ETV Bharat / health

జుట్టు భారీగా ఊడిపోతోందా? - ఇంట్లో దొరికే హెయిర్ మాస్క్​లతో రిజల్ట్ పక్కా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 1:53 PM IST

Best Hair Masks to Prevent Hair Loss : హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్​కు చెక్ పెట్టేందుకు ఆయిల్స్, షాంపూలు ఎన్నో వాడుతుంటారు. కొందరైతే అడ్వాన్స్​డ్ ట్రీట్​మెంట్స్ తీసుకుంటారు. అయినా ఫలితం ఉండదు. అయితే.. హెయిర్ మాస్క్ ద్వారా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ​నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Hair Loss
Best Hair Masks to Prevent Hair Loss

Best Homemade Hair Masks To Prevent Hair Loss: హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నవారు.. హోమ్ మేడ్ హెయిర్ మాస్క్​లను ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు. దీని ద్వారా.. వెంట్రుకలు రాలే సమస్య తగ్గడమే కాదు.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందంటున్నారు. ఆవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎగ్ హెయిర్ మాస్క్ : గుడ్డు పోషకాల స్టోర్ హౌస్. దీనిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిన విషయమే. అయితే అదే గుడ్డుతో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్​ను కూడా తగ్గించుకోవచ్చు. ముందుగా గిన్నెలో ఒక గుడ్డు పగలగొట్టాలి. ఆ తర్వాత అందులో 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఆలివ్ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

బనానా హెయిర్ మాస్క్ : బనానా హెయిర్ మాస్క్ ఎలా రెడీ చేసుకోవాలంటే.. ఒక గిన్నెలో 2 బాగా మగ్గిన అరటిపండ్లను తీసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ఆ తర్వాత దానికి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, తేనె యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు మాస్క్ : ఇది కూడా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె కలపుకోవాలి. ఆపై దాన్ని మీ జుట్టుకు అప్లై చేయాలి. అలా 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత హెడ్ బాత్ చేయాలి.

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!

అవకాడో మాస్క్ : దీనికోసం ఒక పండిన అవకాడోను తీసుకుని దాన్ని మెత్తని పేస్ట్​లా చేసుకోవాలి. ఆ తర్వాత దానికి 1/2 కప్పు పాలు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, బాదం నూనె యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని మీ మాడుకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

కరివేపాకు, కొబ్బరి నూనె మాస్క్ : ఈ హెయిర్ మాస్క్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం 10-12 తాజా కరివేపాకులను కొబ్బరి నూనెలో మగ్గే వరకు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని చల్లార్చుకొని జుట్టుకు పట్టించాలి. అలా 20 నిమిషాలు ఉంచి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

స్ట్రాబెర్రీ హెయిర్ మాస్క్ : తాజా స్ట్రాబెర్రీలు 3-4 తీసుకొని పేస్ట్​లా చేసుకోవాలి. దానికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, తేనె కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు అంచుల వరకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్​లలో ఏదో ఒకటి మీరు తరచుగా జుట్టుకు అప్లై చేశారంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తగ్గడమే కాకుండా మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందంటున్నారు నిపుణులు.

గమనిక : ఇది మీ అవగాహన కోసమే. పాటించేముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలా? - బ్లాక్ టీని ఇలా వాడితే రిజల్ట్ పక్కా!

జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.