ETV Bharat / entertainment

సాయి పల్లవినే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో! - ఎందుకంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 2:35 PM IST

పలు కండిషన్స్​తో చాలా మంది హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిన సాయిపల్లవిని ఈ సారి ఓ స్టార్ హీరో రిజెక్డ్ చేశారట. ప్రస్తుతం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు.

సాయి పల్లవినే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో! - ఎందుకంటే?
సాయి పల్లవినే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో! - ఎందుకంటే?

Sai pallavi Vijay Devarkonda : సాయి పల్లవి ఈ పేరుకు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. లేడీ పవర్ స్టార్ అంటుంటారు. నేచురల్ యాక్టింగ్​తో ఎంతో మంది మనసులు దోచుకున్న ఈ భామ నటించే విషయంలో తాను ఎంచుకునే పాత్రల విషయంలో కొన్ని నిబంధనలను పాటిస్తుంటుంది. స్కిన్ షో, వల్గర్ సీన్స్, హీరో డామినేషన్ వంటివి ఉంటే సినిమా చేయదు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్​గా ఉంటేనే సినిమాలో నటిస్తుంటుంది. అంతే కానీ కేవలం గ్లామర్​ రోల్స్​ మాత్రమే చేయదు.

ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు అంటే అందాలు ఆరబోయాలి, హగ్గులు, కిస్​లు ఉండాలి అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్​ను దక్కించుకుంది సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి సినీ ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్​ను క్రియేట్ అయింది.

అయితే ఈమె తమ సినిమాల్లో నటించాలని చాలా మంది స్టార్ హీరోలు కోరుకుంటుంటారు. అప్పట్లో స్వయంగా చిరంజీవినే తన సినిమాలో నటించమని సాయిపల్లవిని అడిగిన సందర్భం కూడా ఉంది. కానీ ఈమె మాత్రం తనకు పాత్ర నచ్చితే కానీ ఓకే చేయదు. అలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను కూడా రిజెక్ట్ చేసిందని బయట టాక్ వినిపిస్తుంటుంది. అయితే తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది.

ఏంటంటే ఈ సారి ఓ స్టార్ హీరోనే సాయి పల్లవిని రిజెక్ట్ చేశారట. అవును ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలే బయట కనిపిస్తున్నాయి.ఆ హీరో కూడా మరెవరో కాదు విజయ్ దేవరకొండ అంట. ఇప్పుడాయన ఫ్చామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నారట. కానీ ఆయన మాత్రం సాయి పల్లవిని కాదని మృణాల్ ఠాకూర్​ను సెలెక్ట్ చేసుకున్నారట మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇకపోతే సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్య తండేల్​తో పాటు ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రభాస్ ఇన్నేళ్ల పాటు పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణమిదా?

RC 16 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా - వేడుకలో స్పెషల్ అట్రాక్షన్​గా జాన్వీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.