ETV Bharat / politics

సీఎం జగన్ ఆస్తులు రూ. 529 కోట్లు - చేతిలో రూ. 7 వేలు మాత్రమే - AP CM JAGAN ASSETS

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 2:25 PM IST

CM Jagan Election Affidavit
CM Jagan Revealed Assets Details in Election Affidavit

AP CM Jagan Revealed Assets Details in Election Affidavit : నోరు తెరిస్తే తాను నిరుపేదనంటారు ఏపీ సీఎం జగన్. పేదలకు తానే ప్రతినిధి అన్నట్లు సభలు, సమావేశాల్లో కలరింగ్‌ ఇస్తారు. కానీ ఆయన పేరు మీద మాత్రం వందల కోట్ల విలువైన ఆస్తులు మూలుగుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన సీఎం ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు చెదిరిపోతాయి. గతంతో పోలిస్తే భారీగా కూడబెట్టినట్లు స్పష్టమవుతుంది. మరోవైపు సీఎం జగన్‌పై 26 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

సీఎం జగన్ ఆస్తులు రూ. 529 కోట్లు - చేతిలో రూ. 7 వేలు మాత్రమే

AP CM Jagan Revealed Assets Details in Election Affidavit : పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని, తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న ఏపీ సీఎం జగన్‌ ఒక్కరి పేరిటే 529 కోట్ల 87 లక్షల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులనూ కలిపితే వాటి విలువ 757 కోట్ల 65 లక్షలు. ఇది జగన్‌ కుటుంబ ఆస్తుల విలువ. వీటిల్లో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే. జగన్‌ తరఫున వైఎస్‌ మనోహర్‌రెడ్డి పులివెందుల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌, అఫిడవిట్‌ సమర్పించారు. అందులో ఆస్తుల విలువను పొందుపరిచారు. 2019లో జగన్‌ ఒక్కరి ఆస్తుల విలువ 375కోట్ల 20 లక్షలు కాగా గత అయిదేళ్లలో ఆయన ఆస్తుల విలువ 154 కోట్ల 67 లక్షల మేర అంటే 41.22 శాతం పెరిగింది. 2019లో జగన్‌ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 510 కోట్లు 38 లక్షలు కాగా అయిదేళ్లలో 247 కోట్ల 27 లక్షలు అంటే 48.45 శాతం పెరిగింది.

పెరిగిన ఆస్తులు : 2024 అఫిడవిట్‌ ప్రకారం జగన్ చరాస్తులు 483 కోట్ల 8 లక్షల 35వేల 64 రూపాయలు. 2019లో 339 కోట్ల 89 లక్షల 43 వేల 352 రూపాయలు మాత్రమే. 2024లో స్థిరాస్తులు 46కోట్ల 78 లక్షల 89 వేల 930 రూపాయలు. 2019లో 35 లక్షల 30 వేల 76 వేల 374 రూపాయలు మాత్రమే. 2024లో మొత్తం ఆస్తి 529కోట్ల 87 లక్షల 24 వేల 994 రూపాయలుగా చూపారు. 2019 అఫిడవిట్‌లో 375 కోట్ల 20 లక్షల 19వేల 726 రూపాయలు మాత్రమే. ఇక భారతిరెడ్డికి 2024 లో 119 కోట్ల 38 లక్షల 7వేల 913 రూపాయల చరాస్తులు ఉన్నట్లు చూపారు. 2019లో 92కోట్ల 53 లక్షల 49 వేల 352 రూపాయలుగా ఉంది.

వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా సౌమ్యులైతే - ప్రభుత్వ, ప్రజల సొమ్ము ఏమైనట్లు జగన్? - anakapalli ycp candidates

2024లో స్థిరాస్తులు 56 కోట్ల 92 లక్షల 19 వేల 841 రూపాయలుగా పేర్కొన్నారు. 2019 అఫిడవిట్‌లో 31 కోట్ల 59 లక్షల 2వేల 925గా ఉంది. 2024లో మొత్తం ఆస్తుల విలువ 176 కోట్ల 30లక్షల 27వేల 754 రూపాయలుగా చూపగా 2019లో 124 కోట్ల 12 లక్షల 52వేల 277రూపాయలుగా ఉంది. జగన్‌ మోహన్‌రెడ్డి పెద్దకుమార్తె హర్షిణిరెడ్డికి 2024 అఫిడవిట్‌లో చరాస్తులు 24 కోట్ల 26లక్షల 10వేల 726 రూపాయలు ఉన్నట్లు చూపారు. 2019లో 6కోట్ల 45లక్షల 62వేల 191 రూపాయలు ఉంది.

