్ భారీ స్కోర్ నమోదు చేసింది.

తెలుగు కుర్రాడి విధ్వంసం - ఉత్కంఠ పోరులో పంజాబ్​పై హైదరాబాద్ విజయం - IPL 2024 Punjab Kings VS SRH

ఉప్పల్​లో సన్​రైజర్స్​ విక్టరీ- 6 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం - SRH vs CSK IPL 2024

Last Updated :Apr 15, 2024, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.