ETV Bharat / politics

వివేక హత్యపై మాట్లాడొద్దంటూ ప్రచారంలోకి దూసుకొచ్చిన వైసీపీ నేతలు- ధీటుగా సమాధానమిచ్చిన సునీత - YS Sunitha Election Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 8:00 PM IST

sunitha_election_campaign
sunitha_election_campaign

YCP Activists Provocative Actions in YS Sunitha Election Campaign కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వైఎస్ సునీతను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వివేక హత్యపై మాట్లాడొద్దంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర స్థాయిలో మండిపడిన సునీత తనకు అన్యాయం జరిగిందని వారికి ఆమె దీటుగా సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రాకతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

YCP Activists Provocative Actions in YS Sunitha Election Campaign: వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె సునీత పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తుండగా వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పులివెందుల మండలం పెద్ద రంగాపురం, చిన్న రంగాపురం, సారాయి వారిపల్లె గ్రామాల్లో సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద రంగాపురంలో వివేక హత్య కేసు విషయాన్ని సునీత ప్రజలకు వివరించి చెప్పారు. హత్య చేయించిన వ్యక్తులకు ఓటు వేయద్దని, రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ - మార్కాపురంలో అదనంగా కె-ట్యాక్స్‌ - అక్రమాల్లో అన్నదమ్ములు పోటీ - YSRCP Leaders Irregularities

సునీత మాట్లాడుతున్న సమయంలోనే వైసీపీ కార్యకర్తలు ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. హత్య విషయం గ్రామంలో మాట్లాడవద్దని గట్టిగా అరిచారు. వైసీపీ కార్యకర్తల హెచ్చరింకలకు సునీత దీటుగా సమాధానం ఇచ్చారు. ఎందుకు వివేకానంద హత్య గురించి ఇక్కడ మాట్లాడకూడదని ఆమె ప్రశ్నించారు. మాటలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితి వివాదం అవుతుందని తెలుసుకున్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. తర్వాత సునీత ఎన్నికల ప్రచారం కొనసాగించారు. సారావారి పల్లెలో కూడా సునీత రాకముందే అక్కడికి చేరుకున్న కళాకారులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అవే దృశ్యాలు- జనాలకు తప్పని ఇక్కట్లు! ఐదేళ్లలో హామీలన్ని నెరవేర్చాం- తమకే ఓటేయాలన్న జగన్ - CM Jagan Bus Trip

పాపాలు చేసే వారిని ఎదుర్కోవాలంటే ప్రార్థన చేస్తే సరిపోదు: బ్రదర్ అనిల్ - Brother Anil Kumar key comments

వివేక హత్యపై మాట్లాడొద్దంటూ ప్రచారంలోకి దూసుకొచ్చిన వైసీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.