ETV Bharat / health

గోళ్లు పెంచుతున్నారా? - వాటి కింద ఏం పెరుగుతూ ఉంటుందో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 1:06 PM IST

Nails Can Be Home to 32 Types Bacteria : మీకు గోళ్లు పెంచుకునే అలవాటు ఉందా? అయితే అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఇటీవల పొడవైన గోర్లు కలిగిన వారి నుంచి శాంపిల్స్ సేకరించి జరిపిన పరిశోధనల్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అవి తెలిస్తే వామ్మో! అనడమే కాదు ఇప్పుడే ఉన్న నెయిల్స్ కూడా కట్ చేస్తారు! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Nails
Fingernails

Fingernails May Contain 32 Types Bacteria : కొంతమందికి నెయిల్స్ పెంచడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలు గోళ్లు పెంచి, ఇష్టమైన నెయిల్ పాలిష్ వేసుకుని మురిసిపోతుంటారు. కానీ.. మీ అందమైన గోళ్ల కింద లక్షలాది సూక్ష్మజీవులు ఉంటాయనే విషయం మీకు తెలుసా? ఇటీవల అమెరికాలో పరిశోధకులు పొడవాటి గోళ్లు(Nails) కలిగిన వారి నుంచి శాంపిల్స్ సేకరించి రిసేర్చ్ జరపగా అందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనుషుల్లో అన్ని రకాల రోగాలు కలిగించే సూక్ష్మజీవుల్లో సగం.. గోళ్ల కిందనే ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీకి చెందిన శాస్త్రవేత్తలు 2021లో గోళ్ల శాంపిల్స్ తీసుకుని ఓ పరిశోధన జరపగా ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికన్ పీడియాట్రిక్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురించారు. దీని ప్రకారం.. నెయిల్స్ కింద 32 రకాల బ్యాక్టీరియా, 28 రకాల ఫంగస్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిలో 50శాతం బ్యాక్టీరియా ఉండగా, 6.3 శాతం ఫంగస్‌ ఉంది. ఇక మిగతా 43.7శాతం బ్యాక్టీరియా, ఫంగస్‌ల మిశ్రమ సమూహం ఉంది.

ఇంకా.. పొడవాటి గోళ్లలో స్టాఫ్ ఆరియస్ అనే బ్యాక్టీరియా కూడా ఉందని పరిశోధకులు అంటున్నారు. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా అని, యాంటీబయాటిక్స్ కూడా దీనిపై పెద్దగా ప్రబావం చూపవని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా కేవలం నెయిల్ కిందనే ఉంటుందని తెలిపారు. ఈ బ్యాక్టీరియా ఉన్న వస్తువులను తాకడం ద్వారా అవి మనుషుల గోళ్ల కిందకు చేరుకుంటాయని వెల్లడించారు. కాబట్టి నెయిల్స్​ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

గోళ్లు కొరుకుతున్నారా? వెంటనే ఆపండి! లేదంటే..

గోళ్ల కింద ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ సాధారణంగా హాని చేయనివని పరిశోధకులు అంటున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఈ సూక్ష్మజీవులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, నెయిల్స్​ గాయపడినప్పుడు లేదా ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఈ బ్యాక్టీరియా నోటి నుంచి లోపలికి వెళ్లి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల నెయిల్స్​ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు.

కొన్ని టిప్స్..

  • చేతులు, గోళ్లను రోజుకు రెండుసార్లు సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా మీ చేతులు, గోళ్లలోకి చేరకుండా ఉంటుంది.
  • ఒకవేళ మీ గోళ్లలో మురికి ఉంటే దానిని తొలిగించేందుకు ఏదైన సాఫ్ట్‌ బ్రష్‌ను ఉపయోగించడం మంచిది. ఇది మీ నెయిల్స్ స్కిన్​పై ఎలాంటి హాని కలిగించదు.
  • అలాగే నెయిల్స్ పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోళ్లు పొడవుగా ఉండడం వల్ల.. మలినాలు, వ్యర్థాలు వాటిలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది.
  • కాబట్టి క్రమం తప్పకుండా నెయిల్స్ కట్ చేసుకోవడం బెటర్.
  • మీకు గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకునే అలవాటు ఉంటే ముందుగా నెయిల్స్ క్లీన్ చేసి ఆ తర్వాత దానిని అప్లై చేయడం మంచిది.
  • ఇక చివరగా గోళ్లు పలుచగా మారినా, రంగు మారినా, మరే ఇతర తేడాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

గోళ్లు అందంగా లేవా? - ఈ బెస్ట్ టిప్స్ మీకోసమే!

మీ గోళ్లు ఇలా మారితే చాలా డేంజర్.. ఆ వ్యాధులు వచ్చే ప్రమాదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.