ETV Bharat / health

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? - క్యాన్సర్ గ్యారంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 1:39 PM IST

Cancer Reasons : రోజురోజుకూ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో.. ప్రజలు ఈ పేరు వింటేనే బెంబేలెత్తిపోతున్నారు. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం కొన్ని అలవాట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని కంట్రోల్​లో పెట్టుకుంటే చాలా వరకు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Cancer Reasons
Cancer

Cancer Cases Rise Causes : క్యాన్సర్.. ఈ పేరు వింటేనే జనం ఆందోళన చెందుతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇండియాలోనూ క్యాన్సర్​ కేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వచ్చే ఐదేళ్లలో కాన్సర్ కేసులు 12% పెరిగే అవకాశం ఉంది. అయితే.. క్యాన్సర్ కేసులు వేగంగా పెరగడానికి జీవనశైలి, అలవాట్లే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శారీరక శ్రమ లేకపోవడం : క్యాన్సర్ బారినపడకుండా ఉండాలంటే మీరు డైలీ వ్యాయామం చేయటం తప్పనిసరి. ఎందుకంటే రోజూ తగినంత శారీరక శ్రమ లేకపోతే క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోండి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ సహా పలు క్యాన్సర్ల ముప్పును చాలా వరకు తగ్గిస్తుంది. అందుకోసం రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అనారోగ్యకరమైన ఆహారం : క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే రోజూ ఆరోగ్యకరమైన తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి పేగు, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, గర్భాశయ క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదాన్నిపెంచుతాయి. అలాగే అధికంగా ఉప్పు తీసుకోవడం తగ్గించాలంటున్నారు నిపుణులు. ఇది కడుపు, జీర్ణశయాంతర క్యాన్సర్లకు కారణమవుతుందంటున్నారు. ముఖ్యంగా మీ డైలీ డైట్​లో పండ్లు, కూరగాయలతో కూడిన మొక్కల ఆధారిత ఆహారం ఉండేలా చూసుకోవాలంటున్నారు.

అధిక సూర్యరశ్మి : సరైన రక్షణ లేకుండా ఎక్కువసేపు ఎండలో ఉండడం మంచిది కాదు. ఎందుకంటే సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలకు ఎక్కువగా గురైతే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం, రక్షిత దుస్తులు ధరించడం చేయాలి. అలాగే వీలైనంత వరకు నీడలో ఉండడానికి ట్రై చేయాలి. ఇవన్నీ UV కిరణాల నుంచి రక్షించడంలో చాలా బాగా సహాయపడతాయి.

దగ్గుతున్నప్పుడు ఛాతి, భుజాల దగ్గర నొప్పిగా ఉందా? ఇది క్యాన్సర్‌ సంకేతం కావచ్చు!

ఊబకాయం : క్యాన్సర్ రావడానికి ఊబకాయం ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. దీని కారణంగా రొమ్ము, కొలొరెక్టల్, ప్యాంక్రియాటిక్, కిడ్నీ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి.

ఒత్తిడి : దీర్ఘకాలిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి. అందుకోసం డైలీ యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవేకాకుండా ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వంటివి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీలైనంత వరకు వీటి వినియోగాన్ని తగ్గించాలి. అవసరమైతే పూర్తిగా దూరంగా ఉంటే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటితో పాటు నోటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే నోరు అపరిశుభ్రంగా ఇన్ఫెక్షన్లు వ్యాపించి ఆ కారణంగా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

అంటువ్యాధులు : హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV), హెపటైటిస్ B, C వైరస్​లు, హెలికోబాక్టర్ పైలోరీ (H. పైలోరీ) వంటి కొన్ని ఇన్ఫెక్షన్‌లు గర్భాశయ, కాలేయం, కడుపు క్యాన్సర్‌లతో సహా నిర్దిష్ట క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి అంటువ్యాధులు ప్రబలకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి.

క్యాన్సర్​ను ఎలా గుర్తించవచ్చో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!

నిద్రలేమితో క్యాన్సర్ - డయాబెటిస్, హార్ట్ ఎటాక్ బోనస్! ఇంకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.