ETV Bharat / politics

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసు - కేసీఆర్​కు చెప్పినా వినలేదు : ఎర్రబెల్లి - Errabelli Dayakar Rao on BRS

author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 2:03 PM IST

Updated : May 11, 2024, 3:28 PM IST

Errabelli Dayakar Rao about Telangana Assembly Elections : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్ 40 సీట్లు మాత్రమే గెలుస్తుందని, ఆ ఎన్నికల్లో తాను ఓడిపోతానని తనకు ముందే తెలుసని మాజీ మంత్రి ఎర్రబెల్లి ​దయాకర్ రావు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే అసెంబ్లీ స్థానాలు మార్చాలని కేసీఆర్​కు చెప్పానని తెలిపారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, సీఎం రేవంత్​ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడతారని వ్యాఖ్యానించారు.

Errabelli Dayakar Rao on Congress
Etv BharatErrabelli Dayakar Rao on BRS (ETV Bharat)

Errabelli Dayakar Rao on BRS in Assembly Elections : అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతానని తనకు ముందే తెలుసని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందే శాసన సభ సీటు మార్చాలని మాజీ సీఎం కేసీఆర్‌ను కోరానని చెప్పారు. 40 సీట్లు మాత్రమే బీఆర్​ఎస్​ గెలుస్తుందని, తన స్థానంతో పాటు మరో 20 స్థానాలు కూడా మార్చాలని గులాబీ అధినేతకు ముందే చెప్పానని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయం తనకు తెలుసని వ్యాఖ్యానించారు. 30 వేల నుంచి 50 వేల భారీ మెజార్టీతో బీఆర్​ఎస్ అభ్యర్థి​ సుధీర్‌ కుమార్‌ ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ వరంగల్‌లోని బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల తర్వాత హామీలపై చేతులెత్తేస్తారు : రెండో స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతోందని ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. వరంగల్‌ను కేసీఆర్‌ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. బీఆర్​ఎస్​ హయాంలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చారని, కాంగ్రెస్‌ వస్తే ఏదో లాభం జరుగుతుందని ప్రజలు మోసపోయారని అన్నారు. ఆ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఉద్ఘాటించారు. ఆగస్టు 15లోపు స్థానిక సంస్థలు సహా అన్ని ఎన్నికలు పూర్తవుతాయని, తర్వాత కాంగ్రెస్​ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తారని విమర్శించారు.

ఆ ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడతారు : అంతకుముందు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీఆర్​ఎస్​ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గ్రామాల్లో ప్రజలందరూ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను తరిమికొడతారని అన్నారు. ఆ పరిస్థితుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​, బీజేపీలో చేరుతారని జోస్యం చెప్పారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, మహబూబాబాద్​లో గులాబీ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

'అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోతానని నాకు తెలుసు. కేసీఆర్​కు కూడా అసెంబ్లీ స్థానాలు మార్చాలని చెప్పా. 30 వేల నుంచి 50 వేల భారీ మెజార్టీతో సుధీర్‌ కుమార్‌ ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారు. కాంగ్రెస్​ హామీలు అమలు కాకపోతే ప్రజలే బుద్ధిచెబుతారు'- ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసు - కేసీఆర్​కు చెప్పినా వినలేదు : ఎర్రబెల్లి (ETV Bharat)

ఫోన్​ ట్యాపింగ్ కేసులో నన్ను ఇరికించి జైలుకు పంపే కుట్ర జరుగుతోంది : ఎర్రబెల్లి - Errabelli Dayakar On Phone Tapping

ఓట్ల కోసం రాజకీయ నేతల పాట్లు - హోటల్లో పూరీలు చేసి ఓటర్లకు వడ్డించిన ఎర్రబెల్లి - Errabelli Dayakar Election Campaign

Last Updated : May 11, 2024, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.