ETV Bharat / politics

కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు - ఆయన మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే : ఉత్తమ్​కుమార్​ రెడ్డి - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 2:09 PM IST

Updated : Apr 1, 2024, 4:49 PM IST

UTTAM KUMAR REDDY
UTTAM KUMAR REDDY

Minister Uttam Kumar Reddy Fires on KCR : కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. పార్టీ మిగలదనే భయం ఆయనలో మొదలైందన్నారు. బీఆర్​ఎస్​ జాతీయ పార్టీ అన్నారని, కానీ ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలలేదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Minister Uttam Kumar Reddy Fires on KCR : పొలం బాట కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఆదివారం నాడు కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మాజీ సీఎం అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలని కోరారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Uttam Comments on BRS : కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam on BRS) అన్నారు. పార్టీ మిగలదనే భయం ఆయనలో మొదలైందని విమర్శించారు. బీఆర్​ఎస్​ జాతీయ పార్టీ అన్నారని, కానీ ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలలేదని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని, కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప భారత్ రాష్ట్ర సమితిలో ఎవరూ మిగలరని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.

మేడిగడ్డ విషయంలో బీఆర్​ఎస్​ తీరు హాస్యాస్పదం : మంత్రి ఉత్తమ్​

విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెేప్పెవన్ని అబద్ధాలే : ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేసీఆర్‌ సహకరించలేదని లోకసభలోనే వెల్లడించారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో చట్టం తనపని తానూ చేసుకుంటూ పోతుందని వెల్లడించారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఎటు వెళుతుందో చూడాలన్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందో తేలాల్సి ఉందని తెలిపారు.

"కాళేశ్వరం గురించి కేసీఆర్‌ మాట్లాడేందుకు సిగ్గుపడాలి. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఆ పార్టీ హయాంలోనే కూలిపోయింది. ఒక్క పిల్లరే కదా కుంగింది అని కేసీఆర్‌ అంటారు. అమెరికాలో బ్యారేజీ కుంగలేదా అని కేసీఆర్‌ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం కోసం విద్యుత్‌ ఖర్చే ఏడాదికి రూ.10,000ల కోట్లు అవుతుంది. ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కేసీఆరే ఒప్పుకున్నారు." - ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మంత్రి

వర్షాలు తక్కువ పడడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు తక్కువ ఉన్నాయని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. మిషన్‌ భగీరథ (Mission Bhagiratha Scheme in Telangana) కోసం రూ.45,000ల కోట్ల అప్పులు తెచ్చారని ఆరోపించారు. మిషన్‌ భగీరథ మొత్తం ఫెయిల్‌ అయిందని విమర్శించారు. అది కమీషన్ల భగీరథగా మారిందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌, జగన్‌ దోస్తీ వల్ల ఏపీ అక్రమంగా రోజుకు 10 టీఎంసీలు తరలించిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆక్షేపించారు.

''కాళేశ్వరం' అంత అవినీతి ఎప్పుడూ జరగలేదు - అందుకే వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయింది'

ఆంధ్రప్రదేశ్ రోజూ నీళ్లు తరలిస్తున్నా అప్పటి సీఎం కేసీఆర్‌ మాట్లాడలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు నోరు మెదపని ఆయన, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌, జగన్‌ కలిసి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలపై కుట్ర చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంట బీమా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 7149 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అవసరాన్ని మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడైనా ఎంఎస్‌పీ కంటే తక్కువకు కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కేసీఆరే ఒప్పుకున్నారు

భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒకట్రెండు ఎంపీ సీట్లు సాధించేందుకే కేసీఆర్ పొలం బాట - కాంగ్రెస్​ నేతల ఫైర్ - Lok Sabha Elections 2024

"కుంగినప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడేమో ఉచిత సలహాలు ఇస్తుండ్రు"

Last Updated :Apr 1, 2024, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.