2024లో స్థిరాస్తులు కోటి 63లక్షల 58వేల 650గా పేర్కొన్నారు. 2019లో ఏమీ లేవు. 2024లో హర్షిణిరెడ్డి మొత్తం ఆస్తుల విలువ 25కోట్ల 89 లక్షల 69వేల 376 రూపాయలుగా చూపారు. 2019లో మొత్తం ఆస్తులు 6కోట్ల 45 లక్షల 62 వేల 191 రూపాయలుగా ఉంది. ఇక వర్షారెడ్డికి 2024లో చరాస్తులు 23 కోట్ల 94 లక్షల 23 వేల 727గా చూపారు. 2019లో 4కోట్ల 59లక్షల 82 వేల 372గా ఉంది. 2024లో స్థిరాస్తులు కోటి 63లక్షల 58 వేల 650గా చూపారు. 2019లో స్థిరాస్తులేవీ లేవు. 2024లో ఆస్తుల విలువ 25 కోట్ల 57 లక్షల 82వేల 377గా ఉంది. 2019లో 4 కోట్ల 59 లక్షల 82 వేల 372 రూపాయలుగా చూపారు.

2024లో కుటుంబం మొత్తం చరాస్తులు 650 కోట్ల 66 లక్షల 77 వేల 430గా చూపారు. 2019లో 443కోట్ల 48 లక్షల 37వేల 267గా ఉంది. స్థిరాస్తుల మొత్తం 2024లో 106 కోట్ల 98 లక్షల 27 వేల 71గా పేర్కొనగా 2019లో 66 కోట్ల 89లక్షల 79వేల 299 రూపాయలుగా ఉంది. 2024లో కుటుంబం మొత్తం ఆస్తుల విలువ757 కోట్ల 65 లక్షల 4వేల 501 రూపాయలు కాగా 2019లో510 కోట్ల 38 లక్షల 16 వేల 566 రూపాయలుగా ఉంది. ఐదేళ్లలో ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

సొంత కారు లేని జగన్​: ఎన్నికల అఫిడవిట్‌లో కోట్ల రూపాయల ఆస్తులను చూపిన జగన్‌ ఒక్కరికి కూడా సొంత కారు లేదని పేర్కొన్నారు. వాళ్ల పేరుతో కార్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఎక్కడా చూపలేదు. జగన్‌ పేరుతో ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ స్కార్పియో వాహనం ఉంది. అది తన సొంతానిది కాదని, హోం మంత్రిత్వశాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. జగన్, ఆయన కుటుంబీకులకు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

జగన్‌కు ఏడు కంపెనీల్లో, ఆయన భార్య భారతికి 22 కంపెనీల్లో, వాళ్ల కుమార్తెలు హర్షిణిరెడ్డికి 7 కంపెనీల్లో, వర్షారెడ్డికి 9 కంపెనీల్లో పెట్టుబడులున్నట్లు చూపారు. వీరందరికీ కలిపి వివిధ కంపెనీల్లో 344 కోట్ల 3లక్షల 77 వేల 886 విలువైన పెట్టుబడులున్నాయి. జగన్‌ పేరిట ఏడు కంపెనీల్లో 263 కోట్ల 64 లక్షల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. భారతీ సిమెంట్స్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్, హరీష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమటెడ్, సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ కంపెనీల్లో జగన్‌కు 263 కోట్ల 64 లక్షల 92వేల 685 విలువైన షేర్లు ఉన్నాయి.

రిలయన్స్​లో పెట్టుబడులు : రిలయన్స్, జియో ఫైనాన్స్‌లో భారతిరెడ్డి పెట్టుబడులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. భారతిరెడ్డికి 69 కోట్ల 42 లక్షల 10వేల 710 రూపాయల పెట్టుబడులున్నాయి. 11 కంపెనీల్లో 53కోట్ల 8 లక్షల 47 వేల 931 విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కెల్వెన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్, సిలికాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హరీష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆకాశ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రేవన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, యుటోపియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో ఈ షేర్లు ఉన్నాయి.

