ETV Bharat / state

రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే - కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి : కిషన్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 2:10 PM IST

Updated : Mar 5, 2024, 2:34 PM IST

Kishan Reddy At BJP Vijaya Sankalp Sabha Sangareddy : సంగారెడ్డిలోని బీజేపీ విజయ సంకల్ప సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందన్న కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ ట్యాక్స్‌ పేరుతో వసూళ్లు చేపట్టారని వ్యాఖ్యానించారు.

Kishan Reddy At BJP Vijaya Sankalp Sabha Sangareddy
Kishan Reddy Fires on congress

రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే - కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి : కిషన్ రెడ్డి

Kishan Reddy At BJP Vijaya Sankalp Sabha Sangareddy : సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని అన్నారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందన్న కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ ట్యాక్స్‌ పేరుతో వసూళ్లు చేపట్టారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం ప్రజల కోసం పని చేసే పార్టీ అని, హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ రాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్​ అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు : కిషన్​రెడ్డి

తెలంగాణలో కొందరు నాయకులు బీజేపీ ఏం చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేంద్రం రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని పేర్కొన్నారు. బీజేపీ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని తెలిపారు. 2500 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు. కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరిగిందని వివరించారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు కేంద్రం చేపట్టిందని, ఇప్పటికే 3 వందే భారత్‌ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్‌ ప్లాంటు మంజూరు చేశామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రైలు కోసం సర్వే జరుగుతోందని తెలిపారు. తెలంగాణకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వివరించారు.

Etela Rajender Fires on KCR : ప్రజాహితం కోసం, అభివృద్ది కోసం పార్టీలు పని చేస్తాయని, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా పని చేయలేదని బీజేపీ నాయకుడు ఈటల రాజెేందర్ విమర్శించారు. గ్రామాల అభివృద్దితోనే దేశం అభివృద్ధి చెందుతుందనే విధానాన్ని మోదీ అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి భూ సంస్కరణలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి మోదీని రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషించాలని కోరడం సంతోషకరం అని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని అభివృద్ది పనులు చేస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్​కు ఓటు వేస్తే రేవంత్ రెడ్డి మళ్లీ పనుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలంటే మోదీ మళ్లీ ప్రధాని కావాలని, దానికి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.

మూసీ ప్రక్షాళన పేరుతో నిధుల దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్‌ : కిషన్‌ రెడ్డి

మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు : కిషన్​ రెడ్డి

Last Updated : Mar 5, 2024, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.