ETV Bharat / state

భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒకట్రెండు ఎంపీ సీట్లు సాధించేందుకే కేసీఆర్ పొలం బాట - కాంగ్రెస్​ నేతల ఫైర్ - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 9:12 AM IST

Congress Leaders Fires On KCR : ప్రకృతి వైపరీత్యాలను, వర్షాభావ పరిస్థితులను కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంగా చూపేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు అన్యాయం చేసిన కేసీఆర్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అన్నదాతల సంక్షేమం సాధ్యమవుతుందని హస్తం పార్టీ నేతలు స్పష్టం చేశారు.

Minister Thummala Fires On KCR
Congress Leaders Fires On KCR

మాజీ సీఎం కేసీఆర్ విమర్శలపై కాంగ్రెస్‌ ఎదురుదాడి - ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వంపై మోపుతున్నారని ధ్వజం

Congress Leaders Fires On KCR : పొలం బాట కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పి కొట్టారు. సహజ సిద్ధంగా వచ్చిన కరవును, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత ప్రయత్నిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. 9 ఏళ్ల పాలనలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ఏ ఒక్క రైతును ఆదుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు.

Minister Thummala Fires On KCR : విద్యుత్తు కొనుగోళ్లు, అసంబద్ధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో కమీషన్లు దండుకొని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని దుయ్యబట్టారు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొట్టారని విరుచుకుపడిన తుమ్మల, పథకాన్ని పునరుద్ధరించి, రైతుల ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లించనుందని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాలన్నింటినీ తమ సర్కార్‌ మీద నెట్టేయాలని చూస్తే ప్రజలు హర్షించరని మంత్రి తుమ్మల హితవు పలికారు.

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారాలు - ఎన్నికల తర్వాక బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్న నేతలు - Lok Sabha Elections 2024

Congress MLA Mandula samel Comments : భావోద్వేగాలు రెచ్చగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో ఒకట్రెండు సీట్లు సాధించేందుకే బీఆర్ఎస్ అధినేత పొలం బాట పట్టారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు విమర్శించారు. పొలాలు ఎండిపోవడం కాదు, బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్​కు ప్రజలు బుద్ధి చెప్పినా, తీరు మార్చుకోవట్లేదని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ధ్వజమెత్తారు. గతేడాది తక్కువ వర్షపాతం వల్లే ప్రాజెక్టులు, భూగర్భ జలాలు అడుగంటాయి తప్ప, కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల కరవు రాలేదని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ఓక్క రైతు నష్టపోకూడదని ప్రభుత్వం దృఢ సంకల్పం తీసుకుందని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పదికి పైగా సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

"గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేశారు. లిక్కర్ స్కామ్​లు చేశారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏనాడూ రైతులను పట్టించుకోలేదు. సహజ సిద్ధంగా వచ్చిన కరవును, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఒక్క సీటు కూడా గెలవదు." -మందుల సామేలు, ఎమ్మెల్యే

దిల్లీకి సీఎం రేవంత్​ రెడ్డి - మిగిలిన లోక్​సభ స్థానాలకు నేడు అభ్యర్థుల ప్రకటన! - Lok Sabha Elections 2024

తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్​ ఇంఛార్జులు నియామకం - TS Congress Parliament Incharge

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.