మకరియోస్‌ ఎల్‌ఎల్‌పీ, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీల్లో 13కోట్ల 94 లక్షల 91 వేల 693 రూపాయల విలువైన పెట్టుబడులతో పరిమిత భాగస్వామ్యం ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్స్, ఎన్‌ఎండీసీ, ఏషియన్‌ పెయింట్స్, కోల్గేట్‌ పామోలివ్, ఓఎన్‌జీసీ, సెయిల్, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌లో కోటి 52 లక్షల 17 వేల 143 రూపాయల పెట్టుబడులున్నాయి. 75.01 లక్షల విలువైన సావరిన్‌ గోల్డ్‌ బాండ్లున్నట్లు అఫిడవిట్‌లో చూపారు.

కుమార్తెల పెట్టుబడులు : జగన్‌ కుమార్తెలు వైఎస్‌ హర్షిణిరెడ్డి, వర్షారెడ్డి పేరిట రెండు కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. హర్షిణిరెడ్డికి 10 కోట్లా ఒక లక్షా 655వేల 15 రూపాయలు, వర్షారెడ్డికి 9కోట్ల 95లక్షల 8వేల 976 రూపాయల పెట్టుబడులున్నాయి. మకరియోస్‌ ఎల్‌ఎల్‌పీ, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీల్లో హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిలకు చెరో 7కోట్ల 48లక్షల 71వేల 758 రూపాయల విలువైన పరిమిత భాగస్వామ్య పెట్టుబడులున్నాయి. హర్షిణిరెడ్డికి కెల్వన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 2కోట్ల 3లక్షల 85 వేల 500 విలువైన ఈక్విటీ షేర్లున్నాయి.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సనోఫి ఇండియా, ఏషియన్‌ పెయింట్స్, గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ ఫార్మాలో 26.17 లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. వర్షారెడ్డికి కెల్వన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 2 కోట్ల 3లక్షల 85వేల 500 విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. జెన్సర్‌ టెక్, సనోఫి ఇండియా, ఏషియన్‌ పెయింట్స్, గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్స్‌లలో 19.61 లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. జగన్‌ కుమార్తెలు హర్షిణిరెడ్డికి 1 కోటి 31లక్షల 75 వేల 471 రూపాయలు, వర్షారెడ్డికి 1కోటి 54లక్షల 78 వేల 466రూపాయల విలువైన విదేశీ ఆస్తులున్నాయి.

పెరిగిన బంగారం : గత అయిదేళ్లలో భారతి పేరిట అరకిలో పైనే బంగారు, వజ్రాభరణాలు పెరిగాయి. జగన్‌మోహన్‌రెడ్డికి బంగారు ఆభరణాలేవీ లేవు. భారతి పేరిట 5 కోట్ల 29 లక్షల 87 వేల 319 రూపాయల విలువ చేసే 6,427.79 గ్రాములు, హర్షిణిరెడ్డి పేరిట 4 కోట్ల 43లక్షల 35వేల 816 రూపాయల విలువైన 4,187.19 గ్రాములు, వర్షారెడ్డి పేరిట 4కోట్ల 46లక్షల 82వేల 885 విలువైన 3,457.33 గ్రాముల బంగారు, వజ్రాభరణాలున్నాయి. 2019లో భారతిరెడ్డి పేరిట 3కోట్ల 57లక్షల 16వేల 658 విలువైన 5,862.818 గ్రాములు ఉండేది. గత అయిదేళ్లలో ఆమె అదనంగా 564 గ్రాములు అంటే అరకిలోపైనే బంగారు, వజ్రాభరణాలు సమకూర్చుకున్నారు.

చేతిలో రూ. 7 వేలే: జగన్‌ చేతిలో 7వేలు మాత్రమే నగదు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. భారతిరెడ్డి చేతిలో 10వేల 22 రూపాయలు, కుమార్తె హర్షిణిరెడ్డి చేతిలో 9వేలు, వర్షారెడ్డి చేతిలో 6వేల 987 రూపాయలు మాత్రమే నగదు ఉందట. జగన్‌ ఓ సంస్థకు 43 కోట్ల 10 లక్షలు అప్పు ఇచ్చారు. మరికొందరికి 136 కోట్ల 15 లక్షల రుణమిచ్చారు. వివిధ రుణగ్రహీతల నుంచి ఆయనకు 48లక్షల 95వేలు రావాలి. భారతిరెడ్డికి రుణగ్రహీతల నుంచి 4 కోట్ల 37 లక్షలు రావాలి. ఇదికాకుండా 26లక్షల 54 వేల మేర రుణాలిచ్చారు. వాళ్ల కుమార్తె హర్షిణిరెడ్డి 2 కోట్ల 43 లక్షలు, వర్షారెడ్డి 2 కోట్ల 68 లక్షలు అడ్వాన్సులుగా ఇచ్చారు. జగన్‌కు కోటి 10లక్షల 78వేల 350 రూపాయల అప్పున్నట్లు అఫిడవిట్‌లో చూపారు. భారతికి 7కోట్ల 41లక్షల 79వేల 353, హర్షిణిరెడ్డికి 9కోట్ల 2లక్షలు వర్షారెడ్డికి అంతే మేర అప్పులున్నట్లు చూపారు.

