ETV Bharat / health

ఈ విటమిన్లు లోపిస్తే - మహిళల జీవితం అస్తవ్యస్తమైపోతుంది!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 3:01 PM IST

5 Vitamins for Women: వయస్సు పెరిగే కొద్ది మహిళలకు కొన్ని విటమిన్లు అత్యవసరం అవుతాయి. బరువు మెయింటైన్ చేయడానికి, ఇతర జీవక్రియలు చురుగ్గా సాగడానికి, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి కీలకం. మరి.. అవేంటి? వాటిని ఎలా సమకూర్చుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

5 Vitamins for Women
5 Vitamins for Women

Women Should Include 5 Vitamins in Their Diet: మహిళల రోజువారీ ఆరోగ్యంలో విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 2023 నాటి UNICEF నివేదిక ప్రకారం.. ఒక బిలియన్​ కంటే ఎక్కువ మంది బాలికలు, మహిళలు.. రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అయితే.. ఇవే కాకుండా హార్మోన్ల మార్పులు, రుతుక్రమం, పునరుత్పత్తి సవాళ్ల మధ్య సముచితంగా పనిచేయడానికి వారికి తగినన్ని విటమిన్లు అవసరం. అయితే చాలా మంది మహిళలు విటమిన్స్​ అనగానే సంప్లిమెంట్స్​ రూపంలో తీసుకుంటారు. అలాకాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్లను ఆహారాల నుంచే పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మహిళలకు అత్యంత ముఖ్యమైన విటమిన్లు ఏంటి? అవి ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..

అలర్ట్ : మహిళలు, పురుషుల్లో వేర్వేరుగా - గుండెపోటు లక్షణాలు!

విటమిన్​ A: విటమిన్ ఏ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం.. విటమిన్ A ఎముకలు, దంతాలను స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పునరుత్పత్తి ఆరోగ్యానికి ఈ విటమిన్​ కీలకమైనది. అంతేకాకుండా ఈ విటమిన్​ను రెగ్యులర్​గా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నివారించుకోవచ్చు.

ఫుడ్స్​: టమాటలు, క్యారెట్, వాటర్ మెలోన్, జామపండ్లు, బ్రొకోలీ, కాలే, బొప్పాయి, పీచ్, గుమ్మడికాయ, పాలకూర, చేపలు, పాలు, గుడ్లు వంటివి రెగ్యులర్​గా డైట్​లో చేర్చుకోవాలి.

విటమిన్​ B3: బి విటమిన్లు మహిళలకు ముఖ్యమైనవి. కణాల అభివృద్ధికి, పనితీరుకు విటమిన్​ B3 చాలా ముఖ్యమైనది. పోషకాలను శక్తిగా మార్చడం, DNA, నాడీవ్యవస్థ పనితీరు సహా అనేక శారీరక విధులకు అవసరం.

ఫుడ్స్: ట్యూనా చేపలు, పల్లీలు, పుట్టగొడుగులు, గోధుమలు, పాలు, గుడ్లు, బీన్స్​ వంటివి తీసుకోవాలి.

విటమిన్ B6: ఈ విటమిన్ శరీరంలో హార్మోనుల ఉత్పత్తికి.. బ్రెయిన్ కెమికల్స్ విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనతను నివారించడంలో, PMS లక్షణాలను తగ్గించడంలో సాయపడుతుంది.

ఫుడ్స్​: బీన్స్, నట్స్​, కోడి గుడ్లు, ముడి పదార్థాలు, ఫోర్టిఫైడ్ సెరెల్స్, అవొకాడో, అరటిపండ్లు, మాంసాహారం, ఓట్ మీల్, డ్రైఫ్రూట్స్​లో అధికంగా ఉంటుంది.

విటమిన్ B9: విటమిన్ బి9ను ఫోలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది మహిళలందరికీ ముఖ్యమైన విటమిన్. ముఖ్యంగా గర్భిణులకు న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి, శిశువు వెన్నెముక, మెదడును రక్షించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ ప్రెజర్, డిప్రెషన్, క్యాన్సర్, మెమరీ లాస్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది.

ఫుడ్స్​: ఆకుకూరలు, బీన్స్​, పప్పుధాన్యాలు, గుడ్లు, నారింజ, అరటిపండ్లు, పాలఉత్పత్తులు, మాంసం, చేపలు వంటివి తీసుకోవాలి.

మహిళల్లో లోయర్ బ్యాక్​ పెయిన్​ - ఎందుకొస్తుంది? ఎలా రిలీఫ్‌ పొందాలి?

విటమిన్ B12: శరీర ఆరోగ్యానికి అత్యవసరమైనటువంటిది. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, మహిళల్లో రక్తహీనత నివారణ, మెటబాలిజం రేటును పెంచడానికి, కణవిభజనకు, ప్రొటీన్ సింథసిస్​కు సహాయపడుతుంది. సాధారణ B12 స్థాయిలు గర్భధారణ, పుట్టుకకు సంబంధించిన ప్రధాన పునరుత్పత్తి సమస్యల నివారణతో ముడిపడి ఉన్నాయని ఒక అధ్యయనం తేల్చింది.

ఫుడ్స్​: ఫిష్, డైరీ ప్రొడక్ట్స్, మాంసాహారాలు, గుడ్డులో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్​లో చేర్చుకోవాలి.

విటమిన్ సి: విటమిన్ C ని ఇమ్యూన్ బూస్టర్​గా కూడా పిలుస్తారు. ఈ విటమిన్ మహిళలకు చాలా ఉపయోగకరమైనది. ఇది రొమ్ము క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భిణీ, పాలిచ్చే స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది చాలా ముఖ్యమైనది. అలాగే బ్లడ్ సెల్స్ ఉత్పత్తిలో ముఖ్య పాత్రను పోషిస్తుంది.

ఫుడ్స్​: బ్రొకోలీ, గ్రేప్ ఫ్రూట్, కివి, ఆరెంజ్, పొటాటో, స్ట్రాబెర్రీస్, టమాటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ డి: కాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం. ఇది గర్భిణీ స్త్రీలలో ప్రసూతి రక్తపోటు, ముందస్తు ప్రసవాన్ని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

ఫుడ్స్​: పుట్టగొడుగులు, గుడ్లు, చేపల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. అలాగే సూర్యరశ్మి నుంచి కూడా దీనిని పొందవచ్చు.

విటమిన్ ఇ: ఇది రోగనిరోధక శక్తి, చర్మం, కంటి ఆరోగ్యాన్ని పెంచే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. పునరుత్పత్తి ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యతకు విటమిన్ ఇ కూడా అవసరం.​

ఫుడ్స్​: వేరుశనగ, బాదం, అవకాడో, పాలకూర, కివి, చేపలు, గుడ్లలో పుష్కలంగా ఉంటుంది.

మహిళల కోసం అదిరిపోయే ఫైనాన్షియల్ టిప్స్ - ఫాలో అయ్యారంటే శ్రీమంతులు కావడం పక్కా!

ఇవి తింటే.. మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.