ETV Bharat / lifestyle

హార్మోన్లు సమతులంగా ఉండాలంటే - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

- పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న వైద్య నిపుణులు!

Hormones Balancing Naturally
Hormones Balancing Naturally (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : August 13, 2025 at 6:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tips for Hormones Balancing Naturally : ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. దీని వల్ల అధిక బరువు, నిద్ర పట్టకపోవడం, నెలసరి సంబంధిత సమస్యలు వంటివి తలెత్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి, ఇలా జరగకుండా హార్మోన్లను సమతులంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం!

ఫైబర్ ఎక్కువగా : మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు తగినంత మొత్తంలో ఉండేలా తీసుకుంటే హార్మోన్ల సమతులంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఆహారంలో భాగం చేసుకోవాలని, ఇవి రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని సమన్వయపరుస్తుందని వివరించారు. అవసరమైన పోషకాలతో కూడిన సమతులాహారం హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో, పునరుత్పత్తి రుగ్మతలను నివారించడంలో దోహదపడుతుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

మీ ఆరోగ్యం మీ ఫ్రిజ్​పై ఆధారపడి ఉంటుందని తెలుసా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్, జామ, ఆపిల్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. బ్రకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి హార్మోన్లను సమతుల్యం చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచి, హార్మోన్ల అసమతుల్యతను దారితీయవచ్చని పేర్కొన్నారు.

వెజిటబుల్ ఆయిల్స్ : శరీరంలో కొవ్వుల పాత్ర కీలకంగా ఉంటుందని, బాడీలో హార్మోన్ల ఉత్పత్తికి, వివిధ కణాలు తిరిగి నిర్మితమవడానికి కొవ్వులు ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు. కొన్ని రకాల వెజిటబుల్ ఆయిల్స్​లో అధిక మొత్తంలో ఉండే పాలీశ్యాచురేటెడ్ కొవ్వులు ఈ పనుల్ని సమర్థంగా నిర్వర్తిస్తాయని పేర్కొన్నారు.

కాఫీ మితంగా : మనలో చాలామంది అలవాటైందనో లేక ఇష్టమనో కొందరు పదే పదే కాఫీ తాగుతుంటారు. కానీ, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, దీన్ని మితంగా తీసుకుంటే మంచిదని పేర్కొన్నారు.

clevelandclinic ప్రకారం, హార్మోన్ల అసమతుల్యతకు నివారణ పద్ధతులు :

  • ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం.
  • సమతుల, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
  • ఒత్తిడిని నిర్వహించడం.
  • తగినంత నాణ్యమైన నిద్ర పొందడం

ఇవి కూడా : ఒత్తిడి కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుందని, యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, ఇతర రిలాక్సేషన్ పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని, దీంతో హార్మోన్ల సమతుల్యంగా ఉంటాయని పేర్కొన్నారు. బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, మూడ్ స్వింగ్స్, మొటిమలు, క్రమరహిత పీరియడ్స్ వంటి లక్షణాలు కనిపిస్తే సంబంధిత డాక్టర్లు సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? - నిపుణులు ఏమంటున్నారంటే!

మద్యం సేవిస్తే మంచి నిద్ర పడుతుందా? - అరటి పండు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా!