ETV Bharat / entertainment

సమంత సిటాడెల్ గ్లింప్స్​ - యాక్షన్​ సీన్స్​ అదిరిపోయాయ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 10:41 AM IST

Updated : Mar 20, 2024, 11:28 AM IST

సమంత సిటాడెల్ గ్లింప్స్​ - యాక్షన్స్ సీన్స్​తో అదరగొట్టేసింది!
సమంత సిటాడెల్ గ్లింప్స్​ - యాక్షన్స్ సీన్స్​తో అదరగొట్టేసింది!

Samantha Citadel : సమంత నటించిన సిటాడెల్​ ఇండియన్ వెర్షన్ వెబ్​సిరీస్​ గ్లింప్స్ రిలీజైంది. ఇందులో సామ్ యాక్షన్ సీక్వెన్స్​లతో అదరగొట్టేసింది. మీరు చూశారా?

Samantha Citadel : సినిమాల షూటింగ్​లకు ఏడాది నుంచి బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్​ రోగం నుంచి కోలుకుంటోంది. అందుకే పెండింగ్ ఉన్న తన సిటాడెల్​ వెబ్​సిరీస్​ను రీసెంట్​గానే కంప్లీట్​ చేసింది. త్వరలోనే ఈ సిరీస్​ రిలీజ్​కు రెడీ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించింది. ఫ్యామిలీ మెన్​ సిరీస్​తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్​ను తెరకెక్కించారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్​తో కలిసి సమంత ఈ సిరీస్​లో నటించింది. హాలీవుడ్​లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇక్కడ సమంత పోషించింది. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్​ను రిలీజ్ చేశారు మేకర్స్. సమంత దీన్ని తన ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్​తో నడిచింది. మరోసారి యశోద చిత్రం తర్వాత సామ్ ఈ సిరీస్​లో యాక్షన్ పాత్రలో సందడి చేసింది.

Amazon Citadel Release Date : ఈ గ్లింప్స్​ విడుదల సందర్భంగా సమంత మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేసింది. యాక్షన్‌ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం ఇలాంటి చిత్రంలో భాగం అవుతానని చివరి వరకు కూడా అనుకోలేదు. ఈ సిరీస్‌ కోసం శారీరకంగా చాలా శ్రమించాను. దర్శక ద్వయం రాజ్‌, డీకే చాలా టాలెంటెడ్ డైరెక్టర్స్. అమెరికన్‌ సిటాడెల్‌ను ఇండియన్ ఆడియెన్స్​కు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇదొక అద్భుతమైన స్పై యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా. సినిమాలోని సీన్స్​, లవ్ స్టోరీ ఎంతో బాగుంటాయి అని చెప్పుకొచ్చింది. ఇంకా ఈ సిరీస్​లో కే కే మేనన్‌, సిమ్రాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్​ అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.

ఇకపోతే సమంత ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన శాకుంతలం. యశోద వరుసగా నిరాశ పరిచాయి. చివరిగా ఆమె నటించిన ఖుషి బాక్సాఫీస్ ముందు యావరేజ్​గా నిలిచింది. అంతగా వసూళ్లు రాలేదు. మరి ఈ సిటాడెల్ ఎలాంటి రిజల్ట్​ను అందిస్తుందో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హీరోయిన్ అనుష్క ప్రతీకారం

సిటాడెల్​ - స్టన్నింగ్​ లుక్స్​తో హీట్ పెంచిన సమంత

Last Updated :Mar 20, 2024, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.