ETV Bharat / state

తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్​ ఇంఛార్జులు నియామకం - TS Congress Parliament Incharge

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 10:23 PM IST

Updated : Mar 31, 2024, 10:46 PM IST

Congress Appointed Parliament Incharges in Telangana : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. లోక్​సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జులుగా నియమిస్తూ మార్పులు చేసినట్లు కాంగ్రెస్ హైకమాండ్ వర్గాలు తెలిపాయి.

Lok Sabha Elections 2024
Congress Appointed Parliament Incharges in Telangana

CONGRESS PARLIAMENT INCHARGES IN TELANGANA
CONGRESS PARLIAMENT INCHARGES IN TELANGANA

Congress Appointed Parliament Incharges in Telangana : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పార్లమెంట్​ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జుల​ను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ(Dipadas Munshi) ఉత్తర్వులు జారీ చేశారు. లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జులుగా నియమిస్తూ మార్పులు చేసినట్లు కాంగ్రెస్ హైకమాండ్ వర్గాలు తెలిపాయి.

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారాలు - ఎన్నికల తర్వాక బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్న నేతలు - Lok Sabha Elections 2024

Telangana Congress Appointed New Parliament Incharges : ఖమ్మం కాంగ్రెస్‌ ఇంఛార్జి​గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ పార్లమెంట్​ ఇంఛార్జిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మహబూబాబాద్‌ పార్లమెంట్​ ఇంఛార్జిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఇంఛార్జిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పెద్దపల్లి కాంగ్రెస్‌ ఇంఛార్జిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నియమితులయ్యారు.

వరంగల్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా ప్రకాశ్‌రెడ్డి, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా ఒబేదుల్లా కొత్వాల్, భువనగిరి స్థానం నుంచి ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇంఛార్జిగా నరేందర్‌రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్‌ ఇంఛార్జిగా మైనంపల్లి హనుమంతరావు, నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా సుదర్శన్‌రెడ్డి, మెదక్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా గిరిజనశాఖ మంత్రి సీతక్క, నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.

*తెలంగాణలో ఎంపీ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జులు వీరే :

క్రమ సంఖ్య ఇంఛార్జి పేరు పార్లమెంట్ నియోజకవర్గం
01పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం
02ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్గొండ
03పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌
04శ్రీధర్‌బాబు పెద్దపల్లి
05ప్రకాశ్‌రెడ్డి వరంగల్‌
06తుమ్మల నాగేశ్వరరావు మహబూబాబాద్‌
07ఒబేదుల్లా కొత్వాల్‌ హైదరాబాద్‌
08కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సికింద్రాబాద్‌
09కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి
10జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్‌
11నరేందర్‌రెడ్డి చేవెళ్ల
12మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి
13కొండా సురేఖ మెదక్‌
14సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్‌
15సీతక్క ఆదిలాబాద్‌
16దామోదర రాజనర్సింహ జహీరాబాద్‌
17సంపత్​ కుమార్ మహబూబ్​నగర్​

మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ రిజల్ట్​​పై హై టెన్షన్​ - నువ్వా నేనా అన్నట్లు హస్తం, కారు పార్టీలు - Mahabubnagar MLC By Election 2024

కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య - పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ - Lok Sabha Elections 2024

Last Updated : Mar 31, 2024, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.