ETV Bharat / entertainment

సుహాస్​కు సూపర్ ఛాన్స్​ - కీర్తి సురేశ్​ పక్కన హీరోగా సినిమా

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 11:45 AM IST

సుహాస్​కు సూపర్ ఛాన్స్​ - కీర్తి సురేశ్​ పక్కన హీరోగా సినిమా
సుహాస్​కు సూపర్ ఛాన్స్​ - కీర్తి సురేశ్​ పక్కన హీరోగా సినిమా

Suhas KeerthiSuresh New Movie : కమెడియన్ కమ్ హీరో సుహాస్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. మహానటి కీర్తి సురేశ్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ వివరాలు.

Suhas KeerthiSuresh New Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. మహానటి సినిమా నుంచి ఈ అందాల భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళం, మలయాళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్​గా రాణిస్తోంది. అటు అగ్రహీరోలతో కలిసి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న కీర్తి సురేశ్ టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సుహాస్​తో నటించడానికి రెడీ అయింది.

షార్ట్ ఫిలిమ్స్​తో మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణించిన నటుడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మొదటి మూవీతో మంచి విజయం సాధించాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్​, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు చిత్రాలతో మంచి సక్సెస్​లను అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్​లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోయిన్​ కీర్తి సురేశ్​తో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నారు.

సుహాస్-కీర్తిసురేశ్ ప్రధాన పాత్రాల్లో ఉప్పకప్పురంబు అనే మూవీ తెరకెక్కనుంది. ఐవి శశి ఈ మూవీ డైరెక్టర్. ఎల్లనార్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వసంత్ మురళీ మరిగంటి కథను అందించనున్నారు. అయితే ఇది థియేటర్​ రిలీజ్​ కాదు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఒరిజినల్ సినిమా ఇది. ముంబయి వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్లో ఈ ప్రాజెక్టును అఫీషియల్​గా ప్రకటించి టైటిల్ లాంఛ్​ చేశారు. ఈ కార్యక్రమానికి కీర్తి సురేశ్ హాజరు కానప్పటికీ సుహాస్ మాత్రం వేదికపై సందడి చేశారు.

ఓ గ్రామంలో స్మశానవాటికలో ఖాళీ స్థలం లేకపోవడంతో ఆ ఊరు ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను కనుగొన్నారనేది ఈ సినిమా స్టోరీ లైన్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో సుహాస్​తో కలిసి నటించేందుకు కీర్తి సురేశ్ ఒప్పుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.

సమంత సిటాడెల్ గ్లింప్స్​ - యాక్షన్​ సీన్స్​ అదిరిపోయాయ్​!

హీరోయిన్ అనుష్క ప్రతీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.