ETV Bharat / health

ఈ టిప్స్ పాటిస్తే చాలు - బ్యూటీ పార్లర్​కు వెళ్లకుండానే ఫేస్​ మిలమిలా మెరవడం గ్యారంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 12:27 PM IST

Etv Bharat
Etv Bharat

Tips to Increase Face Glow : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడకపోవచ్చు. అందుకోసం బ్యూటీపార్లర్​కు వెళ్లినా అది తాత్కాలికం మాత్రమే. కాబట్టి ముఖ చర్మాన్ని సహజంగా క్లీన్ చెయ్యడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఆవిరి పట్టడం బెస్ట్​ ఆప్షన్​ అని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో.

Tips to Increase Face Glow Naturally: అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయికీ ఉంటుంది. కానీ మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం, ఇతర కారణాల వల్ల ఫేస్​లో గ్లో ఉండటం లేదు. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడుతుంటారు. ఇక కొద్దిమంది రెగ్యులర్​గా బ్యూటీపార్లర్​కు వెళ్తుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా ముఖాన్ని మెరిపించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఇక తరచుగా బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడటం వల్ల ముఖం కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ క్రమంలో ముఖ చర్మాన్ని సహజంగా క్లీన్ చెయ్యడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఆవిరి పట్టడం బెస్ట్​ ఆప్షన్​. అదేంటి ఆవిరి పడితేనే ప్రాబ్లమ్​ సాల్వ్​ అవుతుందా అనే అనుమానం మీకు వచ్చిందా? మీరు విన్నదే నిజమే. ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు డీప్​గా క్లీన్ అవుతాయిని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

దోసకాయ: మనం రోజువారి వంటల్లో ఉపయోగించే దోసకాయ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సాయపడుతుంది. ఆవిరి పట్టడం కోసం ముందుగా కొన్ని దోసకాయ ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి. నీరు బాగా మరిగిన తరువాత ఆ నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. కావాలనుకుంటే ఒక గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేసి ఆవిరి పట్టుకోవచ్చు. ఇలా ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. నూనె, దుమ్ము, ధూళి కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు క్లీన్​ అవుతాయి. అలాగే మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది. "International Journal of Trichology" 2011లో జరిపిన ఒక అధ్యయనంలో, దోసకాయ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.

ఫస్ట్​టైమ్​ మేకప్​ ట్రై చేస్తున్నారా? ఈ టిప్స్​ పాటించండి - సూపర్ బ్యూటీ మీ సొంతం!

సోంపు, బిర్యానీ ఆకులు: ముఖాన్ని క్లీన్​ చేయడానికి ఈ రెండు పదార్థాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా బిర్యానీ ఆకులు, 1 టీస్పూన్ సోంపు మిక్సీ జార్​లో వేసి మెత్తగా బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత వేడినీళ్లలో ఈ పొడి వేసి మరికొంత సేపు మరిగించాలి. ఇందులో కొన్ని చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.

నిమ్మకాయ: నిమ్మకాయను చర్మ సంరక్షణలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. కాగా మరుగుతున్న నీటిలో పిండేసిన నిమ్మతొక్కలు, గ్రీన్ టీ బ్యాగ్ లేదా టీ ఆకులు వేసి కొద్దిసేపు మరిగించాలి. నీటిని దింపిన తర్వాత దీంట్లో కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. చర్మం మీద ఉన్న మృత కణాలు, మురికి క్లీన్ అవుతాయి.

వేపాకులు: చర్మ సౌందర్యంలో వేప ఆకులు చేసే మేలు అంతా ఇంత కాదు. ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 5 నుంచి 7 వేపాకులను వేసి ఆ నీటిని మరిగించాలి. కావాలంటే కొన్ని తులసి ఆకులను కూడా ఇందులో వేసుకోవచ్చు. నీరు బాగా మరిగిన తరువాత దించేసి ఆవిరి పట్టాలి. ఇవి మూసుకుపోయిన రంధ్రాలను తెరవడంలో సహాయపడతాయి.

గమనిక: ముఖానికి పట్టే ఏ ఆవిరి అయినా సరే చాలా ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఎందుకంటే ముఖ చర్మం కందిపోయి ఎర్రగా మారి సెన్సటీవ్​గా మారిపోతుంది.

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!

మీ మోచేతులు నల్లగా మారాయా? - ఈ టిప్స్​తో అందంగా మెరిసిపోవడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.