ETV Bharat / politics

గత ప్రభుత్వంలో ఫోన్​ ట్యాపింగ్​ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా విన్నారు : రేవంత్ రెడ్డి - Telangana Phone Tapping Case

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 6:48 PM IST

Updated : Mar 29, 2024, 7:18 PM IST

CM Revanth Reddy on Phone Tapping Case : గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా భయపెట్టిందని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ట్యాపింగ్‌తో విన్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ట్యాపింగ్‌ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారన్న ఆయన, మాజీ మంత్రి మాటలకు తగిన ఫలితం ఉంటుందన్నారు.

Phone Tapping Case
CM Revanth Reddy on Phone Tapping Case

గత ప్రభుత్వంలో ఫోన్​ ట్యాపింగ్​ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా విన్నారు : రేవంత్ రెడ్డి

CM Revanth Reddy on Phone Tapping Case : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాల్మీకి బోయలతో సీఎం రేవంత్​ రెడ్డి సమావేశమయ్యారు. గాంధీభవన్​లో జరిగిన ఈ భేటీలో వంశీచంద్ రెడ్డి, మల్లు రవి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్​, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 ఓట్ల మెజారిటీతో గెలవబోతోందని రేవంత్​ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

రేవంత్‌ రెడ్డిని దెబ్బ తీయాలని భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఏకమయ్యాయని రేవంత్​ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు డీకే అరుణ ఏం సాధించారని ప్రశ్నించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేని ఆమె, తాను మాత్రం బీజేపీలో జాతీయ పదవి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో పదవులు ఇస్తున్నామన్న ఆయన, ఎంపీ ఎన్నికల తర్వాత సంపత్‌కు కాంగ్రెస్‌లో మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. వాల్మీకి బోయలను ఆదుకునే బాధ్యత తీసుకుంటామన్న రేవంత్, బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇస్తామన్నారు.

ఏప్రిల్​ 6న తుక్కుగూడ సభ - 5 గ్యారంటీలు ప్రకటించనున్న రాహుల్​ గాంధీ : సీఎం రేవంత్​ రెడ్డి

మరోవైపు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్​ ట్యాపింగ్​పైనా రేవంత్​ రెడ్డి స్పందించారు. గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా భయపెట్టిందన్న రేవంత్‌, భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ట్యాపింగ్‌తో విన్నారని ఆరోపించారు. ట్యాపింగ్‌ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారన్న సీఎం, ట్యాపింగ్‌ చేసిన వారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మాటలకు తగిన ఫలితం ఉంటుందని హెచ్చరించారు.

నేను చేరలేని దూరం కాదు - దొరకనంత దుర్గం కాదు - సామాన్య మనిషిని నేను : సీఎం రేవంత్

గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా భయపెట్టింది. భార్యాభర్తలు ఏం మాట్లాడారో కూడా ట్యాపింగ్‌తో విన్నారు. ట్యాపింగ్‌ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్‌ మాట్లాడుతున్నారు. ట్యాపింగ్‌ చేసిన వారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది. కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారు. కేటీఆర్‌ మాటలకు తగిన ఫలితం ఉంటుంది. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది. చర్యలు ఉంటాయి. ట్యాపింగ్‌పై అధికారులకు ఆరోజే చెప్పా. వాళ్లు వినలేదు. ఈరోజు జైలుకు వెళ్తే అటువైపు కూడా ఎవరూ చూడట్లేదు. - సీఎం రేవంత్‌ రెడ్డి

వీహెచ్‌కు బుజ్జగింపులు - అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్​ ​భరోసా

Last Updated :Mar 29, 2024, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.