ETV Bharat / entertainment

వీకెండ్​​ స్పెషల్- OTTలోకి 8 సినిమాలు​​- ఎంటర్టైన్మెంట్ పక్కా! - Weekend OTT Release

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 9:05 AM IST

Weekend OTT Release: ప్రతి వీకెండ్​లో ఆయా హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయి. కానీ, ఐపీఎల్ ఎఫెక్ట్​ వల్ల ఈ వీకెండ్ భారీ సినిమాలేవీ రిలీజ్​ అవ్వలేదు. కానీ, మూవీ లవర్స్​ను ఈ వీకెండ్ ఎంటర్టైన్​ చేయడానికి ఓటీటీ రెడీ అయ్యింది. ఆయా ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్​లు ఏవో ఇక్కడ చూడండి?

OTT Movies
OTT Movies (Source: Getty Images)

Weekend OTT Release: ఈ వేసవిలో వీకెండ్స్‌లో సరదాగా బయటకు వెళ్లి కాలక్షేపం చేసే పరిస్థితి లేదు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత భయపెడుతున్నాయి. మరి ఇంట్లో కూర్చుని హాయిగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లేటెస్ట్‌ మూవీలు ఎంజాయ్‌ చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది. మేలో తెలుగు, హిందీ, తమిళ్‌, హాలీవుడ్‌ మూవీలో చాలానే ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. మరి కొన్ని త్వరలోనే స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. ఈ వీకెండ్‌లో బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందడానికి ఈ టాప్‌ మూవీస్‌ లిస్టు చూసేయండి.

  • ప్రసన్నవదనం (ఆహా): ఈ మూవీలో నేచురల్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్‌, పాయల్ రాధాకృష్ణన్‌, రాశీసింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తెలుగు సినిమా మే 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  • ఆరంభం (ఈటీవీ విన్‌): ఆరంభం మూవీలో మోహన్ భగత్, సుప్రితా సత్యనారాయణ్ హీరో హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. ఈ తెలుగు సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • రత్నం (ప్రైమ్‌ వీడియో): రత్నం మూవీలో తమిళ హీరో విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌ హీరో హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • క్రూ (జియోసినిమా): ఈ మూవీలో కపిల్ శర్మ, దిల్జిత్ దోసాంజ్‌, టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ వంటి పాపులర్‌ స్టార్లు యాక్ట్‌ చేశారు. ఈ పాపులర్‌ మూవీ మే 24 నుంచి జియోసినిమాలో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  • అట్లాస్‌ (నెట్‌ప్లిక్స్‌): ఈ హాలీవుడ్‌ ఫిల్మ్‌లో జెన్నిఫర్ లోపెజ్, సిము లియు, స్టెర్లింగ్ కె.బ్రౌన్ వంటి స్టార్స్‌ నటించారు. ఈ మూవీ మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది.
  • వాంటెడ్‌ మ్యాన్‌(లయన్స్‌ గేట్‌ ప్లే): వాంటెడ్‌ మ్యాన్‌ హాలీవుడ్‌ మూవీ మే 24 నుంచి లయన్స్‌ గేట్‌ ప్లేలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీలో డాల్ఫ్ లండ్‌గ్రెన్, క్రిస్టినా విల్, లాకెల్సే గ్రామర్ వంటి స్టార్స్‌ నటించారు.
  • స్వాతంత్ర్య వీర్‌ సావర్కర్‌ (జీ5): ఈ మూవీలో రణ్‌దీప్ హుడా, అంకితా లోఖండే లీడ్‌ రోల్స్‌లో యాక్ట్‌ చేశారు. ఈ హిందీ సినిమా మే 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  • ఆక్వామ్యాన్‌ 2 (జియోసినిమా): పాపులర్‌ హాలీవుడ్‌ మూవీ ఆక్వామ్యాన్‌ 2లో జాసన్‌ మోమోయ్‌, పాట్రిక్‌ విల్సన్‌ లీడ్‌ రోల్స్‌ ప్లే చేశారు. ఈ మూవీ తెలుగులో జియో సినిమాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • డ్యూన్‌ 2 (జియోసినిమా): సూపర్‌ హిట్‌ మూవీ డ్యూన్‌ 2 ప్రస్తుతం జియోసినిమాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ హాలీవుడ్‌ మూవీలో తిమోతీ చలమెట్‌, జెండయా, రెబెక్కా ఫెర్గూసన్ కీలక పాత్రలు పోషించారు.

రూ.15 కోట్ల బడ్జెట్​తో రూ.900 కోట్ల కలెక్షన్లు - ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే? - Highest Profits Indian movie

రిలీజ్ కాకుండానే రికార్డు - రూ. 95 కోట్లకు అజిత్ మూవీ ఓటీటీ రైట్స్​! - Ajith Good Bad Ugly OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.