ETV Bharat / health

ఉప్పు వాడకం ఎలా తగ్గించాలో తెలియట్లేదా - ఈ టిప్స్ పాటించండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 1:47 PM IST

Tips to Reduce Salt : "ఉప్పు ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిది.." వైద్యులు, పోషక నిపుణులు పదే పదే చెబుతున్న మాట ఇది. దీంతో.. చాలా మంది ఉప్పు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ, చప్పటి వంటలు తినలేక మళ్లీ పాత పద్ధతికి వచ్చేస్తారు. మీరు కూడా ఈ పరిస్థితుల్లో ఉంటే.. ఈ చిట్కాలతో తగ్గించుకోండి.

Tips to Reduce Salt
Tips to Reduce Salt

Tips to Reduce Salt : "ఆహా ఏమి రుచి అనరా మైమరచి" అనాలంటే కూరలో ఉప్పు, కారం పర్ఫెక్ట్​గా ఉండాలి. ఎన్ని మసాలాలు ఉన్నా.. కూరలో ఉప్పు లేకపోతే సహించదు. అలాగని ఉప్పు రుచి కోసమేనా అంటే కాదనే చెప్పాలి. శరీరం నిర్వహించే రోజువారీ విధులకూ ఉప్పు అవసరమే. అందులోని సోడియం ఎలక్ట్రోలైట్‌లా పనిచేస్తుంది. నరాల ప్రేరణకీ, కండరాల సంకోచానికీ, కణాల్లో నీరు, ఖనిజాల సమతుల్యత కోసం.. శరీరానికి ప్రతిరోజూ 500 మి.గ్రా. సోడియం కావాలి.

అందుకే.. ఆరోగ్యవంతులు రోజుకు 2,300 మి.గ్రా. సోడియం క్లోరైడ్‌(ఉప్పు)ను తీసుకోవచ్చని ‘అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌’ చెబుతోంది. ఇది ఒక టీస్పూను(5గ్రా.) ఉప్పుతో సమానం. ఇంతకు మించి తింటే ముప్పు తప్పదు అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). బీపీ ఉన్నవాళ్లయితే 1500 మిల్లీ గ్రాముల కన్నా తక్కువ తింటేనే మంచిదట. అంతే కాకుండా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, మెదడు లోపాలకు దారితీస్తుంది. అందువల్ల రోజువారీ దినచర్యలో ఉప్పు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

బ్రెడ్​: చాలా మంది బ్రేక్​ఫాస్ట్​, ఇతర సమయాల్లో కూడా బ్రెడ్​ తింటుంటారు. అయితే ఉప్పు తగ్గించుకోవాలనుకునేవారు బ్రెడ్​కు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే బ్రెడ్​లో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుందని తెలిపారు. ఒక్క బ్రెడ్​ స్లైస్​లో 400 మిల్లీ గ్రాముల ఉప్పు ఉంటుందని స్పష్టం చేశారు. అంతగా బ్రెడ్​ తినాలనుకునేవారు ఉప్పు లేని బ్రెడ్​ను తీసుకోవాలని సూచిస్తున్నారు.

తక్కువ సోడియం: ఇది కూడా ముఖ్యమైనదే. బయట సూపర్​ మార్కెట్స్​లో కొనే ఫుడ్స్​లో ఉప్పు శాతం ఎంత ఉందో చెక్​ చేసుకోవాలి. సోడియం అధికంగా లేదని కన్ఫర్మ్​ చేసుకున్న తర్వాత వాటిని కొనాలని సూచిస్తున్నారు.

మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవట!

సోయా: ఇందులో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల సోయాలో 5.7 గ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఎక్కువ శాతం ఉప్పుతో కూడిన సాస్ మరియు చాలా మితమైన పరిమాణంలో తీసుకోవాలి.

ఉప్పు లేకుండా వంట చేయడం: కూరల్లో ఉప్పు లేకపోతే అది రుచిగా ఉండదు. అయినప్పటికీ ఉప్పు లేకుండా లేదా చాలా తక్కువ ఉప్పుతో వంటలు వండడానికి ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు. అయితే ఇది ఒక్కసారికే అలవాటు కాదు. కాబట్టి ఉప్పు మోతాదును తగ్గించుకుంటూ పోతే.. చివరకు ఉప్పు లేకుండా వంట వండుకోవచ్చు.

ప్రాసెస్ ఆహారాలు వద్దు: ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రెష్​ ఫుడ్​ అనేది బెస్ట్​ ఆప్షన్​ ఎప్పటికీ. ప్రాసెస్​ చేసిన ఆహార పదార్థాల్లో ఎంత ఉప్పు వేస్తున్నారో తెలియదు. కేవలం ఉప్పు మాత్రమే కాకుండా ఇతర రసాయనాలు కూడా కలుపుతారు. అందువల్ల కూడా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ప్రాసెస్​ చీజ్‌: శాండ్‌విచ్‌ల తయారీలో ఉపయోగించే చీజ్‌లో కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉప్పు ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఉపయోగించుకోకుండా చూసుకోవాలి.

కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు!

తృణధాన్యాలు: చాలా మంది బ్రేక్​ఫాస్ట్​లో తృణధాన్యాలను తీసుకుంటారు. వీటిలో షుగర్​ ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే కేవలం షుగర్​ మాత్రమే కాదు కొన్ని తృణధాన్యాల్లో ఉప్పు శాతం చాలా ఎక్కువ.

సాస్‌లు: సాస్​లను బయట మార్కెట్లో కొనేముందు వాటి లేబుల్స్​ చెక్​ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి:

2012లో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అనే సంస్థ బ్రెడ్, బేకరీ ఉత్పత్తుల్లో అధిక శాతం ఉప్పు ఉన్నట్లు కనుగొంది.

2016లో న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. USలో వాణిజ్యపరంగా లభించే బ్రెడ్‌లో సగటు సోడియం కంటెంట్ 100gకి 276mg అని కనుగొంది.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా? ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా? రోజుకు ఇంతే తినాలట!

Himalayan Salt Vs Table Salt : హిమాలయన్ ఉప్పు​ Vs​ సాధారణ ఉప్పు​.. ఆరోగ్యానికి ఏది మంచిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.