ETV Bharat / entertainment

'ఆదిపురుష్‌' రిజల్ట్​పై సైఫ్‌ అలీఖాన్‌ - 'రిస్క్ చేశారన్నారు'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 8:05 PM IST

Saif Ali Khan Adipurush Movie
Saif Ali Khan Adipurush Movie

Saif Ali Khan Adipurush Movie : ప్రభాస్- ఓంరౌత్ కాంబినేషనలో వచ్చిన మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్'. అయితే రావణుడి పాత్రలో కనిపించిన సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంపై తాజాగా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే

Saif Ali Khan Adipurush Movie : రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా ఓంరౌత్‌ తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్‌' . భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. అంతే కాకుండా పలు విషయాల వల్ల విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ చిత్రం గురించి స్పందించారు.

'జీవితంలో దృష్టిపెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను వాస్తవంలో బతకాలని అనుకుంటాను. ఓటమి గురించి ఆలోచించను. ఉదాహరణకు 'ఆదిపురుష్‌' సినిమానే తీసుకుందాం రిస్క్​ చేశారని అందరూ అన్నారు. ఎంతోమంది విమర్శించారు. కొత్తగా ప్రయత్నించినపుడు హిట్‌ కాకపోయినా అధైర్యపడకూడదు. దురదృష్టం కొద్దీ అది విజయం సాధించలేదనుకోవాలి. తర్వాత సినిమాలో రెట్టింపు ఉత్సాహంతో అలరించాలని పని చేయాలి. నేను అలానే చేశాను' అని సైఫ్​ అలీఖాన్ అన్నారు.

అయితే ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి విడుదలయ్యే వరకు వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి. పాత్రల వేషధారణ నుంచి సన్నివేశాల్లో ఉపయోగించిన భాష, అలానే చిత్రీకరించిన ప్రదేశాలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకోవటంలో విఫలమైంది. అంతే కాదు ఈ సినిమాపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. మనోభావాలను పట్టించుకోకుండా పురాణాలను అపహాస్యం చేశారంటూ వివిధ హైకోర్టుల్లో కేసులు పెట్టారు. అయితే వాటిని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Adipurush Movie Cast : రామాయణం ఆధారంగా డైరెక్టర్​ ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. అయినా మంచి వసూళ్లను సాధించింది. చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌ నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌గా కనిపించారు. ఇక ఈ సినిమాకి సంగీతం ప్ర‌ధాన‌బ‌లం. జై శ్రీరామ్‌, శివోహం, ప్రియ‌మిథునం పాట‌లు, వాటి విజువల్స్​ సినిమాకి స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచాయి. అజ‌య్ - అతుల్‌ స‌మ‌కూర్చిన బాణీలు చాలా బాగున్నాయి. సంచిత్, అంకిత్ ద్వ‌యం నేప‌థ్య సంగీతం క‌ట్టిప‌డేసింది. కానీ సాగతీత సన్నివేశాలు, భావోద్వేగాలు కొర‌వ‌డ‌టం, కొన్ని పేలవ విజువల్స్​ సినిమాపై బాగా ఎఫెక్ట్​ చూపాయి.

షూటింగ్​లకు ప్రభాస్​ బ్రేక్​ - సమంతను ఫాలో అవుతున్నారా?

ప్రభాస్​ 'కల్కి'లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు​ - స్క్రీన్​ను షేక్​ చేసే రోల్స్​లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.