ETV Bharat / health

సింక్‌లో నీళ్లు నిలిచిపోయాయా ? ఈ టిప్స్​ పాటిస్తే ప్రాబ్లం సాల్వ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 5:18 PM IST

How To Kitchen Sink Clean : మహిళలు కిచెన్‌లో వంటి చేసిన తర్వాత ఎక్కువగా కష్టపడేది సింక్‌ దగ్గరే. అయితే, గిన్నెలను శుభ్రం చేసేటప్పుడు సింక్‌లో వాటర్‌ నిలిచిపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా కాకుండా సింక్‌ క్లీన్‌గా ఉండాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Kitchen Sink Clean
How To Kitchen Sink Clean

How To Clean Kitchen Sink : ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు కిచెన్​లో ఏదో ఒక వంట చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తిన్నప్లేట్లు​, తాగిన గ్లాసులు, బౌల్స్​.. ఇలా ఏది కడగాలన్నా సింక్​ ముఖ్యం. అయితే సింక్​ క్లీన్​గా ఉంటే ఎన్ని గిన్నెలైనా కడగడానికి ఈజీగా ఉంటుంది. అదే సింక్​లో​ నీరు పోకుండా జామ్​ అయినప్పుడే అసలు చిరాకు మొదలువుతుంది. దీనికి కారణం పాత్రలు కడిగినప్పుడు అందులోని చిన్న చిన్న వ్యర్థాలు సింక్ పైపులో పేరుకుపోవడమే. మరి మీరు కూడా పదేపదే సింక్‌లో వాటర్‌ నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈజీగా సింక్‌లో వాటర్‌ నిలిచిపోకుండా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి నీళ్లు: సింక్‌ను ఈజీగా క్లీన్‌ చేయడానికి ఏదైనా మార్గం ఉందంటే, అది వేడి నీళ్లే. అవును మీరు విన్నది నిజమే. హాట్​ వాటర్​ సాయంతో సింక్​ పైపులో ఇరుక్కుపోయినా వేస్ట్​ మొత్తం క్లీన్​ అవుతుంది. దీని కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీటిని వేడి చేసుకోండి. ఆ తర్వాత జాగ్రత్తగా నీటిని సింక్‌లో పోయండి. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు చేయడం వల్ల సింక్‌ పైపులో పేరుకుపోయిన వ్యర్థాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ వేడి నీళ్లను పోయడం వల్ల జిడ్డు కూడా తొలగిపోతుంది.

బేకింగ్ సోడా, వెనిగర్‌: సింక్‌లో నీళ్లు నిలిచిపోకుండా ఉండటానికి బేకింగ్‌ సోడా, వెనిగర్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాగంటే ముందుగా ఓ కప్పు వాటర్​లో సగం కప్పు బేకింగ్ సోడా, సగం కప్పు వెనిగర్‌ను పోసుకుని మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సింక్‌లో పోయాలి. అలా 15 నిమిషాలు పూర్తైన తర్వాత మళ్లీ వేడి నీటిని పోయాలి. ఇలా రెండు మూడు సార్లు వేడి నీటిని సింక్‌లో పోయాలి. అంతే సింక్‌ పైపులో ఉన్న వ్యర్థాలు అన్నీ ఈజీగా తొలగిపోతాయి.

ప్లంగర్ ఉపయోగించండి: ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ ప్లంగర్ ఉంటుంది. అయితే ఇది కూడా సింక్‌ను క్లీన్‌ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది ఇది కేవలం టాయిలెట్ల కోసమే అనుకుంటారు. కానీ, ఈ ప్లంగర్‌ను కిచెన్ సింక్‌లలో వ్యర్థాలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్లంగర్‌తో పంప్ చేయడం వల్ల కూడా సింక్‌లోని వ్యర్థాలు తొలగిపోయి క్లీన్ అవుతుంది.

బెంట్ వైర్ హ్యాంగర్: సింక్‌లో వాటర్‌ ఎక్కువగా నిలిచిపోతే వైర్‌ హ్యాంగర్‌తో కూడా వ్యర్థాలను తొలగించవచ్చు. సింక్‌లోని ఆహార పదార్థాల వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు పడి మూసుకుపోతే హ్యాంగర్‌కు హుక్‌ను సెట్ చేసి క్లీన్ చేయండి. పైన తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల ఈజీగా సింక్‌ను క్లీన్‌ చేసుకోవచ్చు.

పిప్పర్‌మెంట్ ఆయిల్ : ఒక్కోసారి సింక్​లో నీరు జామ్​ అయిన తర్వాత బ్యాడ్​ స్మెల్​ వస్తుంటుంది. ఆ వాసన పొగొట్టుకోవాలంటే పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను ఉపయోగించండి. ముందుగా సింక్​లోని వాటర్​ను క్లీన్​ చేసిన తర్వాత ఓ స్ప్రే బాటిల్‌లో కొద్దిగా వాటర్‌ పోసి అందులో 10 చుక్కల పిప్పర్​మెంట్ ఆయిల్ వేసి దానిని సింక్ ప్రాంతంలో స్ప్రే చేయాలి. అంతే బ్యాడ్ స్మెల్‌ మాయమవుతుంది.

మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్​ ట్రై చేస్తే స్మెల్​ పరార్​!

ఉప్పు వాడకం ఎలా తగ్గించాలో తెలియట్లేదా - ఈ టిప్స్ పాటించండి!

మైక్రో ఓవెన్​ ఎలా క్లీన్​ చేస్తున్నారు? - ఈ టిప్స్​ పాటిస్తే వెరీ ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.