ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశి వారికి ఫుల్ లాభాలు- గణపతి పూజ శుభప్రదం! - Daily Horoscope Today

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 4:31 AM IST

Horoscope Today April 19th 2024
Horoscope Today April 19th 2024

Horoscope Today April 19th 2024 : ఏప్రిల్​ 19న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 19th 2024 : ఏప్రిల్​ 19న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. గతంలో వాయిదా పడ్డ పనులు పూర్తవుతాయి. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కలిసి వచ్చే కాలం. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. శివారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేసి మంచి విజయం సాధిస్తారు. పిత్రార్జిత ఆస్తి కలిసివస్తుంది. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కనబరుస్తారు. ప్రభుత్వం నించి ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. పొదుపుపై ద్దృష్టి సారిస్తే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు. ప్రభుత్వ పరంగా లాభాలు పొందుతారు. ఏ పని చేపట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్ధిక విషయాల్లో అప్రమత్తత అవసరం. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మేలు. సన్నిహితుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయి. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచితం. సంఘంలో పరపతి పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కాలం కలిసి రావడం లేదు. మీకు ఆత్మవిశ్వాసం అనిపించింది ఇతరులకు అహంకారంగా, గర్వంగా అనిపించవచ్చు. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం సహకరించదు. ఆంజనేయస్వామి ప్రార్ధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. పని ప్రదేశంలో ఒకింత గందరగోళం ఉండవచ్చు. పలు అవకాశాలు ఎదురవుతాయి. మీకు నచ్చినది ఎంచుకుని ముందుకు సాగండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతారు. ప్రశాంతంగా ఉండండి. దైవారాధన లో సమయం గడపండి. ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం చేయండి. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ ప్రతిభతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శనిస్తోత్రం పఠించండి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. రావలసిన ధనం చేతికి అందుతుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్ధికంగా ప్రయోజనాలు ఉంటాయి. గృహంలో శాంతి, సౌఖ్యం ఉంటుంది. ఆర్ధికంగా లాభపడతారు. విందువినోదాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉంది. గణపతి ప్రార్ధన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీలోని సృజనాత్మతను వెలికి తీసి ఉన్నత మార్గంలో నిలవడానికి ప్రయత్నించండి. తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధనతో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.