ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఆకస్మిక ధన లాభం- కొత్త పనులకు దూరంగా ఉండండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 4:45 AM IST

Updated : Feb 8, 2024, 7:05 AM IST

Horoscope Today February 8th 2024
Horoscope Today February 8th 2024

Horoscope Today February 8th 2024 In Telugu :ఫిబ్రవరి 8న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 8th 2024 : ఫిబ్రవరి 8న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రాశివారు అనవసరమైన వాదనలు, అర్ధంలేని చర్చలకు దూరంగా ఉంటే మంచిది. లేదంటే లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అది మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపవచ్చు. పనులు సమయంలోపు పూర్తిచేస్తారు. ఈరోజు మీకు ఫలవంతగా ఉంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు మీరుచాలా బిజీగా ఉంటారు. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త. మీ ఆలోచనలు కూడా తీవ్రంగా ఉంటాయి. అవి సంబంధాలను దెబ్బతీస్తాయి. మీ కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకొండి. పనిలో మీకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి కొత్త పనులకు ఈ రోజు దూరంగా ఉండటం మంచిది.

.

మిథునం (Gemini) : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువులను కలుసుకుంటారు. వారితో ఆనందంగా గడుపుతారు. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. వినోదాన్నిచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

.

కర్కాటకం (Cancer) : మీరు ఉద్యోగం చేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇది మీ ఆలోచనలను మార్చుతుంది. పనిలో మీతో పోటీపడేవారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు కనుక అది మీకు ప్రయోజనకరంగా మారుతుంది. మీ తల్లి తరుపు వారి నుంచి మీరు శుభవార్త వింటారు. అది మీ ఇంటిని ఆనంద మయం చేస్తుంది. మీ శారీరక, మానసిక స్థితి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.

.

సింహం (Leo) : అందరూ మీ పట్ల ప్రేమను చూపిస్తారు. కానీ, మీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. అజీర్తి సమస్యలు ఏర్పడతాయి కనుక ఈ రోజు శారీరకంగా మీరు కొంత ఇబ్బందిగా ఉంటారు. మధ్యాహ్నానికి పరిస్థితి మెరుగుపడుతుంది.

.

కన్య (Virgo) : ఈ రోజు మీకు బద్ధకం, బలహీనత అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు ఉంటాయి మీ లెక్కలు సరిచూసుకోండి. మీ చంచల మనస్తత్వం కారణంగా మీకు చెడ్డపేరు వస్తుంది. మీ ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవడం మిమ్మల్ని నిరాశపరుస్తుంది.

.

తుల (Libra) : కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు ఇదే మంచి రోజు. మీ బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడిపేందుకు ఇదే సరైన సమయం. మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. ఇంట్లో మనస్ఫర్థలు వచ్చే అవకాశం ఉంది. మీ తల్లి ఆరోగ్యం క్షీణించేలా ఉంది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.

.

వృశ్చికం (Scorpio) : ఈరోజు మీకు కొంత సానుకూలంగానూ, మరికొంత భాగం ప్రతికూలంగానూ ఉంటుంది. ఉదయం అన్నీ రంగాల్లో కఠినంగా ఉంటుంది. ప్రత్యేకంగా వృత్తి నిపుణులకు అధిక పని ఒత్తిడి, ప్రతికూల ఫలితాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కానీ, ఓపికతో వ్యవహరించండి. పరిస్థితులు సాయంత్రానికి మెరుగవుతాయి. ఇంటి దగ్గర గొడవలు, అర్ధంలేని వాదనల నుంచి దూరంగా ఉండండి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీకు కలిసి వస్తుంది. మీకు ధనయోగం ఉంది. మీరు ఆర్థిక సంబంధమైన లాభాలు, పనిలో విజయపరంపరలూ చూస్తారు. మీరు తీసుకునే ప్రతి పనిలోనూ మీకు ఉత్సాహం ఉండేటట్లు చేస్తుంది. మీరు సాయంత్రం ఆలయానికి వెళ్లవచ్చు. అక్కడ మౌనంగా కాసేపు గడిపి రావచ్చు. ఆఫీస్​లో, ఇంట్లోనూ కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు. అనవసరమైన ఖర్చులు చెయ్యకండి.

.

మకరం (Capricorn) : ఉదయం కొన్ని సవాళ్లు తప్పించి, అంత ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. రోజు మొదటి సగభాగంలో, మీరు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకంగా న్యాయపరమైన అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగంగా వెళ్లవద్దు. ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త.

.

కుంభం (Aquarius) : ఈరోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. ఈరోజు సామాజికంగా, ఆర్ధికపరంగా అభివృద్ధి చెందుతారు. కొంత గజిబిజిగా ఉండవచ్చు. ఇంటి వద్ద ప్రశాంత వాతావరణం ఉండదు. ఈ అస్థిర వాతావరణం మీ కుటుంబంలోని సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

.

మీనం (Pisces) : ఈరోజు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్ధికపరంగా, వృత్తిపరంగా, మీకు లాభాలు, పదోన్నతులు లభిస్తాయి. అంతేగాక, వ్యక్తిగతంగా, పరిస్థితులు చాలా మధురంగా ఉంటాయి. సంతోషం, శాంతి, సంతృప్తి ఉంటాయి.

Last Updated :Feb 8, 2024, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.