ETV Bharat / politics

నేను ఏనాడూ దౌర్జన్యాలు చేయలేదు - ప్రజల కోసమే పని చేశా - మరోసారి అవకాశం ఇవ్వండి : కిషన్‌ రెడ్డి - Kishan Reddy on Congress guarantees

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 1:10 PM IST

Updated : Apr 19, 2024, 2:16 PM IST

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy Comments on Congress : రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయే రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హస్తం పార్టీ హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తుందని చెప్పారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో 17కు 17 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కిషన్‌రెడ్డి కోరారు.

Kishan Reddy Comments on Congress : సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి జీహెచ్‌ఎంసి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో కిషన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. అంతకుముందు మెహబూబ్ కాలేజీ మైదానంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్​ రెడ్డి, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎన్నికల ముందు ప్రజలకు నివేదిస్తున్నట్లు వివరించారు.

6 గ్యారంటీలు అమలు చేయమంటే, లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటి? : కిషన్‌రెడ్డి

Telangana Lok Sabha Elections 2024 : 2019లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించానని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. కేంద్రమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమాంతరంగా పని చేశానని తెలిపారు. నాలుగున్నర ఏళ్లల్లో సికింద్రాబాద్‌కు చేసిన ప్రగతి నివేదికను ప్రజల ముందుపెట్టానని పేర్కొన్నారు. తాను ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదని, నైతిక విలువలకు కట్టుబడి ప్రజల కోసం పని చేశానని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదు

"భవిష్యత్‌లో కూడా ప్రజల కోసం పని చేస్తా. సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వండి. చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసమే పని చేస్తా. ప్రచారం, అభ్యర్థుల ప్రకటనలో కమలం పార్టీ ముందుంది. తెలంగాణలో అన్ని పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీకి మధ్యే పోటీ. హస్తం పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్‌కు డిపాజిట్లు దక్కవు." - కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి

Kishan Reddy on Congress Guarantees : కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడికిపోయాయే రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హస్తం పార్టీ హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గ్యారంటీలపై ప్రశ్నించాలని అన్నారు. హస్తం పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుందని చెప్పారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామని, 17కు 17 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కిషన్‌రెడ్డి కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసించిన మజ్లిస్ పార్టీ - కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ పంచన చేరింది : కిషన్‌ రెడ్డి - lok sabha elections 2024

సికింద్రాబాద్​ బీజేపీ కంచుకోట : కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ రావడం ఆనందంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యడు లక్ష్మణ్ అన్నారు. నామినేషన్ ర్యాలీలో వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం కమలం పార్టీ కంచుకోట అని, అక్కడ కిషన్‌రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని సీట్లూ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని, మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసే ప్రజలు తమ పార్టీ వైపు ఉన్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

తెలంగాణలో గజదొంగలు పోయి - ఘరానా దొంగలు వచ్చారు : కిషన్‌రెడ్డి - KISHAN REDDY STRIKE

రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే - కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి : కిషన్ రెడ్డి

Last Updated :Apr 19, 2024, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.