ETV Bharat / health

విపరీతంగా జుట్టు ఊడిపోతోందా? ఇంట్లోని ఈ ఐటమ్స్​తో హెయిర్​ లాస్​కు చెక్​ పెట్టండిలా! - Tips To Stop Hair Fall

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 1:42 PM IST

Home Tips To Stop Hair Fall
Home Tips To Stop Hair Fall

Tips To Stop Hair Fall : జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? ఏవేవో షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా? అయితే మీ ఇంట్లోనే దొరికే ఈ సహజ పదార్థాలను ఒక్కసారి ట్రై చేసి చూడండి. మెరుగైన రిజల్ట్స్​ వస్తాయి. మరి ఆ ఐటమ్స్​ ఏంటో, వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips To Stop Hair Fall : బలమైన, పొడవైన జుట్టు కావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ దాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలమైపోతారు. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య జట్టు రాలడం​. మనం తినే ఆహారం, పెరుగుతున్న కాలుష్యం, జీవన విధానం వంటి కారణాలేవైనా చాలామందికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది.

Home Remedies To Stop Hair Loss : కొత్తగా వెంట్రుకలు రాకున్నా పర్లేదు కానీ, ఉన్నవి ఊడిపోకుండా బలంగా ఉంటే చాలు దేవుడా అని అనుకునేవారు చాలామందే ఉంటారు. వెంట్రుకలు ఊడకుండా ఉండాలంటే హానికరమైన షాంపూలు, నూనెలకు దూరంగా ఉండటం ఒక మార్గమైతే మన ఇంట్లోనే సహజంగా దొరికే కొన్ని పదార్థాలను తలకు పట్టించడం మరో మార్గం. అలా సహజమైన పదార్థాలతో సులభంగా వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

సమతుల్య ఆహారం
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, ఊడిపోకుండా కాపాడటానికి ముందుగా మీరు చేయాల్సింది సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం. అంటే మీరు తినే ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కెరాటిన్, విటమిన్-బీ7 లాంటి విటమిన్లు, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు కురులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటితోపాటు వెంట్రుకల కణజాలం పెరుగుదలతో పాటు దృఢత్వంలో కోసం ఐరన్, జింక్ కలిగి ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల పొడవైన బలమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.

హెడ్ మసాజ్​
ప్రతిరోజు కనీసం నాలుగు నిమిషాల పాటు జుట్టుకు మసాజ్​ చేసుకోవడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయని ఓ అధ్యయనం పేర్కొంది. హెడ్​ మసాజ్​ అనేది హెయిర్​ ఫోలీకల్స్​కు రక్త ప్రసరణను పెంచుతుంది. కాలక్రమేణా వెంట్రుకలు మందంగా, బలంగా మారేందుకు సహాయపడుతుంది. మెరుగైన రక్తప్రసరణ వెంట్రుకల పెరుగుదలకు, కుదుళ్ల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి కనీసం రోజుకు నాలుగు నిమిషాల పాటు గోరు వెచ్చటి నూనెతో మసాజ్​ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.

కలబంద
చాలారకాల అనారోగ్య సమస్యలను నయం చేయగల దివ్యౌషధం కలబంద. ఇది మన ఇంట్లోనే ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అనేకరకాల గాయాలు, ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలకు చక్కటి మందులా ఇది పనిచేస్తుంది. అలాగే మీ జుట్టుకు కూడా కలబంద చాలా మంచి పోషణనిస్తుంది. దీంట్లోని సహజ మాయిశ్చరైజింగ్​ లక్షణాలు పొడిబారిన వెంట్రుకల కారణంగా వచ్చే దురద, చమట కారణంగా కలిగే చికాకులను నుంచి ఉపశమనం కలిస్తుంది. అలాగే దీంట్లోని తేమ శాతం మీ పూర్తి తలకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన, అందమైన వెంట్రుకలు మీ సొంతమవుతాయి.

గుడ్డు మాస్క్
ఇంట్లోనే వేసుకునే హెయిర్​ మాస్కుల్లో గుడ్డు మాస్క్​ చాలా మంచిది. గుడ్డు ప్రొటీన్లతో నిండి ఉంటాయి. అలాగే దీంట్లో బయోటిన్, ఫోలేట్, విటమిన్-ఏ, విటమిన్-డీ వంటి ఇతర పోషకాలు మీ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఈ పోషకాలన్నీ మీ స్కాల్ప్, హెయిర్ ఫోలీకల్స్​ను పోషించడంలో సహాయపడతాయి. కానీ గుడ్లతో ఎలర్జీ లాంటి సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిది.

గ్రీన్​ టీ
గ్రీన్​ టీ కడుపులోని చెత్తను ఎలా అయితే తొలగిస్తుందో వెంట్రుకల కుదుళ్ల సమస్యలను కూడా అలాగే నయం చేస్తుంది. గ్రీన్​ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీంట్లోని కాటెచిన్లు, డైహైడ్రోటెస్టోస్టెరాన్​ అనే హార్మోన్‌ను నిరోధించి జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు సహాయపడతుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా తలకు గ్రీన్​ టీ పట్టించి తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు ఊడిపోకుండా బలంగా తయారవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కోడిగుడ్లతో ఇన్ని ప్రయోజనాలా? ఒక ఎగ్ ఉత్పత్తికి ఎంత టైమ్ పడుతుందో తెలుసా? - FACTS ABOUT EGGS

పుచ్చకాయతో పాటు గింజలూ తినండి - మధుమేహం, గుండె జబ్బులతో పాటు ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్! - Watermelon Seeds Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.