ETV Bharat / entertainment

'భారతీయుడు 2' రిలీజ్​లో ట్విస్ట్- విడుదల మళ్లీ వాయిదా- వచ్చేది అప్పుడే! - Indian 2 Release Date

author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 7:11 PM IST

Updated : May 4, 2024, 10:55 PM IST

Indian 2 Release Date
Indian 2 Release Date(Source: ANI)

Indian 2 Release Date: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్​, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్​లో రూపొందిన సినిమా 'భారతీయుడు -2'. ఈ సినిమా జూన్​లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, మరోసారి మూవీ రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తోంది.

Indian 2 Release Date: లోకనాయకుడు కమల్ హాసన్​- డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు 2' ( ఇండియన్ 2) మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల మేకర్స్‌ షేర్ చేసిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్​గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్​లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు. కానీ, ఎప్పుడు అనేది డేట్ ప్రకటించలేదు. అయినప్పటికీ జూన్ 13న విడుదల కానుందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపించింది.

అయితే ఈ సినిమా రిలీజ్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. పలు కారణాల వల్ల మూవీ మళ్లీ పోస్ట్​పోన్ కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా చెప్పనట్లు జూన్​లో కాకుండా భారతీయుడు- 2ని జూలైకి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. సినిమా రిలీజ్ డేట్​ను జూలై 13కు మార్చేందుకు మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారట. మరి ఈ వాయిదా అండ్ సినిమా రిలీజ్ డేట్​ గురించి మేకర్స్​ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఈవెంట్​కు చీఫ్ గెస్ట్​లుగా స్టార్లు: సినిమా రిలీజ్​కు ముందు మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మే 16న గ్రాండ్​గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల టాక్. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ ఆడియో లాంఛ్ ఈవెంట్​కు వేదిక కానుందట. అయితే ఈ గ్రాండ్ లాంఛ్​కు గ్లోబల్ స్టార్ రామ్​చరణ్‌ అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాలో కమల్​తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, బాబీ సింహా, మధుబాల, కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జేయింట్స్​ బ్యానర్​పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, లైకా సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు'- భారతీయుడు 2 రిలీజ్ ఎప్పుడంటే ? - Bharateeyudu 2 Release Date

గ్రాండ్​గా ఆడియో లాంఛ్​ - 'భారతీయుడు' కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోలు - Indian 2 Audio Launch Guests

Last Updated :May 4, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.