ETV Bharat / health

పెయిన్​లెస్​ డెలివరీ సేఫేనా? డాక్టర్లు ఏం అంటున్నారు?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 9:58 AM IST

Delivery Without Pains : ఆడవాళ్లు బిడ్డకు జన్మనివ్వడాన్ని పునర్జన్మగా అభివర్ణిస్తుంటారు. ప్రసవ సమయంలో భరించలేనంత నొప్పి కలుగుతుంది. అందుకే ప్రసవాన్ని ఆడవాళ్లకు పునర్జన్మగా చెబుతారు. అయితే అసలు నొప్పే లేకుండా ప్రసవం సాధ్యమా? అనే ప్రశ్నకు వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Delivery Without Pains
Delivery Without Pains

Delivery Without Pains : బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆడవాళ్ల కల. తమ బిడ్డలకు జీవితాన్ని ప్రసాదించాలనుకునే తల్లిదండ్రులు సుఖ ప్రసవం కోసం చూస్తుంటారు. పూర్వకాలంలో పురిటినొప్పులు భరించే శక్తి, సామర్థ్యం చాలామందిలో ఉండేవి. కానీ మారిన కాలానికి అనుగుణంగా ప్రస్తుతకాలంలో చాలామంది ఆడవాళ్లు ప్రసవం సమయంలో వచ్చే నొప్పులను భరించలేకపోతున్నారు.

దీంతో తమకు నొప్పిని భరించే శక్తి లేదని, కానీ ప్రసవం తొందరగా చెయ్యమని వైద్యులను చాలామంది గర్భిణీలు కోరుతుంటారు. అయితే మారిన టెక్నాలజీ, పరిస్థితులు ప్రసవాన్ని కూడా మార్చేశాయి. ఇందులో భాగంగా కొత్తగా పురిటినొప్పులు లేని ప్రసవం అనేది ఎక్కువగా ట్రెండ్​ అవుతోంది.

పురిటినొప్పులు లేని ప్రసవం అంటే ఏమిటి?
What Is Painless Delivery : ఆడవాళ్లు ప్రసవించే సమయంలో గర్భసంచి నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు భరించలేని నొప్పి, బాధ కలుగుతాయి. అయితే ఈ బాధ, నొప్పిని తగ్గించడానికి వైద్యులు రకరకాల పద్ధతులను వాడుతుంటారు. దీని ఫలితంగా శిశువుకు జన్మనిచ్చే తల్లికి నొప్పి చాలా వరకు తెలియదు. సాధారణ పురిటినొప్పుల కంటే ఈ రకమైన ప్రసవంలో 80 నుంచి 90శాతం వరకు పురిటినొప్పుల బాధే ఉండదు. వీటినే నో పెయిన్​ డెలివరీలు అంటారు.

నో పెయిన్​ డెలివరీ రకాలు
Painless Delivery Types : సాధారణంగా నో పెయిన్ డెలివరీలో నాలుగు రకాల పద్ధతులను వైద్యులు వినియోగిస్తుంటారు. నైట్రస్​ ఆక్సైడ్​ లాంటి గ్యాస్​ను ప్రసవ సమయంలో తల్లికి అందుబాటులో ఉంచే పద్ధతి ద్వారా పురిటి నొప్పుల బాధ తెలియకుండా ప్రసవాన్ని సులువుగా పూర్తి చేయవచ్చు. గర్భిణీకి నొప్పులు వస్తున్నాయనుకున్నప్పుడు ఆమెకు ఈ గ్యాస్​ను అందిస్తారు. దీనిని పీల్చడం ద్వారా ఆమె నొప్పి లేకుండా బిడ్డను కనవచ్చు.

ట్యాబ్లెట్లు లేదా ఇంజక్షన్ల ద్వారా
కొన్ని సందర్భాల్లో ట్యాబ్లెట్లు లేదా ఇంజక్షన్లను తల్లికి ఇవ్వడం ద్వారా కూడా నొప్పి తెలియకుండా ప్రసవం చేయవచ్చు. మరికొన్నిసార్లు వెన్నుపూసకు ఇంజక్షన్​ ఇవ్వడం ద్వారా కూడా ప్రసవాన్ని పూర్తి చేయవచ్చు. వైద్య పరిభాషలో దీనిని ఎపిడ్యూరియల్​ అనస్థీషియా అని పిలుస్తారు. సాధారణంగా ఈ తరహా ప్రసవం కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా సాధారణ ప్రసవం కన్నా పెయిన్​లెస్​ డెలివరీ రెండు గంటలు ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్​ ఉంటాయా?
Painless Delivery Side Effects : పెయిన్​ లెస్​ లేదా నో పెయిన్​ డెలివరీ వల్ల ఏవైనా సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. అయితే ఈ తరహా డెలివరీలో తల్లికి కానీ బిడ్డకు కానీ తాత్కాలిక లేదా దీర్ఘకాల సమస్యలు ఏమీ రావని, సైడ్​ ఎఫెక్ట్స్​ కూడా ఏవీ ఉండవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ తరహా డెలివరీకి ముందు నుంచి సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులను ముందుగానే సంప్రదించి ఈ తరహా డెలివరీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ పాదాల్లో ఈ తేడాలున్నాయా? - అయితే మీకు ఆ రోగాలు రాబోతున్నట్టే!

వాటర్​ బాటిల్ ఉపయోగిస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.