ETV Bharat / sports

హెడ్, క్లాసెన్ వీరబాదుడు - హై స్కోరింగ్ మ్యాచ్​లో సన్​రైజర్స్​దే విజయం - SRH vs RCB IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 11:00 PM IST

Updated : Apr 16, 2024, 6:14 AM IST

SRH vs RCB IPL 2024: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ హై స్కోరింగ్ మ్యాచ్​లో సన్​రైజర్స్ జట్టు విజయం సాధించింది.

SRH vs RCB IPL 2024
SRH vs RCB IPL 2024

SRH vs RCB IPL 2024 : ఐపీఎల్​ సీజన్ 17లో భాగంగా సన్​రైజర్స్ హైదరాబాద్​తో సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో సన్​రైజర్స్​దే పైచేయిగా నిలిచింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో హైదరబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ సంచలనం సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల స్కోర్ నమోదు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనను ఆర్సీబీ ఘనంగా ఆరంభించినప్పటికీ, క్రమంగా వికెట్లు కోల్పోయింది. 17 ఓవర్లకు ఆర్సీబీ 217-6 స్కోర్​తో ఉంది. క్రీజులో (55), (6) పోరాడుతున్నారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ఛేదనలో ఆర్సీబీకి మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (42 పరుగులు, 20 బంతుల్లో), ఫాఫ్ డూప్లెసిస్ (62 పరుగులు, 28 బంతుల్లో) ఇన్నింగ్స్​ను ఘనంగా ఆరంభించారు. కానీ, పవర్​ప్లే తర్వాత 6.2 ఓవర్ వద్ద మయంక్ మార్కండే బౌలింగ్​లో విరాట్ క్లీన్​బౌల్డయ్యాడు. ఆ తర్వాత వరుసగా విల్ జాక్స్ (7 పరుగులు), రజత్ పటిదార్ (9 పరుగులు), డూప్లెసిస్, సౌరవ్ చౌహాన్ (0) పెవిలియన్ చేరారు. మిడిలార్డర్​లో దినేశ్ కార్తిక్​తో కలిసి మహిపాల్ లొమ్రోర్​ (19 పరుగులు)తో కలిసి కాసేపు పోరాడాడు. మహిపాల్ ఔటైన తర్వాత కూడా దినేశ్ పోరాడాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (102 పరుగులు, 41 బంతుల్లో), హెన్రీచ్ క్లాసెన్ (67 పరుగులు, 31 బంతుల్లో), ఎయిడెన్ మార్​క్రమ్ (32 పరుగులు, 17 బంతుల్లో), అబ్దుల్ సమద్ (37 పరుగులు, 10 బంతుల్లో) మెరుపులతో హైదరాబాద్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2, టొప్లే 1 వికెట్ దక్కించుకున్నారు.

Last Updated :Apr 16, 2024, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.