ETV Bharat / politics

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ - బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 5:15 PM IST

Updated : Feb 29, 2024, 9:16 PM IST

BRS MP Ramulu Joined BJP : బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. దిల్లీలో ఇవాళ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

Nagarkurnool MP Ramulu Joined in BJP
Nagarkurnool BRS MP Ramulu Joined in BJP

BRS MP Ramulu Joined BJP : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్‌ ఎంపీ రాములు(BRS MP Ramulu) బీజేపీలో చేరారు. దిల్లీలో ఇవాళ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. రాములు చేరికతో బీజేపీకి మరింత బలం చేకూరనుందని రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే లోక్​సభ​ ఎన్నికల దృష్ట్యా గులాబీ పార్టీలో చీలికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. తెలంగాణలో బీఆర్​ఎస్​ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌, ఆయన భార్య చర్లపల్లి బీఆర్​ఎస్​ కార్పొరేటర్‌ శ్రీదేవి, ప్రొఫెసర్‌ బానోత్‌ రమణ నాయక్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ ​మున్షీ కండువా కప్పి ఆహ్వానించారు.

మేడిగడ్డపై కాంగ్రెస్​ది రాజకీయం - రైతులకు నీళ్లివ్వకుండా కాలయాపన చేయడం దారుణం : కేటీఆర్

KTR on Parliament Candidtes Finalisation : మరోవైపు మార్చి 2 నుంచి బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థిత్వాలపై కసరత్తు ప్రారంభమవుతుందని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థిత్వాలపై తెలంగాణ భవన్​లో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చని, జరిగిన తప్పులన్నీ సీఎం, మంత్రులకు తెలియాలని లేదని కేటీఆర్‌ తెలిపారు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డికి కేటీఆర్​ సవాల్​ విసిరారు. మల్కాజిగిరి లోక్​సభలో పోటీ చేద్దామా అంటూ ఛాలెంజ్​ చేశారు.

ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్లలో అవకతవకలపై విచారణకు సీఎం ఆదేశం

మిషన్ భగీరథపై లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ప్రభుత్వానికి తగదు : హరీశ్​ రావు

Last Updated : Feb 29, 2024, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.