తాడేపల్లి ప్యాలెస్​ భారతిదే: తాడేపల్లి ప్యాలెస్‌ భారతిరెడ్డి పేరుతోనే ఉంది. తాడేపల్లిలో భారతికి 47, 52 నంబర్ల విల్లాలున్నాయి. ఒకటి 41 వేల 382 చదరపు అడుగుల విస్తీర్ణంలో, మరోకటి 8వేల 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2019 జనవరి 31న వీటిని కొన్నారు. ఒక విల్లా ఖరీదు 11 కోట్ల 50లక్షలు కాగా, మరొకదాని విలువ కోటీ 91 లక్షలుగా అఫిడవిట్‌లో చూపారు.జగన్‌కు ఇడుపులపాయలో వివిధ సర్వే నంబర్లలో 39.52 ఎకరాలు ... 1కోటి 54 లక్షల 12 వేల 800 రూపాయల విలువైన వ్యవసాయ భూమి ఉంది. పులివెందుల మండలం భాకరాపురంలో 11.03 కోట్ల విలువైన 4,51,282 చదరపు అడుగుల వ్యవసాయేతర భూమి ఉంది.

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 2లో 20.92 కోట్ల విలువైన వాణిజ్య భవనం 37,415 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ఉంది. బంజారాహల్స్‌ సాగర్‌ సొసైటీ, భాకరాపురంలో 13.29 కోట్ల విలువైన రెండు వేర్వేరు నివాస భవనాలున్నాయి. భారతిరెడ్డి పేరుతో కాచివారిపల్లెలో, యర్రగుడిపల్లె, భాకరాపురం, పులివెందులల్లోని వివిధ సర్వే నంబర్లలో 28.57 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. పులివెందుల, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో 14.28 కోట్ల విలువైన వాణిజ్య భవనాలున్నాయి. జగన్‌కు సంబంధించిన భారతీ సిమెంట్స్‌ సంస్థ 30 సంస్థలతో పలు ఒప్పందాలు కదుర్చుకుంది. విద్యుత్తు కొనుగోలు, బొగ్గు కొనుగోలు, మైనింగ్‌ లీజు, లిగ్నైట్‌ సరఫరా, పెట్‌ కోక్‌ కొనుగోలుకు ఈ ఒప్పందాలున్నాయి.

CM Jagan Election Affidavit : జగన్ ఆదాయపు పన్ను రిటర్న్‌లో 2018-19లో ఆదాయం 60 కోట్ల 93లక్షల 89వేల 50 రూపాయలుగా చూపగా 2022-23లో 57 కోట్ల 74లక్షల 97 వేల 600గా ఉంది. భారతికి 2018-19లో ఆదాయం 6కోట్ల 98లక్షల 31వేల 730 రూపాయలు కాగా 2022-23లో10కోట్ల 96లక్షల 11 వేల 780 రూపాయలుగా చూపారు. హర్షిణి రెడ్డికి 2018-19లో ఆదాయం 4లక్షల 36వేల 10 రూపాయలు కాగా 2022-23లో 2 కోట్ల 49లక్షల 2వేల 890 రూపాయలుగా చూపారు. వర్షారెడ్డికి 2018-19లో ఆదాయం77వేల 940 రూపాయలు కాగా 2022-23లో2 కోట్ల 47లక్షల 31వేల 70 రూపాయలుగా చూపారు.

సీఎం జగన్‌పై మొత్తం 26 కేసులు ఉన్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో జగన్‌ నిందితుడిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో మరో 6 కేసులు నమోదయ్యాయి. అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టంతో పాటు మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కేసులు ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసులన్నీ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి. వీటితోపాటు జాతీయ గీతానికి అవమానం కలిగించడం, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తన, పరువునష్టం కలిగించడం తదితర అంశాలతో జగన్‌పై కేసులు నమోదయ్యాయి.

జగన్​పై దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - Stone Attack on Jagan in AP

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు నోటీసులు - చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల ఫలితం - AP CEO Notices To CM YS Jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.