ETV Bharat / politics

6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితికి కేసీఆర్ : కేటీఆర్ - Huzurabad KTR Road Show

author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 1:20 PM IST

Updated : May 11, 2024, 2:19 PM IST

KTR Election Campaign in Huzurabad : లోక్‌సభ ఓటింగ్‌ ప్రక్రియకు సమయం ఆసన్నమవుతోంది. ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో పార్టీ నాయకులందరూ ఫుల్‌ బిజీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌లో రోడ్‌ షోలో పాల్గొన్నారు. అనంతరం పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర నిధులు రాబట్టే సత్తా కరీంనగర్ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కి ఉందని తెలిపారు.

KTR Election Campaign in Huzurabad
KTR Road Show in Karimnagar (ETV Bharat)

KTR Election Campaign in Huzurabad : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో నిత్యవసరాల ధరలు పెరిగాయని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముడి చమురు ధరలు తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదని విమర్శించారు. ఆరు నెలల్లో పార్టీ అధినేత కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌లో రోడ్‌ షోలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ తరుఫున ఎన్నిక ప్రచారం చేశారు.

KTR Fire on PM Modi Government : ఐదేళ్లలో కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ గల్లీలో, దిల్లీలో ఎక్కడైనా కనిపించారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్‌ అభివృద్ధికి సంజయ్‌ కేంద్ర నిధులు తీసుకువచ్చారా అని నిలదీశారు. వినోద్‌ కుమార్ ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌ పాలనకి కాంగ్రెస్‌ పాలనకి మధ్య తేడా గమనించాలని అన్నారు. ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు. హస్తం పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చారా అని అడిగారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలిపారు. పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు రావాలని సూచించారు.

"ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరుతున్నాను. కేసీఆర్‌ పాలన ఎలా ఉంది? కాంగ్రెస్‌ పాలన ఎలా ఉందో గమనించండి. ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చారా? పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు రావాలి. కేంద్ర నిధులు రాబట్టే సత్తా వినోద్‌కు ఉంది. చేనేత మీద మొదటిసారి జీఎస్టీ 5 శాతం వేసిన ప్రధాని మోదీనే. మోదీ హయాంలో నిత్యవసరాల ధరలు పెరిగాయి." - కేటీఆర్, బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు

మాకు 12 సీట్లు ఇస్తే, గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - lok sabha elections 2024

KTR Election Campaign in Karimnagar : కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప సంజయ్‌ ఒక్క పనైనా చేశారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర నిధులు తీసుకువచ్చే సత్తా వినోద్‌ కుమార్‌కి ఉందన్నారు. మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌పై 34 శాతం ధరలు పెంచారని మండిపడ్డారు. ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఓటు వేసిన తర్వాత ఓటరు స్లిప్పు తప్పకుండా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ఆరు నెలల్లో కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది కేటీఆర్ (ETV Bharat)

'రిజర్వ్ బ్యాంక్​ గణాంకాలే - కేసీఆర్​ హయంలో రాష్ట్ర అద్భుత వృద్ధికి నిదర్శనం' - KTR on Telangana Development

భైంసాలో ఉద్రిక్తత - కేటీఆర్‌పై ఉల్లిగడ్డలు, టమాటలు విసిరిన దుండగులు - Attack on KTR in Bhainsa Road Show

Last Updated : May 11, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.