ETV Bharat / health

ఫేస్​ మాస్క్​లు మంచివేనా? - నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 1:21 PM IST

Face Mask Benefits: చాలా మందికి ఫేస్​ మాస్క్​ విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. కొద్దిమంది ఫేస్​ మాస్క్​లు మంచివంటే, మరికొద్దిమంది స్కిన్​ డ్యామేజ్​ అవుతుందని అంటారు. ఇంతకీ ఫేస్​మాస్క్​ మంచివా? కావా? ఫేస్​మాస్క్​ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Face Mask Benefits
Face Mask is Good For Skin

Face Mask is Good For Skin? : మెరిసే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఉపయోగిస్తుంటారు. అందులో ఫేస్​ మాస్క్​ ఒకటి. ఇవి వాడడం వల్ల ముఖానికి మంచి గ్లో వస్తుందని భావిస్తుంటారు. మరి.. ఇంతకీ ఫేస్​మాస్క్​ వేసుకోవడం మంచిదేనా? కాదా? నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Face Mask: చర్మ సంరక్షణ కోసం ఫేస్ మాస్క్‌లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి చర్మానికి పోషణ, హైడ్రేటింగ్ అందించడమే కాకుండా.. చర్మ సంబంధిత సమస్యలనూ నయం చేస్తాయట. మఖంపైన మొటిమలు, రంధ్రాలు, మచ్చలను తొలగించడంతోపాటు మెరుగైన మేనిఛాయ, మెరుపు తీసుకురావడంలో ఫేస్ మాస్క్​లు చక్కగా పనిచేస్తాయని అంటున్నారు.

ఫేస్​ మాస్క్​ ప్రయోజనాలు:

డీప్ క్లెన్సింగ్: రోజూ ఫాలో అయ్యే క్లెన్సింగ్ చర్మ రంధ్రాల లోపల ఇరుక్కుపోయి ఉన్న మలినాలను బయటకు లాగలేదు. ఇందుకోసం ఫేస్ మాస్క్ చక్కగా పనిచేస్తుందట. రెగ్యులర్​గా ఉపయోగించే క్లెన్సర్ కంటే కూడా మాస్క్​ డీప్​గా క్లెన్స్ చేస్తాయని చెబుతున్నారు. చర్మాన్ని డీటాక్సిఫై చేసి, డెడ్ స్కిన్ సెల్స్​ని తొలగిస్తాయట.

స్కిన్ ప్రాబ్లమ్స్​ తగ్గుదల: వారానికి ఒకసారి ఫేస్ మాస్క్ వాడడం వల్ల.. స్కిన్ పై ఎలాంటి మచ్చలూ లేకుండా కనపడుతుందట. చర్మం లోపలి నుంచి మురికి, బ్యాక్టీరియా తీసేయడం ద్వారా లోపలి నుంచి చర్మానికి కాంతినిస్తుందని చెబుతున్నారు.

ఈ టిప్స్ పాటిస్తే చాలు - బ్యూటీ పార్లర్​కు వెళ్లకుండానే ఫేస్​ మిలమిలా మెరవడం గ్యారంటీ!

బ్లడ్ సర్క్యులేషన్: ఫేస్ మాస్క్​ని రిమూవ్ చేసే సమయంలో చేసే స్క్రబ్బింగ్ వల్ల ఆ ప్రాంతంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఫలితంగా స్కిన్​కి అవసరమైన న్యూట్రిషన్ అందుతుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. మార్కెట్లో దొరికే ఫేస్​ మాస్క్​ బదులు.. ఇంట్లోనే చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఒక ఫేస్​ మాస్క్​ గురించి తెలుసుకుందాం..

ఓట్​మీల్​ ఫేస్​ మాస్క్​: ముందుగా కొన్ని ఓట్స్ తీసుకుని.. పెరుగు, తేనె వేసి బాగా కలిపాలి. పెరుగు నార్మల్ స్కిన్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వారు పెరుగు బదులుగా అలోవెరా జెల్‌ని వాడొచ్చు. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి మాస్క్​లాగా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి రెండు రోజులు ఇలా చేయాలి. అయితే దీనిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.

2015లో డెర్మటోలాజిక్ సర్జరీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఓట్​మీల్​ మాస్క్ ఇరిటేషన్​ను తగ్గించి ​చర్మానికి ఉపశమనం అందించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

2017లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో, ముఖంపై ఉన్న జిడ్డును తొలగించడంలో క్లే మాస్క్(Clay Mask) ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలిందట.

ఫేస్​ రెడ్​గా మారిందా ? ఈ టిప్స్‌తో రిలీఫ్​ పొందండి!

మృతకణాలు పోయి ముఖం అందంగా మారాలా? ఈ స్క్రబ్బర్స్​తో ప్రాబ్లం సాల్వ్​!

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.