ETV Bharat / spiritual

ఆ రాశి వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది- ఆరోగ్యం కూడా! - Horoscope Today

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 5:02 AM IST

Horoscope Today March 31th 2024
Horoscope Today March 31th 2024

Horoscope Today March 31th 2024 : మార్చి 31న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 31th 2024 : మార్చి 31న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. ఈ రోజు మీరు క్షుద్రవిద్యలు, అతీత శక్తులపై ఆసక్తి కనబరుస్తారు. ఇందుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉంటారు. కానీ ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దైవశక్తి మీద నమ్మకాన్ని పెంచుకోండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆంజనేయస్వామి ధ్యానం శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. కొంతమంది మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. మీరు ఆవేశానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా అనుకూలం. ఇష్ట దేవత ఆరాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. నూతన బాధ్యతలు చేపడతారు. మీ ప్రతిభతో అధికారుల ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. రోజంతా ఉల్లాసంగా, సరదాగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం సూచితం. పనులు సకాలంలో పూర్తవుతాయి. లక్ష్మీధ్యానం శుభం కలిగిస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో కలహాలు వస్తాయి. ఆరోగ్యం సహకరించదు. నెగటివ్ ఆలోచనల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. దేవాలయ సందర్శనం మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తెలియని ఆందోళనలతో సతమతమవుతుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. మొండి వైఖరిని వీడకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా అనుకూలం. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనం మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా అనుకూలం. గురువును ధ్యానిస్తే మేలు జరుగుతుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ సమర్థతతో అందరినీ మెప్పిస్తారు. ఈ సామర్థ్యాన్ని మరింత పదును పెట్టుకోవాల్సి ఉంటుంది. సమస్యలను సకాలంలో నేర్పుగా పరిష్కరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడం వల్ల ఆనందంగా ఉంటారు. మీ పనితీరు పట్ల ప్రశంసలు పొందుతారు. సహోద్యుగుల సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యం సహకరించదు. ఈ రోజంతా ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలించేందుకు నవగ్రహ ధ్యానం చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.