ETV Bharat / entertainment

సిటాడెల్​ - స్టన్నింగ్​ లుక్స్​తో హీట్ పెంచిన సమంత

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 7:39 AM IST

Updated : Mar 20, 2024, 11:48 AM IST

సిటాడెల్​ - ప్రమోషన్స్​లో హీట్ పెంచిన సమంత
సిటాడెల్​ - ప్రమోషన్స్​లో హీట్ పెంచిన సమంత

Citadel Samantha Hot Photoshoot : హీరోయిన్ సమంత తాజాగా మరోసారి హాట్ ఫొటోషూట్స్​తో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ పిక్స్​ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నాయి. అవి మీరు చూశారా?

Citadel Samantha Hot Photoshoot : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత - ఈ పేరు దాదాపుగా చాలా మంది సినీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఏం మాయ చేసావే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాలోనే తన క్యూట్ యాక్టింగ్​తో ఎంతో మంది కుర్రాళ్ల మదిని దోచింది. అనంతరం ఒక్కో సినిమాకు తన టాలెంట్​ను ప్రూవ్ చేసుకుంటూ కెరీర్​లో ముందుకెళ్లి స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా తమిళంలోనూ నటించి మంచి పాపులారిటినీ సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకోవడం, కాపురం చేయడం, విడిపోవడం కూడా అయిపోయింది. డివొర్స్ తర్వాత అయితే కెరీర్​లో మంచి జోరు చూపించింది. ఓ దశలో వరుస హిట్లతో దూసుకెళ్లింది. పుష్ప ఊ అంటావా, ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో నేషనల్ వైడ్​గా క్రేజ్​ సంపాదించుకుంది. ఇదే సమయంలో మయోసైటిస్​ వ్యాధితో కూడా బాధపడింది. కానీ ట్రీట్మెంట్​ను కొనసాగిస్తూనే షూటింగ్​లలో పాల్గొనేది. కానీ ఓ ఏడాది నుంచి షూటింగ్​లకు పూర్తిగా ప్యాకప్ చెప్పేసి ఆరోగ్యంపైనే ఫుల్ కాన్సెన్​ట్రేషన్ పెట్టింది. ఇప్పుటివరకు ఏ సినిమాలకు సైన్ చేయకుండా లైఫ్​ను హ్యాపీగా గడుపుతోంది.

అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలను మాత్రం సమంత వదలలేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్​తో వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ఏవేవో కొటేషన్లు, బోల్డ్ ఫొటోషూట్లతో ప్రస్తుతానికి కెరీర్ నెట్టుకొస్తోంది. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండానే ముందుకు వెళ్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఇలాంటివి చేస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఈ వారం రోజుల్లో ఆమె హాట్ ఫొటోషూట్స్​తో రెచ్చిపోవడం మరింత ఎక్కువైంది. తాజాగా అయితే తన కొత్త సినిమా సిటాడెల్ రిలీజ్ ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఈవెంట్​కు హాజరైన సామ్​ నెవ్వర్​ బిఫోర్ అనే రేంజ్​లో ఫొటోస్​ను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Samantha Citadel Webseries : ఇకపోతే సిటాడెల్​ను - ది ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జీ లాంటి హిట్​ సిరీస్‌లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే రూపొందిస్తున్నారు. ఇందులో వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటించారు. ఈ ప్రాజెక్టుకు సిటాడెల్‌: హనీ బన్నీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కే కే మేనన్‌, సిమ్రాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ ప్రాజెక్టు అమెజాన్‌ ప్రైమ్‌లో త్వరలోనే విడుదల కానుంది.

RRR సీక్వెల్​పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్​!

అమెజాన్​ ప్రైమ్ - భారీ రేంజ్​లో రైట్స్ సొంతం - ఓటీటీలో ఏయే సినిమాలు స్ట్రీమ్ కానున్నాయంటే ?

Last Updated :Mar 20, 2024, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.