ETV Bharat / health

మీ చర్మంపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా? - అయితే క్యాన్సర్ కావొచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 9:54 AM IST

Melanoma Symptoms : క్యాన్సర్.. ఈ పేరు చెబితేనే జనాలు భయపడిపోతారు. ఎన్నో రకాల క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ ఒకటి. ఇందులో అత్యంత తీవ్రమైన రకం మెలనోమా. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇది ఎలా వస్తుంది? లక్షణాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

Melanoma
Melanoma Symptoms

Melanoma Warning Signs : జనాలను బెంబేలెత్తించే జబ్బుల్లో క్యాన్సర్ ముందు వరసలోనే ఉంటుంది. దీనిలో అనేక రకాలు ఉంటాయి. అందులో ఒకటి.. చర్మ క్యాన్సర్(Skin Cancer). ఇది మూడు రకాలుగా ఉంటుంది. అత్యంత తీవ్రమైన రకం మెలనోమా. ఇది చాలా వేగంగా పెరగడమే కాదు ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీనిని ఆదిలోనే గుర్తించి ట్రీట్​మెంట్ తీసుకోవడం చాలా అవసరమంటున్నారు. అసలు, మెలనోమా ఎలా వస్తుంది? లక్షణాలు, కారణాలేంటి? ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మెలనోమా అంటే ఏమిటంటే ?

మెలనోమానే క్యాన్సర్ పుట్టుమచ్చ అంటారు. ఇది చాలా కొద్దిమందిలో వస్తుంది. మెలనోసైట్స్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు ఆగకుండా పెరగుతుంటాయి. ఈ మెలనోసైట్స్ నుంచి మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. స్కిన్ కలర్​కు ఇదే కారణం. మన బాడీలో మైలనోసైట్లు అధికంగా పోగుపడిన ప్రాంతాలే పుట్టుమచ్చలు. అందుకే అవి అంత బ్లాక్​గా ఉంటాయి. అయితే.. దెబ్బతిన్న మెలనోసైట్లు విభజనకు గురై.. క్యాన్సర్​ పుట్టుమచ్చలుగా మారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. మెలనోమా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న 17వ అత్యంత సాధారణ క్యాన్సర్. 2020లో 1,50,000 కంటే ఎక్కువ కొత్త మెలనోమా కేసులు నమోదయ్యాయి. మెలనోమా ఏ వ్యక్తిలోనైనా, శరీరంలో ఎక్కడైనా వస్తుంది. సాధారణంగా ఇది చర్మంపై అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సూర్యరశ్మికి గురయ్యే భాగాలు అంటే చేతులు, ముఖం, కాళ్లపై మెలనోమా మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే కళ్లలోనూ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.

మెలనోమా లక్షణాలు : క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. దాదాపు 30% మెలనోమాలు ఇప్పటికే ఉన్న పుట్టుమచ్చల్లో ప్రారంభమవుతాయి. మిగిలినవి సాధారణ చర్మంలోనూ ప్రారంభమవుతాయి. కాబట్టి మీ చర్మంలో మార్పులపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. అయితే.. మెలనోమా లక్షణాలను గుర్తించడంలో ABCDE అనే పరీక్ష మీకు చాలా బాగా సాయపడుతుందంటున్నారు నిపుణులు. దాని ద్వారా ఈజీగా లక్షణాలను గుర్తించండిలా..

  • A అంటే అసిమ్మెట్రీ. దీనికి అర్థం అసమానత. అంటే శరీరంపై అసాధారణమైన పుట్టుమచ్చలని గమనించడం.
  • B అంటే బార్డర్. అంటే.. చర్మంపై ఏర్పడిన మచ్చల అంచులను చూడాలి. అవి సమానంగా లేకుండా, రఫ్​గా కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలి.
  • C అంటే కలర్. మచ్చ రంగులో మార్పు గమనించవచ్చు. ఒకవేళ మచ్చలు అనేక రంగులను కలిగి ఉంటే అది మెలనోమా కావచ్చు.
  • D అంటే డయామమీటర్. దీని అర్థం ఏమిటంటే.. పావు అంగుళాల కంటే ఎక్కువ, పెన్సిల్ ఎరేజర్ పరిమాణంలో ఉండే పుట్టమచ్చలు మెలనోమాకి సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.
  • E అంటే ఎవాల్వింగ్. దీని మీనింగ్ మచ్చలు మార్పు చెందడం. అంటే మచ్చ పరిమాణం పెరగడం, ఆకారం మారడం, దురద, నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే అది మెలనోమా కావొచ్చంటున్నారు నిపుణులు.

"ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్"​లో ప్రచురించిన ఒక అధ్యయనంలో.. ABCDE నియమాన్ని ఉపయోగించి మెలనోమాను గుర్తించడంలో వైద్యులు 80% కచ్చితంగా ఉన్నారని కనుగొన్నారు. అలాగే ఠది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీఠలో ప్రచురించిన ఒక అధ్యయనం పక్రారం.. మెలనోమా ఉన్న రోగులలో 70% మంది తమ మచ్చలో మార్పులను గమనించారని వెల్లడైంది.

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? - క్యాన్సర్ గ్యారంటీ!

అయితే మెలనోమాలు సూర్యరశ్మికి ఎక్కువగా తగిలే చర్మంపై మాత్రమే కాకుండా.. కాలి వేళ్ల మధ్య, అరచేతులు, అరికాళ్లు, నెత్తిమీద లేదా జననేంద్రియాల మధ్య ఖాళీల్లోనూ అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మెలనోమాలు బ్రౌన్ లేదా బ్లాక్ స్కిన్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మెలనోమా కారణాలు :

మెలనోమాకు ఖచ్చితమైన కారణం లేదు. కానీ, శాస్త్రవేత్తలు విశ్వసించే ప్రధాన కారణం.. సూర్యుని నుంచి అతినీలలోహిత కాంతి లేదా UV కాంతికి గురికావడం. కాబట్టి.. UV కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఎండలో తిరిగినప్పుడు సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం, నిండుగా దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ చర్మం దెబ్బతినడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.