ETV Bharat / spiritual

ఈవారం ఆ రాశులవారికి అన్ని మంచి ఫలితాలే- పెళ్లి కూడా ఫిక్స్​! - Weekly Horoscope April 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 4:17 AM IST

Weekly Horoscope From 14th April to 20th April 2024
Weekly Horoscope From 14th April to 20th April 2024

Weekly Horoscope From 14th April to 20th April 2024 : 2024 ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Weekly Horoscope From 14th April to 20th April 2024 : 2024 ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులు పనులు సకాలంలో పూర్తి చేసేందుకు పై అధికారులు సహకరిస్తారు. వ్యాపారస్థులు మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీరాముని ధ్యానం చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారు.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వివాహితులకు వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారస్థులు అన్నింటా లాభం పొందుతారు. ప్రభుత్వ రంగాల నుంచి కూడా లాభాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంది. మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు గొప్ప విజయాలను సాధిస్తారు. శ్రీ మహావిష్ణువు ధ్యానం మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్థులు నూతన పరిచయాల ద్వారా వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగస్తులు తమ పనులను సకాలంలో పూర్తి చేయాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. సామాజిక సేవలో పాల్గొంటారు. ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటుంది. కుటుంబంతో తీర్థయాత్రకు వెళతారు. శివారాధనతో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబంతో కలిసి తీర్ధయాత్రలు చేస్తారు. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కనబరుస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగస్థులు మంచి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. గృహంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్థులు వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. వారాంతంలో ఆర్థిక ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరిన్ని శుభ ఫలితాల కోసం శ్రీలక్ష్మి ధ్యానం చేయండి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం సామాన్య ఫలితాలు ఉంటాయి. అయితే ఉద్యోగస్థులకు ప్రమోషన్ గ్యారంటీ అని ఫలితాలు చెబుతున్నాయి. పై అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఆర్ధికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వారు పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారస్థులు వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తారు. దుర్గాదేవి ధ్యానం శుభాన్ని ఇస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అవివాహితులకు తాము కోరుకున్న వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది. ఉద్యోగస్థులకు కోరుకున్న ప్రమోషన్ దొరుకుతుంది. ఎటు చూసినా శుభాలే గోచరిస్తున్నాయి. వ్యాపారస్థులు విశేషమైన లాభాలను అందుకుంటారు. ఆర్ధికంగా బలపడతారు. గృహంలో శాంతి సంతోషం నెలకొంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. రాజకీయ నాయకులకు కాలం కలిసివస్తుంది. ఇంట్లో భజనలు, పూజలు జరుగుతాయి. దైవబలంతో సంతోషంగా ఉంటారు.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రేమికులకు కలిసివచ్చే కాలం. మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం సహించరు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఆర్ధికంగా బలపడతారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ రంగాల నుంచి కూడా ఈ వారం ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. వ్యాపారస్థులు చేసుకునే కొత్త ఒప్పందాలు మంచి ప్రయోజనాలు ఇస్తాయి. విద్యార్ధులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. అనుభవజ్ఞుల నుంచి పొదుపు పాఠాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్థులకు పనిలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్థులు తీవ్రమైన కృషి ఉంటే తప్ప విజయాలు సాధించలేరు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి ఉండదు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. నవగ్రహ పూజలు జరిపించుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహితులకు వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. నూతన వనరుల ద్వారా ఆదాయం రావడం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఇంటి మరమ్మత్తుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు కలిసివచ్చే కాలం. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. విదేశాలలో విద్య అభ్యసించాలనుకునే వారికి శుభ సమయం. పెద్దల ఆశీర్వాద బలంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారస్థులకు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో ఆర్ధికంగా బలపడతారు. వ్యాపారస్థులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సకాలంలో పనులు పూర్తి చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. శ్రీరాముని పూజ వలన మేలు పొందుతారు.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అవివాహితులకు కల్యాణ ఘడియలు సమీపించాయి. వివాహితులు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఖర్చులకు తగినట్లుగా ఆదాయం ఉంటుంది. వ్యాపారస్థులు మంచి లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం మెరుగు పడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.