ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి ధన లాభం గ్యారెంటీ - కానీ ప్రత్యర్థులతో జాగ్రత్త!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 5:05 AM IST

Horoscope Today February 5th 2024
రాశి ఫలాలు

Horoscope Today February 5th 2024 In Telugu : ఫిబ్రవరి 5న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 5th 2024 : ఫిబ్రవరి 5న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా ఆలోచించి మాట్లాడాలి. కోపతాపాలను అదుపులో ఉంచుకోవాలి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీలైతే ప్రయాణాలు మానుకోవాలి. కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు. ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. సమాజంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. దూర దేశాల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం బాగుంటుంది. అనుకోని విధంగా ధన, సంపదలు కలుగుతాయి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి చాలా బాగుంటుంది. పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి అంతగా బాగుండదు. ఆరోగ్యం క్షీణించవచ్చు. సహనం కోల్పోయే అవకాశం ఉంది. ప్రియమైనవారితో వాదనలకు దిగుతారు. మానసికంగా కృంగిపోతారు. కానీ అధైర్యపడకూడదు. దైవ ప్రార్థనతో అంతా సర్దుకుంటాయి.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్రేకాన్ని అణచుకోవాలి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. కీలకమైన పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారు పార్టనర్​షిప్​తో చేసే వ్యాపార, వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఒంటరిగానే పని చేసుకోవాలి. మీ నమ్మకాన్ని దెబ్బతీసే పనులు ఏవీ చేయకూడదు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు ఎలాంచి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. మీ మనస్సులో ఉన్న పనులను మాత్రమే చేయాలి. ఇతరుల మాటలను అతిగా మనస్సులోకి తీసుకోకూడదు. వృత్తి, వ్యాపారాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి బ్రహ్మాండంగా ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. పనులను దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్​ చేస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు తమ మాటతీరుతో, సమర్థతా లోపంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాదనలతో, సంజాయిషీలతో కాలం గడిపేస్తారు. ఆరోగ్యం బాగుండదు. ప్రియమైన వారితోనూ వాగ్వాదాలు చోటుచేసుకుంటాయి.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చాలా బాగుంటుంది. మీ బంధువులు, స్నేహితులను కలుసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్నేహితులు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ప్రయాణాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వ్యాపార, వ్యవహారాల్లో లాభాలు వస్తాయి.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు అనుకోని చిక్కుల్లో కూరుకుపోతారు. కానీ మీ సామర్థ్యం వాటన్నింటినీ ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయం మాత్రం కాస్త అటుఇటుగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు తమకంటే శక్తివంతుల జోలికి వెళ్లకూడదు. ప్రత్యర్థులతో అనవసర వివాదాలు పెట్టుకోకూడదు. లేకుంటే మానసికంగా మీరే ఇబ్బందిపడతారు. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. దైవ ప్రార్థన చేయడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.