ETV Bharat / health

మగాళ్ల పెదవులు ఎందుకు నల్లగా మారుతాయి?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 12:24 PM IST

Tips To Whiten Dark Lips : చాలా మంది మగాళ్ల పెదాలు నల్లగా ఉంటాయి. ముఖం ఆకర్షణీయంగానే ఉన్నా.. లిప్స్ మాత్రం కాస్త తేడాగా ఉంటాయి! మరి.. ఎందుకు ఇలా తయారవుతాయి? వాటిని తిరిగి సాధారణ స్థితికి తేవచ్చా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Tips To Whiten Dark Lips
Tips To Whiten Dark Lips

Tips To Whiten Dark Lips : అందం అడవాళ్లకే కాదు.. మగాళ్లకూ ముఖ్యమే. అందంగా కనిపించడంలో పెదాల పాత్ర మగాళ్లలో కూడా కీలకమే. కానీ.. చాలా మంది పురుషుల్లో పెదాలు నల్లగా మారిపోతున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే కాకుండా.. జన్యువులు కూడా కారణమవుతున్నాయి. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా పెదాలపై నలుపు తొలగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకు నల్లగా మారతాయి?
చాలా మంది మగాళ్ల పెదవులు నల్లగా మారడానికి పొగతాగడం ప్రధాన కారణం. ఈ అలవాటు ఉన్నవారి లిప్స్ కాలక్రమేణా నల్లగా, నిర్జీవంగా మారిపోతాయి. సిగరెట్‌లో ఉండే నికోటిన్ లిప్స్‌కు ఆక్సిజన్ సరఫరా నిలిపివేస్తుంది. అలాగే.. పొగ నుంచి వెలువడే వేడి శరీరంలో మెలనిన్‌ విడుదల చేయడానికి ప్రేరేపిస్తుందట. దీనివల్ల నోటి చుట్టూ ఉన్న ప్రాంతం బ్లాక్‌ కలర్‌లోకి మారిపోతుంది. ఇంకా.. కొందరు నిత్యం పెదాలు నాలుకతో తడి చేస్తుంటారు. దీనివల్ల కూడా పెదాలు నల్లగా మారుతాయి. ఇంకా.. పలు కారణాలు కూడా ఉండొచ్చు. అయితే.. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే పెదాలను ఎర్రగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నిమ్మరసం : పెదాలపై ఉన్న బ్లాక్‌ కలర్‌ తొలగిపోవడానికి నిమ్మరసం ఎంతగానో సహాయపడుతుంది. ఇది సహజ సిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నలుపు సమస్యతో బాధపడేవారు రోజూ రెండు మూడు సార్లు కొద్దిగా నిమ్మరసాన్ని పెదాలపై అప్లై చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు.

జుట్టు భారీగా ఊడిపోతోందా? - ఇంట్లో దొరికే హెయిర్ మాస్క్​లతో రిజల్ట్ పక్కా!

ఆలివ్‌ ఆయిల్‌తో : పెదాలు డార్క్ కలర్‌లో ఉన్న వారికి.. ఆలివ్‌ ఆయిల్‌ స్క్రబ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుంగా ఒక గిన్నెలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ను తీసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా తేనె లేదా చక్కెర వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసి సున్నితంగా మసాజ్‌ చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు రెండు సార్లు స్క్రబ్‌ను అప్లై చేసుకోండి. కొన్ని రోజుల్లోనే మంచి రిజల్ట్‌ కనిపిస్తుంది.

బీట్‌రూట్‌ : జ్యూస్‌ను రాత్రి పడుకునే ముందు పెదాలపై మసాజ్‌ చేసుకోండి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు పెదాలను కాంతివంతం చేయడంలో సహాయం చేస్తాయి.

దోసకాయ : దోసకాయను ముక్కలుగా కట్‌ చేసుకుని వాటితో పెదాలపై కొన్ని నిమిషాలపాటు మసాజ్‌ చేయండి. ఇలా చేయడం వల్ల లిప్స్‌పై ఉండే నలుపు రంగు తొలగిపోతుంది.

ఆల్మండ్ ఆయిల్ : ఆల్మండ్ ఆయిల్‌లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది నల్లగా ఉన్న పెదాలను మెత్తగా, కాంతివంతంగా చేయడానికి సహాయం చేస్తుంది. నలుపు సమస్యతో బాధపడేవారు కొద్దిగా బాదం నూనెను నైట్‌ టైమ్​లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. పై చిట్కాలు పాటిస్తూనే పొగతాగడం వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నట్టే!

పెయిన్​లెస్​ డెలివరీ సేఫేనా? డాక్టర్లు ఏం అంటున్నారు?

అర్ధరాత్రి దాకా నిద్రపోవట్లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.